Yuvraj Singh On His Father:టీమ్ఇండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తన తండ్రి యోగ్రాజ్ మానసిక ఆరోగ్య సమస్యలు ప్రస్తావించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తన తండ్రికి మానసిక సమస్యలు ఉన్నాయంటూ యువీ పేర్కొన్నట్లు ఆ వీడియోలో ఉంది. అయితే యోగ్రాజ్ తాజాగా భారత్‌కు వరల్డ్‌కప్ అందించిన కెప్టెన్లు ఎంఎస్ ధోని, కపిల్ దేవ్‌పై యోగ్రాజ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో ఈ క్లిప్ మళ్లీ తెరపైకి వచ్చింది.
ఇటీవల జీ స్విచ్ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యోగ్రాజ్ మాట్లాడారు. బహిరంగంగా మాట్లాడే స్వభావం ఉన్న యోగ్రాజ్, తన కుమారుడి క్రికెట్ కెరీర్‌ను ధోనీ నాశనం చేశాడని ఆరోపిస్తూ విరుచుకుపడ్డారు. టీమ్‌లో చోటు లేకుండా దాదాపు రెండేళ్ల పాటు ఉన్న తర్వాత 2019లో యువరాజ్ రిటైర్‌మెంట్ ప్రకటించాడని, ధోని సపోర్ట్ చేసుంటే మరికొంత కాలం ఆడుండేవాడని యోగ్రాజ్ పేర్కొన్నాడు.
ధోనీని క్షమించను!
యోగరాజ్ మాట్లాడుతూ, 'ఎంఎస్ ధోనీని నేను క్షమించను. అద్దంలో ధోని తన ముఖాన్ని చూసుకోవాలి. అతను చాలా పెద్ద క్రికెటర్, కానీ నా కొడుకు విషయంలో ఏం చేశాడు. ప్రతిదీ ఇప్పుడు బయటకు వస్తోంది. దాన్ని జీవితంలో ఎప్పటికీ క్షమించలేము. ఆ వ్యక్తి (ఎంఎస్ ధోని) నా కొడుకు జీవితాన్ని నాశనం చేశాడు. యువరాజ్ ఇంకా నాలుగు నుంచి ఐదు సంవత్సరాలు ఆడగలడు. అందరికీ యువరాజ్ లాంటి కొడుకుకు జన్మనివ్వాలని నేను ధైర్యంగా చెబుతాను.’ అన్నారు.
కపిల్ దేవ్‌పై ఆగ్రహం
మరో దిగ్గజ క్రికెటర్ 1983 ప్రపంచ కప్ గెలిచిన కెప్టెన్ కపిల్ దేవ్‌ను కూడా యోగ్రాజ్ విమర్శించారు. కపిల్ కంటే తన కుమారుడు యువరాజ్‌ని మరింత సక్సెస్‌ఫుల్ క్రికెటర్‌గా చేస్తానని కపిల్ దేవ్‌కు వాగ్దానం చేసినట్లు యోగ్రాజ్ వెల్లడించారు. యోగరాజ్, కపిల్ మధ్య సత్సంబంధాలు లేవు. తనను జట్టు నుంచి తప్పించడంపై కపిల్‌దేవ్‌పై గతంలో ఆరోపణలు చేశారు. యోగ్రాజ్ 1980-81 మధ్య టీమ్ఇండియా తరఫున ఒక టెస్టు, ఆరు వన్డేలు ఆడారు. 'మా కాలంలోని గొప్ప కెప్టెన్, కపిల్ దేవ్. నేను అతనితో చెప్పాను, నిన్ను ప్రపంచమంతా శపించే స్థితిలో వదిలివేస్తాను. ఇప్పుడు యువరాజ్ సింగ్‌కు 13 ట్రోఫీలు ఉన్నాయి. నీకు ప్రపంచ కప్ మాత్రమే ఉంది' అని యోగ్రాజ్ ఆగ్రహంతో పేర్కొన్నాడు.
తండ్రి మానసిక ఆరోగ్యంపై యవరాజ్
ఈ వ్యాఖ్యలు వైరల్ అవ్వడం వల్ల గతంలో తండ్రి గురించి యువరాజ్ చేసిన వ్యాఖ్యలు తెరపైకి వచ్చాయి. గత ఏడాది నవంబర్‌లో రణవీర్ అల్లాబాడియాతో జరిగిన పాడ్‌కాస్ట్‌లో యువరాజ్ పాల్గొన్నాడు. ఆ షోలో యువరాజ్ సింగ్, తన తండ్రి మానసిక ఆరోగ్య సమస్యల గురించి మాట్లాడాడు. 'నా తండ్రికి మానసిక సమస్య ఉందని నేను భావిస్తున్నాను. అతడు దాని గురించి అంగీకరించడానికి ఇష్టపడడు. ఇది అతడు గుర్తించాల్సిన విషయం. కానీ అంగీకరించడు' అని యువరాజ్ చెప్పాడు.
నా కుమారుడి కెరీర్‌ను ధోనీయే నాశనం చేశాడు: యువరాజ్ తండ్రి - Yuvraj Singh Father On Ms Dhoni
17 ఏళ్లుగా చెక్కుచెదరని యువరాజ్ రికార్డ్ - బద్దలు కొట్టిన యంగ్ ప్లేయర్ - అదేంటంటే? - Samoa Vs Vanuatu T20 WC Qualifier