ETV Bharat / sports

'హైబ్రిడ్ మోడల్​కు ఒప్పుకుంటారా?- టోర్నీ నుంచి తప్పుకుంటారా?' - పాకిస్థాన్​కు ICC అల్టిమేటం - CHAMPIONS TROPHY 2025

పాకిస్థాన్​కు ICC అల్టిమేటం- హైబ్రిడ్ మోడల్​కు ఒప్పుకోకపోతే టోర్నీ నుంచి ఔట్!

Champions Trophy
Champions Trophy (Source : Getty Images)
author img

By ETV Bharat Sports Team

Published : Nov 29, 2024, 11:05 PM IST

Champions Trophy 2025 : 2025 ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు ఐసీసీ అల్టిమేటం జారీ చేసినట్లు తెలుస్తోంది. తమ మొండి వైఖరి మానుకొని హైబ్రిడ్ మోడల్​కు అంగీకరించాలని పీసీబీకి ఐసీసీ సూచించినట్లు సమాచారం. లేదంటే పాకిస్థాన్ లేకుండానే టోర్నీ జరుగుతుందని పీసీబీకి ఐసీసీ హెచ్చరికలు జారీ చేసిందట. దీనిపై తమ నిర్ణయాన్ని శనివారంలోగా చెప్పాలని దుబాయ్ వేదికగా శుక్రవారం జరిగిన కౌన్సిల్ సమావేశంలో ఐసీసీ హెచ్చరించిందట.

తాజాగా జరిగిన కౌన్సిల్ మీటింగ్​లో పాకిస్థాన్ మినహా దాదాపు అన్ని దేశాలు హైబ్రిడ్ మోడల్​కు ఓకే చెప్పాయట. అందుకే ఐసీసీ కూడా టోర్నీని హైబ్రిడ్ మోడల్​లోనే నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే పీసీబీ ఛైర్మన్ మోసిన్ సఖ్వీ కూడా హైబ్రిడ్ మోడల్​కు అంగీకరిస్తేనే శనివారం మీటింగ్ జరుగుతుందని కౌన్సిల్ మెంబర్ ఒకరు చెప్పారు. లేదంటే పాకిస్థాన్​ లేకుండానే టోర్నీని ఇతర దేశానికి షిఫ్ట్ చేస్తామని స్పష్టం చేసినట్లు సమాచారం.

ఇక శనివారం మరోసారి అన్ని దేశాల బోర్డు ప్రతినిధులు సమావేశం కానున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై అప్పుడే ఓ క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. అయితే 2025 ఛాంపియన్స్​ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉండగా, భద్రతా కారణాల దృష్యా టీమ్ఇండియా అక్కడికి వెళ్లడం లేదు. దీంతో బీసీసీఐ హైబ్రిడ్ మోడల్ ప్రతిపాదన తీసుకొచ్చింది. కానీ, పీసీబీ మాత్రం హైబ్రిడ్ మోడల్​ను అంగీకరించడం లేదు. టోర్నీని పూర్తిగా పాకిస్థాన్​లోనే నిర్వహించాలని పట్టుగా ఉంది.

అయితే టీమ్ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి తప్పుకుంటే మాత్రం ఐసీసీకి భారీ మొత్తంలో అర్థిక నష్టం జరిగే ఛాన్స్ ఉంది. భారత్ టోర్నీలో లేకపోతే బ్రాడ్​కాస్టర్లు, స్పాన్సర్ల నుంచి ఎలాంటి మద్దతు ఉండదు. ఆ విషయం ఐసీసీతోపాటు పీసీబీకి కూడా తెలుసు. అందుకే పాకిస్థాన్ హైబ్రిడ్ మోడల్​కు అంగీకరిస్తే, భారత్ తమ మ్యాచ్​లను దుబాయ్ వేదికగా ఆడే ఛాన్స్ ఉంది. ఒకవేళ అదే జరిగితే త్వరలోనే షెడ్యూల్ కూడా రిలీజ్ కానుంది.

'నేనైతే కరెక్ట్​గానే ఉన్నా - జైషా అలా చేస్తారని అశిస్తున్నా!' - పీసీబీ చీఫ్​

35ఏళ్ల క్రితమే భారత్ కెప్టెన్​​పై దాడి- అందుకే మనోళ్లు పాకిస్థాన్​కు వెళ్లరట!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.