తెలంగాణ

telangana

ETV Bharat / sports

'గేమ్​ తర్వాత ల్యాప్​టాప్​ పట్టుకుని కూర్చుంటాడు'- 'ఎంప్లాయి ఆఫ్​ ద డికేడ్' ఇతడే! - Saurabh Netravalkar Work

Saurabh Netravalkar Work : యూఎస్​ జట్టులో కీలక పాత్ర పోషిస్తూ ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకుంటున్నాడు యంగ్ క్రికెటర్ సౌరభ్ నేత్రావల్కర్. అయితే స్వతహాగా సాఫ్ట్​వేర్ ఉద్యోగీగా ఉంటూనే క్రికెట్​లో రాణిస్తున్నాడు. అయితే మ్యాచ్ తర్వాత కూడా తన ప్రొఫెషన్​ను కొనసాగిస్తున్నాడట సౌరభ్​. ఎందుకుంటే?

Saurabh Netravalkar Work
Saurabh Netravalkar Work (ANI, Associated Press)

By ETV Bharat Telugu Team

Published : Jun 21, 2024, 12:44 PM IST

Saurabh Netravalkar Work : ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్ కప్‌లో మీడియం పేసర్‌గా అదరగొట్టేస్తున్నాడు యూఎస్ఏ ప్లేయర్ సౌరభ్‌ నేత్రావల్కర్‌. అయితే ఇతడు కేవలం క్రికెటర్ మాత్రమే కాదు. ఓ ఫుల్​టైమ్ సాఫ్ట్​వేర్ ఇంజినీర్​ కూడా. అయితే మ్యాచుల్లో ఎంత ప్రొఫెషనల్​గా ఉంటాడో, మ్యాచ్​ తర్వాత కూడా అంతే నిబద్దతతో తన ఆఫీస్​ వర్క్​ను క్రమం తప్పకుండా చేస్తాడట. ఈ విషయాన్ని తన సోదరి నిధి సోషల్ మీడియా వేదికగా ద్వారా వెల్లడించింది.

ప్రతీసారి మ్యాచ్ అయిపోయిన తర్వాత ల్యాప్‌ట్యాప్ తీసుకుని ఒరాకిల్‌లో తన సాఫ్ట్ వేర్ జాబ్ చేసుకుంటాడట. సీనియర్ ఎగ్జిక్యూటివ్ అయిన సౌరబ్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా, స్పోర్ట్స్‌మన్‌గా మల్టీ టాస్కర్ అంటూ రీసెంట్‌గా అతని సిస్టర్ నిధి ఈ విషయాన్ని రివీల్ చేశారు. అతను డెడికేటెడ్ పర్సన్ మాత్రమే కాకుండా మల్టీ టాస్కింగ్ వ్యక్తి అని పేర్కొన్నారు. గేమ్ తర్వాత కూడా ప్రతీ రోజు ల్యాప్ ట్యాప్ తీసుకుని ఎక్కడ ఉన్నా పనిని మాత్రం నిర్లక్ష్యం చేయడని ఆమె వెల్లడించారు.

"అతని కెరీర్ అంతా తనను సపోర్ట్ చేసేవాళ్లను దక్కించుకున్న సౌరబ్ చాలా లక్కీ. గేమ్ లేని రోజున తన జాబ్ కోసం 100 శాతం సమయాన్ని వెచ్చిస్తాడు. ల్యాప్‌టాప్ ఎక్కడికైనా తీసుకెళ్లిపోతుంటాడు. గేమ్ అయిపోయిన వెంటనే కూర్చొని పనిచేస్తూ కనిపిస్తాడు" అని సౌరబ్ సోదరి సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. అతడి డెడికేషన్, మల్టీ టాస్కింగ్ ఎబిలిటీ తెలుసుకున్నప్పటి నుంచి నెటిజన్లు సౌరభ్​కు కాంప్లిమెంట్స్​ ఇవ్వకుండా ఉండలేకపోతున్నారు.

ఇక సౌరబ్ కెరీర్‌లో 30 టీ20 గేమ్‌లలో 31 వికెట్లు పడగొట్టాడు. 48 వన్డే మ్యాచ్‌లలో 73 వికెట్లు తీసి మంచి బౌలర్​గా పేరు తెచ్చుకున్నాడు. గతంలో టీమ్ఇండియా తరఫున అండర్-19 వరల్డ్ కప్‌లో ఆడాడు. ముంబయి జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తూ రంజీ ట్రోఫీలలో కూడా సత్తా చాటాడు.

ప్రస్తుతం సౌరబ్ ప్రాతినిధ్యం వహిస్తున్న యూఎస్ఏ జట్టు ఇటీవలె జరిగిన మ్యాచుల్లో కెనడా, పాకిస్థాన్ లాంటి సీనియర్ జట్లను చిత్తుగా ఓడించింది.ఇప్పటికే యూఎస్ఏ జట్టులో ఐదేళ్లుగా ఆడుతున్న సౌరబ్ మరో ఐదేళ్లు ఇలాగే ఆడితే వన్డ్ వరల్డ్ కప్‌లోకి కూడా యూఎస్ఏ జట్టు అర్హత సాధించేందుకు సహకరిస్తాడని ఆ జట్టు అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

USA స్టార్ సౌరభ్ లవ్​ స్టోరీ- అతడి భార్య తెలుగమ్మాయా? - Saurabh Netravalkar Love Story

'అది జీవితంలో మర్చిపోలేనిది, ఆ క్షణం ఎంతో ఎమోషనలయ్యా'!

ABOUT THE AUTHOR

...view details