Chennai Super Kings Playoffs :ఐపీఎల్ 17వ మరి కొద్ది రోజుల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆఖరి పోరు కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఉప్పల్ స్టేడియంలో గురువారం జరగాల్సిన మ్యాచ్ రద్దవడం వల్ల హైదరాబాద్ టీమ్ ప్లేఆఫ్స్‌కు చేరింది. అంతకు ముందే కోల్‌కతా నైట్‌రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ తమ ప్లేఆఫ్స్‌లో తమ స్థానాన్ని సంపాదించుకోవడం వల్ల చివరి బెర్త్ కోసం కోసం గట్టి పోటీ నెలకొంది. ఆ ప్లేస్‌ను ఎవరు దక్కించుకుంటారా అన్న ఉత్కంఠ అభిమానుల్లో మొదలైంది.
ప్రస్తుతం 14 పాయింట్లతో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు గట్టిగా పోరాడాల్సి ఉంటుంది. చెన్నైపై భారీ తేడాతో గెలిస్తేనే ఆర్సీబీ ప్లేఆఫ్స్‌కు చేరుకుంటుంది. ఒకవేళ వర్షం కారణంగా ఆ మ్యాచ్ రద్దయితే చెన్నై ప్లేఆఫ్స్‌కు వెళ్తుంది.
అలా జరిగితే చెన్నై రెండో ప్లేస్
శనివారం జరిగే మ్యాచ్‌లో ఆర్సీబీపై చెన్నై జట్టు తప్పక గెలవాల్సి ఉంటుంది. దీంతోపాటు ఆదివారం పంజాబ్‌తో జరగనున్న మ్యాచ్‌లో హైదరాబాద్ ఓడిపోవాల్సి ఉంటుంది. అంతే కాకుండా రాజస్థాన్ రాయల్స్‌పై కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు విజయం సాధించాలి. ఇదంతా అనుకున్నట్లే జరిగితే అప్పుడు రాజస్థాన్ 16 పాయింట్లు, హైదరాబాద్ 15 పాయింట్లతో ముందంజలో ఉంటాయి. ఇక చెన్నై, ఆర్సీబీపై గెలుపుతో 16 పాయింట్లు సాధిస్తుంది. మెరుగైన నెట్ రన్‌రేట్‌తో రాజస్థాన్‌ను అధిగమించి సెకండ్ ప్లేస్‌కు చేరుకుంటుంది.