Realme P3 Pro 5G: దేశీయ మార్కెట్లోకి పవర్ఫుల్ ప్రాసెసర్‌తో రియల్మీ నుంచి కిర్రాక్ స్మార్ట్‌ఫోన్ ఎంట్రీ ఇవ్వబోతోంది. కంపెనీ తన 'P' లైనప్ స్మార్ట్‌ఫోన్ సిరీస్‌ను భారత్‌లో విస్తరించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సిరిస్‌లోని ఒక మోడల్ అంటే 'రియల్మీ P3 ప్రో 5G' అనే స్మార్ట్‌ఫోన్ విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ ఫోన్‌పై గత కొన్ని వారాలుగా పుకార్లు షికార్లు చేస్తుండగా.. తాజాగా కంపెనీ ఈ ఫోన్ లాంఛ్ తేదీని అధికారికంగా ప్రకటించింది.
రియల్మీ P3 ప్రో రిలీజ్ ఎప్పుడంటే?: కంపెనీ ఈ ఫోన్‌పై ఫిబ్రవరి 6, 2025న ఒక పత్రికా ప్రకటనను పంచుకుంది. దీని ద్వారా ఫోన్ లాంఛ్ తేదీని వెల్లడించింది. దీని ప్రకారం కంపెనీ 'రియల్మీ P3 ప్రో' స్మార్ట్‌ఫోన్‌ను భారతదేశంలో ఫిబ్రవరి 18 మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభించనుంది. ఈ ఫోన్ రియల్మీ P సిరీస్‌లో మొదటి మోడల్. దీంతోపాటు కంపెనీ ఈ సిరీస్‌లో 'రియల్మీ P3 5G', 'రియల్మీ P3x', 'రియల్మీ P3 అల్ట్రా' అనే మోడల్స్‌ను కూడా ప్రారంభించొచ్చు.
రియల్మీ వీటిలో ప్రాసెసర్ కోసం పవర్ఫుల్ స్నాప్‌డ్రాగన్ 7s Gen 3 చిప్‌సెట్‌ను ఉపయోగించనుంది. ఈ సెగ్మెంట్లో TSMC ప్రాసెస్ ఆధారంగా 4nm చిప్‌సెట్‌తో వస్తున్న మొట్ట మొదటి స్మార్ట్‌ఫోన్ ఇదే అని కంపెనీ చెబుతోంది. ఇది ప్రీవియస్ వెర్షన్ చిప్‌సెట్‌తో పోలిస్తే 20% మెరుగైన CPU అండ్ 40% మెరుగైన GPU పనితీరును అందిస్తుందని అంటోంది.
Segment's strongest device has hit the road!
— realme (@realmeIndia) February 6, 2025
The #realmeP3Pro5G, powered by the dynamic Snapdragon 7s Gen 3, delivers the smoothest performance, making it a first in the segment.
Launching on 18th Feb! #BornToSlay
Know More:https://t.co/fTFutAUyxUhttps://t.co/p9FT51EBa0 pic.twitter.com/oEzrs5wkk3
AnTuTu బెంచ్‌మార్క్‌లో ఈ ఫోన్ 8,00,000 పాయింట్లను స్కోర్ చేయగలదని రియల్మీ పేర్కొంది. GT బూస్ట్ టెక్నాలజీని ఇందులో ఉపయోగించారు. ఇది AI అల్ట్రా-స్టిప్ ఫ్రేమ్స్, హైపర్ రెస్పాన్స్ ఇంజిన్, AI అల్ట్రా టచ్ కంట్రోల్ అండ్ AI మోషన్ కంట్రోల్ ఫీచర్లను అందిస్తుంది.
కంపెనీ ఈ ఫోన్‌ను బడ్జెట్ ధరలోనే తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ఇక స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే.. 'రియల్మీ P3 ప్రో 5G' క్వాడ్-కర్వ్డ్ ఎడ్జ్‌ఫ్లో డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది ఈ ధర రేంజ్ ఫోన్‌లో మొదటిసారి కనిపించనుంది. అంతేకాక ఈ ఫోన్‌లో ఏరోస్పేస్ వీసీ కూలింగ్ సిస్టమ్ కూడా అందించనున్నారు. వీటితోపాటు ఈ ఫోన్ 6000mAh బ్యాటరీతో వస్తుందని తెలుస్తోంది. ఇది 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో రావచ్చు.
ఈ ఫోన్ మైక్రోసైట్ ఫ్లిప్‌కార్ట్‌లో రిలీజ్ అయింది. దీనిలో ఫోన్ గ్రీన్ కలర్ వేరియంట్ కన్పిస్తుంది. ఈ ఫోన్ మధ్యలో సెల్ఫీ కోసం పంచ్-హోల్ కటౌట్ ఉంటుంది. కుడి వైపున వాల్యూమ్ రాకర్ అండ్ పవర్ బటన్ కన్పిస్తాయి. టైప్-C పోర్ట్, స్పీకర్ వెంట్స్, సిమ్ ట్రే స్లాట్ ఫోన్ దిగువన ఉంటాయి. వీటితో పాటు ఈ ఫోన్‌లో పెద్ద కెమెరా మాడ్యూల్ ఉంటుందని, దీని మెయిన్ కెమెరా 50MP OIS సపోర్ట్‌తో రావచ్చని ఫోన్ లీక్డ్ లైవ్ ఇమేజ్ ద్వారా వెల్లడైంది.
మహింద్రా కొత్త ఎలక్ట్రిక్ కార్ల ధరలు రివీల్!- ఫస్ట్ బుక్ చేసుకున్నవారికి లైఫ్‌టైమ్ వారెంటీ!
మరోసారి చంద్రుడిపైకి వెళదామా?- చంద్రయాన్-4పై క్లారిటీ వచ్చిందిగా!
డైమండ్ షీల్డ్ గ్లాస్‌తో వివో కొత్త ఫోన్- కిందపడినా కూడా ఏం కాదంట!- రిలీజ్ ఎప్పుడంటే?