ETV Bharat / offbeat

పొంగల్ స్పెషల్ : క్రిస్పీ అండ్ టేస్టీ "రిబ్బన్ పకోడా, చెక్కలు, కొబ్బరి మురుకులు" - చేసుకోండిలా! - PONGAL 2025 SPECIAL RECIPES

సంక్రాంతికి పిండి వంటలు చేస్తున్నారా? - ఈ స్పెషల్ రెసిపీలపై ఓ లుక్కేయండి!

Sankranti 2025 Special Spicy Recipes
PONGAL 2025 RECIPES (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 3, 2025, 8:57 PM IST

Sankranti 2025 Special Spicy Recipes : సంక్రాంతి వస్తోందనగానే అరిసెలు ముందుగా గుర్తొస్తాయి. ఆ తర్వాత సకినాలు, అప్వాలు, లడ్డూలు వంటి మిగతా వంటకాలను చేసేందుకు వారం పది రోజుల ముందు నుంచే రెడీ అయిపోతుంటారు చాలా మంది మహిళలు. అయితే, అవి మాత్రమే కాకుండా ఈ పొంగల్​కి మీకోసం కొన్ని వెరైటీ రెసిపీలు తీసుకొచ్చాం. వాటిపై కూడా ఓ లుక్కేయండి.

రిబ్బన్ పకోడా :

కావాల్సిన పదార్థాలు :

  • శనగపిండి - అర కప్పు
  • బియ్యప్పిండి - ఒకటిన్నర కప్పులు
  • పుట్నాల పొడి - అర కప్పు
  • ఉప్పు - రుచికి సరిపడా
  • కారం - 1 టేబుల్​స్పూన్
  • నువ్వులు - 3 టేబుల్​స్పూన్లు
  • జీలకర్ర - 1 టేబుల్​స్పూన్
  • వేడి నూనె - 3 టేబుల్​స్పూన్లు
  • వాటర్ - తగినంత
  • నూనె - వేయించడానికి సరిపడా

తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో జల్లించుకున్న శనగపిండి, బియ్యప్పిండి, పుట్నాల పొడి, ఉప్పు, కారం వేసుకొని ఒకసారి కలుపుకోవాలి.
  • ఆ తర్వాత అందులో కచ్చాపచ్చాగా దంచుకున్న జీలకర్ర, నువ్వులు, వేడి నూనె వేసుకొని మరోసారి మిక్స్ చేసుకోవాలి. ఆపై తగినన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని మరీ గట్టిగా కాకుండా మృదువుగా తడిపి పక్కన ఉంచుకోవాలి.
  • ఇప్పుడు స్టౌపై కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యే లోపు మురుకుల గొట్టం తీసుకొని అందులో రిబ్బన్​ పకోడా వచ్చేలా ఉన్న అచ్చును సెట్ చేసుకోవాలి. ఆపై దానికి నూనె రాసి ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిలో నుంచి కొద్దిగా పిండి ముద్దను తీసుకొని పెట్టుకోవాలి.
  • అనంతరం ఆయిల్ బాగా వేడయ్యాక మురుకుల గొట్టంతో రిబ్బన్​ పకోడాను వత్తుకోవాలి. ఆపై మీడియం ఫ్లేమ్ మీదు రెండు వైపులా గోల్డెన్ కలర్​లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి.
  • ఆవిధంగా వేయించుకున్నాక ఒక ప్లేట్​లోకి తీసుకొని కాస్త చల్లార్చుకొని డబ్బాలో స్టోర్ చేసుకుంటే చాలు. అంతే.. ఎంతో రుచికరంగా ఉండే "రిబ్బన్ పకోడా" రెడీ!

సగ్గుబియ్యంతో పసందైన వంటలు - టేస్ట్​ సూపర్​! తింటే వదిలిపెట్టరు!

బియ్యం చెక్కలు :

కావాల్సిన పదార్థాలు :

  • పచ్చిమిర్చి - 10 నుంచి 12
  • అల్లం - 3 అంగుళాల ముక్క
  • ఉప్పు - రుచికి సరిపడా
  • జీలకర్ర - ఒకటిన్నర టేబుల్​స్పూన్లు
  • పొడి బియ్యప్పిండి - అరకిలో
  • పెసరపప్పు - పావు కప్పు
  • సగ్గుబియ్యం - పావు కప్పు
  • బటర్ - 50 గ్రాములు
  • కరివేపాకు - 3 రెమ్మలు
  • నువ్వులు - 4 టేబుల్​స్పూన్లు
  • నూనె - వేయించడానికి సరిపడా

తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా పెసరపప్పు, సగ్గు బియ్యాన్ని శుభ్రంగా కడిగి కనీసం గంటపాటు నానబెట్టుకోవాలి.
  • ఈలోపు మిక్సీ జార్ తీసుకొని అందులో పచ్చిమిర్చి, అల్లం, ఉప్పు, జీలకర్ర వేసుకొని కాస్త బరకగా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి.
  • ఇప్పుడు ఒక వెడల్పాటి మిక్సింగ్ బౌల్​లో పొడి బియ్యప్పిండిని తీసుకోవాలి. ఆపై అందులో మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్, నానబెట్టుకున్న పెసరపప్పు, సగ్గుబియ్యం, బటర్ లేదా వేడి నూనె వేసుకొని మొత్తం కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలి.
  • ఆ తర్వాత అందులో కరివేపాకు తరుగు, నువ్వులు వేసుకోవాలి. ఆపై వేడి నీటిని కొద్దికొద్దిగా యాడ్ చేసుకుంటూ చపాతీ పిండి కంటే కొద్దిగా గట్టిగా అంటే సెమీ సాఫ్ట్​గా కలుపుకోవాలి. ఈ దశలోనే ఉప్పు చూసుకుని సరిపోకపోతే యాడ్ చేసుకోవాలి.
  • ఆ విధంగా పిండిని ప్రిపేర్ చేసుకున్నాక కొద్దికొద్దిగా పిండిని తీసుకుంటూ చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి.
  • ఇప్పుడు పాలిథిన్​ కవర్​పై నూనె లేదా నెయ్యి రాసి ఓ ఉండను పెట్టి చేతి వేళ్ల సాయంతో గుండ్రంగా వత్తుకోవాలి. అలాని మరీ పల్చగా, మందంగా కాకుండా ఓ మాదిరిగా వత్తుకోవాలి.
  • అనంతరం స్టౌపై కడాయి పెట్టుకొని నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక మీరు ప్రిపేర్ చేసుకున్న చెక్కలను ఒక్కొక్కటిగా వేసుకోవాలి.
  • ఆపై మంటను మీడియం ఫ్లేమ్​లో ఉంచి ముందు కాస్త ఉడకనిచ్చి ఆ తర్వాత మరోవైపునకు తిప్పుకొని వేయించుకోవాలి. రెండు వైపులా చెక్కలు లైట్​ బ్రౌన్​ కలర్​లోకి వచ్చేంత వరకు కాల్చుకున్నాక తీసి పక్కకు పెట్టుకోవాలి.
  • ఇలా అన్నింటిని చేసుకుని చల్లారిన తర్వాత గాలి చొరబడని డబ్బాలో స్టోర్ చేసుకుంటే చాలు. అంతే.. ఎంతో టేస్టీగా ఉండే "బియ్యం చెక్కలు" రెడీ!

​"కజ్జికాయలు" - కొందరు చేసినవే ఎందుకు సూపర్ టేస్టీగా ఉంటాయో తెలుసా? - ఈ టిప్స్ ఫాలో అవుతారు!

కొబ్బరి మసాలా మురుకులు :

కావాల్సిన పదార్థాలు :

  • బియ్యప్పిండి - 2 కప్పులు
  • నల్ల నువ్వులు - చెంచా
  • ఉప్పు - రుచికి సరిపడా
  • తాజా కొబ్బరి తురుము - అర కప్పు
  • ఆయిల్ - వేయించేందుకు సరిపడా
  • జీలకర్ర - అరచెంచా
  • వెల్లుల్లి రెబ్బలు - 5
  • చిన్న ఉల్లిపాయలు - 4

తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో కొబ్బరితురుము, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, చిన్న ఉల్లిపాయలు, తగినంత ఉప్పు వేసుకుని మెత్తని పేస్టులా మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకోవాలి.
  • ఇప్పుడు స్టౌపై కడాయిని పెట్టి బియ్యప్పిండి వేసి దోరగా వేయించుకోవాలి. ఆ విధంగా వేయించుకున్నాక అందులో మిక్సీ పట్టుకున్న మసాలా మిశ్రమాన్ని వేసి కలుపుకోవాలి.
  • ఆ తర్వాత అందులో కొద్దికొద్దిగా వేడినీళ్లు యాడ్ చేసుకుంటూ మురుకల పిండిలా చేసుకొని స్టౌ ఆఫ్ చేసుకోవాలి.
  • అనంతరం అందులో నల్ల నువ్వుల్ని కూడా కలిపి పిండిపై తడి వస్త్రాన్ని కప్పి పక్కనుంచాలి.
  • ఇప్పుడు స్టౌపై కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యేలోపు జంతికల గొట్టానికి నూనె రాసి అందులో మీరు కలిపిపెట్టుకున్న మిశ్రమాన్ని కొద్దిగా తీసుకుని సిద్ధం ఉంచుకోవాలి.
  • నూనె కాగిందనుకున్నాక దానిలో మురుకుల గొట్టం తీసుకొని పిండిని మురుకుల్లా వత్తుకోవాలి. ఆ తర్వాత ఎర్రగా వేయించుకుని తీసుకుంటే చాలు. అంతే.. సూపర్ టేస్టీగా ఉండే "కొబ్బరి మసాలా మురుకులు" మీ ముందు ఉంటాయి!

బియ్యప్పిండితో జంతికలు చేస్తే గట్టిగా వస్తున్నాయా? - ఇలా ట్రై చేస్తే కరకరలాడుతూ గుల్లగా వస్తాయి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.