Dhoni Business Investments:టీమ్ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ క్రికెట్ చరిత్రలో మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్. కేవలం క్రికెట్ పరంగానే కాదు డబ్బు సంపాదన, ఆదాయం పరంగా ధోనీ స్టైలే డిఫరెంట్ అని చెప్పవచ్చు. క్రికెట్లో తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకున్న ధోనీ ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడు. అయితే ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి తప్పుకున్నా, ధోనీ ఇప్పటికీ ఐపీఎల్ ఆడుతున్నాడు.
కాగా, టీమ్ఇండియాకు మూడు ఐసీసీ ట్రోఫీ (టీ20 వరల్డ్‌కప్, వన్డే ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీ)లు అందించిన ధోనీ ఐపీఎల్ ఆడుతూనే తనకున్న క్రేజ్ క్యాష్ చేసుకోవడంలోనూ ముందున్నాడు. పలు బ్రాండ్లకు అంబాసిడర్ గా ఉన్న ఝార్ఖండ్ డైనమైట్ యాడ్స్ రూపంలోనూ రెండు చేతులా సంపాదిస్తున్నాడు. అంతేకాదు ఈ మధ్య పలు వ్యాపారసంస్థల్లోనూ పెట్టుబడి పెట్టాడు. వినోద రంగంలోనూ అడుగుపెట్టాడు. 'ధోనీ ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్' పేరుతో ప్రొడక్షన్ హౌజ్ ఏర్పాటు చేశాడు. మరి ఈ కంపెనీకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎవరో మీకు తెలుసా?
ఆమె ఎవరో కాదు ధోనీకి పిల్లనిచ్చిన అత్తగారు షీలా సింగ్. ఓ జాతీయ పత్రికా కథనం ప్రకారం తన ప్రొడక్షన్ హౌజ్ లో కుటుంబసభ్యులకు పెద్ద పీట వేయాలని భావించిన ధోనీ భార్య సాక్షి సింగ్, ఆమె తల్లి షీలా సింగ్‌కు కంపెనీ కీలక బాధ్యతలను అప్పగించాడు. ప్రస్తుతం వీళ్లు దక్షిణాదిలో తమ బ్యానర్‌పై పలు సినిమాలు నిర్మిస్తున్నారు. కాగా, ధోనీ ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్ విలువ దాదాపు రూ.800కోట్లు ఉంటుందని అంచనా. ఈ కంపెనీలో సాక్షి బిగ్గెస్ట్ షేర్ హోల్డర్‌గా ఉన్నట్లు సమాచారం.