ETV Bharat / sports

ఆస్ట్రేలియాకు దెబ్బ మీద దెబ్బ - రెండో టెస్టుకు కీలక పేసర్ దూరం!

కీలక ఆసీస్​ పేసర్​కు గాయం - డిసెంబర్ 6న జరగాల్సిన రెండో టెస్ట్​కు దూరం!

IND VS AUS Josh Hazlewood Injury
IND VS AUS Josh Hazlewood Injury (source Associated Press)
author img

By ETV Bharat Sports Team

Published : Nov 30, 2024, 9:21 AM IST

IND VS AUS Josh Hazlewood Injury : బోర్డర్ - గావస్కర్ ట్రోఫీలో భాగంగా జరిగిన మొదటి టెస్టులోనే ఘోర ఓటమిని అందుకున్న ఆస్ట్రేలియాకు మరో బిగ్​ షాక్‌ తగిలింది. కీలక బౌలర్‌ జోష్‌ హేజిల్‌వుడ్‌ రెండో టెస్టుకు దూరం కానున్నాడు. గాయం కారణంగా అతడు అందుబాటులో ఉండట్లేదు. రికవరీ అయ్యే వరకు అతడిని వైద్య బృందం పర్యవేక్షిస్తుందని క్రికెట్ ఆస్ట్రేలియా వెల్లడించింది.

"నడుము కింది భాగంలో నొప్పి వచ్చినట్లు టీమ్ మేనేజ్‌మెంట్ దృష్టికి హేజిల్‌వుడ్ తీసుకొచ్చాడు. అతడిని పరీక్షించిన డాక్టర్స్​ రెస్ట్​ అవసరమని సూచించారు" అని క్రికెట్‌ ఆస్ట్రేలియా పేర్కొంది. దీంతో హేజిల్‌వుడ్ రెండో టెస్టులో ఆడకపోవచ్చని క్రికెట్ వర్గాలు తెలిపాయి. పరిస్థితి మెరుగుకాకపోతే పూర్తి సిరీస్‌కే దూరమయ్యే అవకాశం ఉందని చెప్పాయి. కాగా, పెర్త్‌ టెస్టులో ఐదు వికెట్లు తీసి అద్భుత ప్రదర్శన చేశాడు. మిగతా ఆసీస్‌ బౌలర్ల కన్నా ఉత్తమ కనబరిచాడు. అడిలైడ్ వేదికగా పింక్‌బాల్ (డే/నైట్‌) టెస్టు డిసెంబర్ 6 నుంచి ప్రారంభం కానుంది.

వారికి అవకాశం - జోష్ హేజిల్‌వుడ్ గైర్హాజరీ అవ్వడం వల్ల కొత్తగా ఇద్దరికి జట్టులో చోటు దక్కింది. సీన్ అబాట్, డొగ్గెట్‌ను సెలెక్ట్ చేశారు. ప్రైమ్‌మినిస్టర్స్‌ XI టీమ్​లో ఉన్న బోలాండ్‌ కూడా ఆసీస్‌ జట్టులో ఉన్నాడు. అతడు ఈ వార్మప్ మ్యాచ్‌లో అతడు సత్తా చాటితో భారత్‌తో రెండో టెస్టు తుది జట్టులో అతడు ఆడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

IND VS AUS 1st Test Match Result : కాగా, ఈ తొలి టెస్టులోనే టీమ్ ఇండియా 295 పరుగుల భారీ తేడాతో ఆతిథ్య జట్టు ఆస్ట్రేలియా పై విజయం సాధించింది. దీంతో ఆసీస్‌ మాజీలే కాకుండా, ప్రపంచ క్రికెట్‌ అభిమానులు కూడా షాక్‌ అయ్యారు. సొంత గడ్డపై న్యూజిలాండ్​ చేతిలో సిరీస్‌ వైట్‌వాష్‌కు గురైన భారత జట్టు నుంచి ఎవరూ ఇలాంటి విజయాన్ని ఊహించలేదు. ప్రస్తుతం టీమ్ ఇండియా రెండో టెస్ట్​ కోసం సిద్ధమవుతోంది.

భారత్, పాక్ మ్యాచ్​ జట్టులోకి 13 ఏళ్ల IPL బాయ్​ - ఈ ఆసక్తి పోరు ఫ్రీగా ఎలా చూడాలంటే?

'హైబ్రిడ్ మోడల్​కు ఒప్పుకుంటారా?- టోర్నీ నుంచి తప్పుకుంటారా?' - పాకిస్థాన్​కు ICC అల్టిమేటం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.