ETV Bharat / business

పింఛన్​దారులకు ఈపీఎఫ్‌ఓ గుడ్‌న్యూస్‌- ఇకపై ఎక్కడినుంచైనా పింఛన్​ తీసుకోవచ్చు - EPFO CENTRALISED PENSION SYSTEM

పింఛన్​దారులకు ఈపీఎఫ్‌ఓ గుడ్‌న్యూస్‌- ఇకపై ఎక్కడి నుంచైనా పెన్షన్‌ పొందే అవకాశం- అందుబాటులో సెంట్రలైజ్డ్‌ పెన్షన్‌ పేమెంట్‌ సిస్టమ్‌

EPFO Centralised Pension System
EPFO Centralised Pension System (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 3, 2025, 8:10 PM IST

EPFO Centralised Pension System : ఈపీఎస్‌ పింఛన్‌దారులకు ఉద్యోగులు భవిష్య నిధి సంస్థ- ఈపీఎఫ్‌ఓ శుభవార్త చెప్పింది. దేశంలోని ఎక్కడి నుంచైనా, ఏ బ్యాంక్‌ నుంచైనా పింఛన్​ తీసుకునేందుకు వీలు కల్పించింది. దీనికోసం తీసుకొచ్చిన సెంట్రలైజ్డ్‌ పెన్షన్‌ పేమెంట్‌ సిస్టమ్‌ను-CPPS దేశంలోని అన్ని ప్రాంతీయ కార్యాలయాలకు విస్తరించినట్లు కార్మిక మంత్రిత్వశాఖ వెల్లడించింది. దీనివల్ల 68లక్షల మంది పింఛన్​ దారులకు ప్రయోజనం చేకూరనుందని తెలిపింది.

'బ్యాంక్​కు వెళ్లాల్సిన అవసరం లేదు!'
ప్రస్తుతం పింఛన్​ పంపిణీ వ్యవస్థలో డీసెంట్రలైజ్డ్‌ వ్యవస్థ ఉంది. దీంతో ఈపీఎఫ్‌ఓ జోనల్/ప్రాంతీయ కార్యాలయాలు కేవలం 3-4 బ్యాంకులతో మాత్రమే ఒప్పందాలు కలిగి ఉన్నాయి. దీనివల్ల పింఛను ప్రారంభ సమయంలో పింఛనుదారులు ధ్రువీకరణ కోసం సంబంధిత బ్యాంక్‌కు వెళ్లాలి. అయితే కొత్తగా తీసుకొచ్చిన సెంట్రలైజ్డ్‌ విధానంతో బ్రాంచ్‌కు వెళ్లాల్సిన అవసరంలేదు. అంతేకాకుండా పింఛన్‌ రిలీజ్ అయిన వెంటనే ఆ డబ్బులు అకౌంట్​లో జమ అవుతాయి.

'అలా చేయాల్సిన పని లేదు'
సెంట్రలైజ్డ్‌ వ్యవస్థ వల్ల పింఛన్​దారులు దేశంలోని ఏ ప్రాంతానికి మారినా వారికి ఇబ్బంది ఉండదు. ఒక కార్యాలయం నుంచి మరో కార్యాలయానికి పింఛన్ పేమెంట్‌ ఆర్డర్‌ను బదిలీ చేయాల్సిన అవసరం కూడా లేదని కార్మిక శాఖ పేర్కొంది. ఏ బ్యాంక్‌కు చెందిన ఏ శాఖ నుంచైనా పింఛన్‌ పొందే వీలు ఉంటుందని వెల్లడించింది. ముఖ్యంగా రిటైర్​మెంట్‌ తర్వాత సొంత ప్రాంతాలకు వెళ్లే వారికి సెంట్రలైజ్డ్‌ వ్యవస్థ చాలా ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొంది.

సెంట్రలైజ్డ్​ వ్యవస్థ పైలట్‌ ప్రాజెక్ట్‌ 2024 అక్టోబర్​లో ముగిసింది. కర్నాల్​, జమ్ము, శ్రీనగర్​ ప్రాంతీయ కార్యాలయాల్లో 49,000 మందికి రూ.11కోట్లు పింఛన్​ పంపిణీ చేశారు. నవంబర్‌లో 24 ప్రాంతీయ కార్యాలయాల్లో రెండో దశ పైలట్ ప్రాజెక్టు చేపట్టారు. ఇక్కడ 9.3 పింఛనుదారులకు రూ.213 కోట్లు పింఛన్ పంపిణీ చేశారు. పూర్తి స్థాయిలో జనవరి 1 నుంచి దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది ఈపీఎఫ్​ఓ. 2024 డిసెంబర్​లో ఈపీఎఫ్​ఓ 122 ప్రాంతీయ కార్యాలయాల్లో 68 లక్షల పింఛనుదారులకు రూ.1,570 కోట్లు పింఛన్లు పంపిణీ చేశారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.