Dhoni Ipl 2024:ఐపీఎల్ 2024లో చెన్నై సూపర్ కింగ్స్ నిరాశపరిచింది. టోర్నమెంట్‌లో ఆఖరి లీగ్ మ్యాచ్ ఓడిపోయి ప్లేఆఫ్స్‌కు చేరుకోలేకపోయింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుపై పైచేయి సాధించలేకపోయింది. గతేడాది టైటిల్ దక్కించుకున్న జట్టు ప్రస్తుత సీజన్లో లీగ్ దశలోనే వెనుదిరగడం విచారకరం. దశాబ్దానికిపైగా చెన్నైకి కెప్టెన్‌గా వ్యవహరించిన ధోనీ ఈ సీజన్లో ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. యంగ్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్‌కు సారధ్య బాధ్యతలు అప్పగించారు.
ప్రస్తుత సీజన్లో చెన్నై ఆడింది 14 మ్యాచ్‌లు అయితే అందులో గెలిచింది 7 మాత్రమే. మ్యాచ్ ఫలితం ఎలా ఉన్నా ధోనీ ఫామ్ చెన్నై అభిమానుల్లో ఏ మాత్రం నిరాశను కనబరచలేదు. 42 ఏళ్ల వయస్సులోనూ ఫుల్ ఫిట్‌నెస్ కనబరిచిన ధోనీ వికెట్ కీపింగ్‌తోపాటు బ్యాటింగ్‌లోనూ అదరగొట్టాడు. దీంతో ధోనీ ఫిట్‌నెస్ చూస్తుంటే రాబోయే ఏడాది కూడా చెన్నై జట్టులో ప్లేయర్‌గా కొనసాగే అవకాశాలున్నాయని విశ్లేషకులు అంటున్నారు.
ఈ సీజన్లో తన మ్యాజిక్‌తో ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నాడిలా
చెన్నై-ముంబయి:ముంబయితో మ్యాచ్‌లో రుతురాజ్ గైక్వాడ్, శివమ్ దూబె హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు. ఈ మ్యాచ్‌లో ఆఖరి ఓవర్లో ధోనీ బ్యాటింగ్‌తో స్టేడియంలో ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించాడు. హార్దిక్ పాండ్య బౌలింగ్‌లో చివరి నాలుగు బంతుల్లో వరుసగా మూడు సిక్సులు సహా 20 పరుగులు పిండుకున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో చెన్నై 20 పరుగుల తేడాతో నెగ్గడం విశేషం.