BCCI Secretary Post : ఐసీసీ ఛైర్మన్ ఎన్నికల బరిలో రోజుకో మలుపు తిరుగుతోంది. ప్రస్తుత ఐసీసీ ఛైర్మన్ గ్రెగ్ బార్ క్లే పదవీకాలం నవంబర్ 30తో ముగియనుంది. అయితే మరోసారి ఆయన ఎన్నికల బరిలో నిలిచేందుకు నిరాసక్తత వ్యక్తం చేశాడు. దీంతో బీసీసీఐ సెక్రట్రీ జై షా నిలుస్తారనే ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. షా ఎన్నికల బరిలో నిలిస్తే ఐసీసీ నూతన ఛైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి.
అయితే జై షా ఐసీసీ ఛైర్మన్ పదవి చేపడితే ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్ష పదవితోపాటు, బీసీసీఐ సెక్రట్రీ పదవుల నుంచి వైదొలగాల్సి ఉంటుంది. దీంతో జై షా స్థానంలో ఎవరు నియమితులవుతారనే దానిపై ప్రస్తుతం చర్చలు జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ రేసులో ముగ్గురు ప్రముఖ క్రికెటర్ల పేర్లు వినిపిస్తున్నాయి. వారెవరు? వారి సానుకూల అంశాలు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందామా ?
బీసీసీఐ సెక్రట్రీ పదవి అంత తేలికైనది కాదు. ఈ పొజిషన్ కేవలం పరిపాలనాపరమైనది కూడా కాదు. భారత్‌లో క్రికెట్ భవిష్యత్తును మార్చేంత శక్తివంతమైన పదవి ఏదైనా బీసీసీఐలో ఉంది అంటే అది ఈ పదవే. అలాంటి శక్తివంతమైన పదవి కోసం ముగ్గురు క్రికెటర్లు పోటీ పడుతున్నారు.
వీరేంద్ర సెహ్వాగ్ :
దూకుడైన ఆటతీరుకు మారుపేరైన వీరేంద్ర సెహ్వాగ్ పేరు బీసీసీఐ సెక్రట్రీ పదవికి వినిపిస్తోంది. దీంతో సెహ్వాగ్ ఈ పదవి చేపడితే దానికి నూతన ఉత్తేజాన్ని తీసుకురాగలడు. కామెంటేటర్‌తో పాటు క్రికెట్ అకాడమీని నిర్వహిస్తూ సెహ్వాగ్ ఇప్పటికే క్రికెట్‌తో అనుబంధం కొనసాగిస్తూనే ఉన్నాడు. ఒకవేళ సెహ్వాగ్ బీసీసీఐ సెక్రట్రీగా నియమితులైతే వీటిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టే అవకాశం ఉంది.
యూత్ డెవలప్‌మెంట్ : క్షేత్రస్థాయిలో క్రికెట్‌ను మెరుగుపరచడం, చిన్న పట్టణాల నుంచి మరింత మంది ప్రతిభగల క్రికెటర్లను జాతీయ స్థాయికి చేరేలా చేయడం.
క్రికెట్‌లో కొత్త ఆవిష్కరణలు: క్రికెట్ ప్రేమికుల కోసం క్రికెట్‌ను ఆసక్తిగా ఉంచేందుకు కొత్త ఫార్మాట్‌లను పరిచయం చేయవచ్చు. లేదా ఇప్పటికే ఉన్న ఫార్మాట్‌లలో మార్పులు చేయవచ్చు.
అంతర్జాతీయ సంబంధాలు : ఇతర క్రికెట్ బోర్డులతో సంబంధాలను సెహ్వాగ్ బలోపేతం చేసే అవకాశం ఉంది. మరిన్ని ద్వైపాక్షిక సిరీస్‌లపైనా వీరు బాయ్ దృష్టి పెట్టే అవకాశం ఉంది.
రాహుల్ ద్రవిడ్
ఇప్పటికే ఆటగాడిగా, కోచ్‌గా ద్రవిడ్ టీమిండియా క్రికెట్‌పై చెరగని ముద్రవేశాడు. కోచ్‌గా టీమ్ఇండియాకు ప్రపంచకప్ కూడా అందించాడు. భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా ద్రవిడ్ ఎన్నో అద్భుతాలు చేశాడు. ఇప్పుడు బీసీసీఐ సెక్రట్రీగా ద్రవిడ్ నియమితులైతే అతడు వీడిపై ప్రత్యేకంగా దృష్టి సారించే అవకాశం ఉంది.