Rohit Sharma RCB :2025 ఐపీఎల్‌లో స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ ఏ జట్టుతో ఉండాడనేది ఆసక్తిగా మారింది. అతడిని ప్రస్తుత ఫ్రాంచైజీ ముంబయి అట్టిపెట్టుకుంటుందా? లేదా వదులుకుంటుందా? అనేది సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తుంది. ఒకవేళ రోహిత్ వేలంలోకి వస్తే అతడిని దక్కించుకునేందుకు ఫ్రాంచైజీల మధ్య తీవ్ర పోటీ ఉండడం ఖాయం. భారీ మొత్తానికి రోహిత్ అమ్ముడయ్యే ఛాన్స్‌లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ నుంచి రోహిత్‌కు ఓ రిక్వెస్ట్ వచ్చింది. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
భారత్- న్యూజిలాండ్ తొలి టెస్టు మధ్యలో ఈ సంఘటన జరిగింది. కెప్టెన్ రోహిత్ శర్మ డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్తున్న క్రమంలో 'భాయ్ నువ్వు ఐపీఎల్‌లో ఏ జట్టులో ఉంటావు?' అని ఓ ఫ్యాన్ అడిగాడు. దానికి రోహిత్ స్పందిస్తూ, 'నీకు ఏ టీమ్ కావాలో చెప్పు' అని రిప్లై ఇచ్చాడు. దానికి 'నువ్వు ఆర్సీబీకి వచ్చెయ్ భయ్యా' అని సదరు ఫ్యాన్ కోరాడు. దీంతో ఫ్యాన్స్‌కు చేయి ఊపుతూ రోహిత్ డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లిపోయాడు.
మరి రోహిత్‌ను ముంబయి కొనసాగిస్తుందా, వదిలేస్తుందా? అనేది చూడాలి. ఇక అన్ని ఫ్రాంచైజీలు తాము అట్టిపెట్టుకున్న ఆటగాళ్ల జాబితాను అక్టోబర్ 31లోపు ఐపీఎల్ బోర్డుకు సమర్పించాల్సి ఉంది. ఆపై నవంబర్ చివరి లేదా డిసెంబర్ తొలి వారంలో మెగా వేలం జరగే ఛాన్స్ ఉంది.