ETV Bharat / entertainment

'పుష్ప 2'లో చీరకట్టు సీన్స్​ - ఆసక్తికర విషయం చెప్పిన అల్లు అర్జున్! - PUSHPA 2 SAREE SCENE

'పుష్ప 2' గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - మూవీటీమ్​పై ప్రశంసలు.

Pushpa 2 Allu arjun
Pushpa 2 Allu arjun (source ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 30, 2024, 9:06 AM IST

Pushpa 2 Allu arjun : 'పుష్ప 2' మరో ఐదు రోజుల్లో విడుదల కానుంది. మొదటి భాగానికి వచ్చిన స్పందనను దృష్టిలో పెట్టుకుని సీక్వెల్​ను మరింత భారీ స్థాయిలో తెరకెక్కించారు! దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్​తో తెరకెక్కించారని ఆ మధ్య ప్రచారం కూడా సాగింది. అయితే తాజాగా 'పుష్ప 2'ను అంతటి భారీ స్థాయిలో తెరకెక్కించేందుకు గల కారణాన్ని తెలిపారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.

"డబ్బు, పేరు అంటూ లెక్కలేసుకుని మేం ఈ సినిమాను చేయలేదు. ఆడియెన్స్​కు అత్యుత్తమమైన అనుభూతిని పంచాలనే ఉద్దేశంతో రూపొందించాం. మా జీవితంలో కీలకమైన ఐదేళ్లు సినిమా కోసమే కేటాయించి పనిచేశాం. వాస్తవానికి మొదటి భాగాన్ని ఓ సాధారణ సినిమాగానే చేశాం. అయితే ఆడియెన్స్​ గొప్పగా ఆదరించి, భారతదేశంలోనే ఓ పెద్ద సినిమాగా 'పుష్ప 2'ను తెరకెక్కించడానికి కారణమయ్యారు. ఈ సినిమా కోసమే మూడేళ్ల పాటు కష్టపడ్డాం" అని అన్నారు అల్లు అర్జున్‌.

Pushpa 2 Saree Scene : కరోనా సమయంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొని పని చేసినట్లు గుర్తు చేసుకున్న అల్లు అర్జున్, తన 20 ఏళ్ల సినీ ప్రయాణంలో సుకుమార్‌ పాత్ర ఎంతో కీలకమని చెప్పారు. తాను ఈ రోజు హీరోగా ఈ స్థాయికి చేరుకోవడానికి కారణం సుకుమారే అని తెలిపారు. "సాధారణంగా ఇలా కష్టపడ్డా, కష్టపడి పనిచేశా అని చెప్పుకోవడానికి పెద్దగా ఇష్టపడను. కానీ సినిమాలో చీర కట్టుకుని చేసిన సీన్​​, నా సినిమా లైఫ్​లోనే ఎప్పుడూ లేనంతగా కష్టపడ్డాను. ఆ గెటప్, ఆ సన్నివేశం తెరపై ఓ మ్యాజిక్‌లా ఉంటుంది" అని అన్నారు.

కాగా, 'పుష్ప 2' చిత్రం ఆరు భాషల్లో 12 వేలకిపైగా థియేటర్లలో విడుదల కానుంది. సుకుమార్‌ రైటింగ్స్‌తో కలిసి మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్​పై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా డిసెంబరు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. రష్మిక హీరోయిన్​గా నటించింది. శ్రీలీల స్పెషల్​ సాంగ్​లో చిందులేసింది.

నాట్​ ఓన్లీ వైల్డ్​ ఫైర్​, ఈసారి ఎమోషనల్​ రైడ్ - ఫ్యామిలీ ఆడియెన్స్​ కోసం 'పుష్ప 2'

'పుష్ప 2' తెలుగు ఈవెంట్ డేట్ ఫిక్స్​- స్పెషల్ గెస్ట్ సుక్కూనే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.