Border Gavaskar Trophy AUS vs IND 1st Test : బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా జరుగుతోన్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. ఆస్ట్రేలియా క్రికెటర్ మిచెల్ స్టార్క్, భారత యంగ్ పేసర్ హర్షిత్ రాణా ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ఆడిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు వారిద్దరు ప్రత్యర్థులుగా బరిలోకి దిగారు. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో స్టార్క్‌కు రాణా బౌలింగ్ చేశాడు. బౌన్సర్లతో ఇబ్బంది పెట్టేందుకు గట్టిగా ప్రయత్నించాడు.
Harshit Rana Mitchell Starc :అప్పుడు 'హర్షిత్, నీకన్నా నేనే ఎక్కువగా ఫాస్ట్ వేస్తాను. నువ్వు కూడా బాగానే వేస్తున్నావ్. అయితే, నీకన్నా నేనే వేగంగా వేస్తాను' అని స్టార్క్ సరదాగా స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. ఆ మాటలకు హర్షిత్ నవ్వుకున్నాడు.
ఇంకా తాను స్ట్రైకింగ్‌కు వచ్చినప్పుడు ఎలా బంతులు సంధించాలో కూడా చెప్పాడు స్టార్క్. మరింత వేగంతో పాటు షార్ట్ పిచ్ బౌలింగ్ చేయాలని సూచించాడు. 'నాకు ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి' అంటూ చెప్పాడు. ఈ సంభాషణకు సంబంధించిన వీడియోను క్రికెట్ ఆస్ట్రేలియా తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసింది.