తెలంగాణ

telangana

ETV Bharat / sports

టీ20ల్లో యువ క్రికెటర్ రికార్డు - 33 బంతుల్లోనే సెంచరీ - నమీబియా బ్యాటర్ ఫాస్టెస్ట్ సెంచరీ

Fastest T20I Century : టీ20 క్రికెట్​లో నమీబియా ప్లేయర్ జాన్​ నికోల్ లోఫ్టీ ఈటన్ చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20 ఫార్మాట్​లో అత్యంత వేగవంతమైన సెంచరీని నమోదు చేశాడు. కేవలం 33 బంతుల్లోనే శతకం సాధించి రికార్డుకెక్కాడు.

Fastest T20I Century
Fastest T20I Century

By ETV Bharat Telugu Team

Published : Feb 27, 2024, 8:38 PM IST

Fastest T20I Century : నమీబియా క్రికెటర్‌ జాన్‌ నికోల్‌ లోఫ్టీ ఈటన్‌ చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత వేగవంతమైన సెంచరీ బాదిన బ్యాటర్‌గా అవతరించాడు. నేపాల్‌ వేదికగా జరిగిన టీ20 సిరీస్‌లో ఈ ఘనత సాధించాడు. కేవలం 33 బంతుల్లోనే వంద పరుగులు పూర్తి చేసి సరికొత్త రికార్డు నెలకొల్పాడు.

నేపాల్​ వేదికగా నమీబియా - నెదర్లాండ్ మధ్య జరగుతున్న టీ20 సిరీస్​లో ఈ ఘనత సాధించాడు. మంగళవారం జరిగిన తొలి టీ20 మ్యాచ్​లో 11 ఓవర్​లో క్రీజులోకి వచ్చిన ఈటన్ తన బ్యాటింగ్​తో బౌలర్లకు చుక్కలు చూపించాడు. 11 ఫోర్లు, 8 సిక్సులు బాది కేవలం 33 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. దీంతో అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించిన ఆటగాడిగా అవతరించాడు. దీంతో పాటు ఈ టెస్ట్​లో 'మ్యాన్​ ఆఫ్​ ది మ్యాచ్'​గా నిలిచాడు. ఇప్పటివరకు నేపాల్‌ ఆటగాడు కుశాల్‌ మల్లా పేరు మీదున్న ఈ రికార్డ్‌ను నికోల్‌ అధిగమించాడు.

గతేడాది ఆసియా క్రీడల్లో నేపాల్ - మంగోలియా మధ్య జరిగిన మ్యాచ్‌లో కుశాల్‌ వేగవంతమైన సెంచరీని సాధించాడు. 34 పరుగుల్లో శతకం పూర్తి చేశాడు. ఇందులో 8 ఫోర్లు, 12 సిక్స్‌లు ఉన్నాయి. ఈటన్​ తాజా రికార్డుతో రెండో స్థానంలో ఉన్నారు. 35 బంతుల్లో సెంచరీ చేసిన టీమ్​ఇండియా ఆటగాడు రోహిత్ శర్మ మూడో స్థానంలో ఉన్నారు. అదే స్థానంలో సౌతాఫ్రికా ఆటగాడు డేవిడ్ మిల్లర్, చెక్ రిపబ్లిక్‌కు చెందిన సుధేష్ విక్రమశేఖర కూడా ఉన్నారు.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే - మొదట బ్యాటింగ్ చేసిన నమీబియా 22 ఏళ్ల జాన్ నికోల్ లోఫ్టీ విధ్వంసంతో 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 206 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్‌లో జాన్ నికోల్ ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. క్రీజులోకి వచ్చే సమయానికి నమీబియా స్కోర్ 10.4 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 62 పరుగులు మాత్రమే చేసింది.

మొత్తంగా 36 బంతుల్లో ఈటన్ 101 పరుగులు చేసి చివరి ఓవర్‌లో ఔటయ్యాడు. ఓపెనర్ మలన్ క్రుగర్ 48 బంతుల్లో 59 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అనంతరం నేపాల్ జట్టు 18.5 ఓవర్లలో 186 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో నేపాల్‌పై నమీబియా 20 పరుగుల తేడాతో గెలిచింది.

ఒలింపిక్స్​ టు ఫిఫా - క్రీడా రంగంలో అద్భుతమైన మెగా టోర్నీలివే!

IPL 2024 : షమీ ఔట్ - కోహ్లీ డౌట్!

ABOUT THE AUTHOR

...view details