Anushka Sharma Virat Kohli Marriage Cost : సెలబ్రిటీల పెళ్లి వేడుక అంటే ఏ రేంజ్లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దేశవ్యాప్తంగా ఉన్న సాధారణ ప్రజలు, అభిమానుల దృష్టిని ఎంతగానో ఆకర్షిస్తుంటాయి. ఆ వేడుకకు సంబంధించిన ప్రతి చిన్న విషయం చర్చనీయాంశంగా మారుతుంటుంది. ఎంతమందిని పిలిచారు? ఎన్ని కోట్లు ఖర్చు అయింది? ఎన్ని వందల రకాల వంటలు వండారు? నూతన వధూవరులు ఎలాంటి వెడ్డింగ్ డ్రెస్ వేసుకున్నారు అబ్బో ప్రతీది హాట్‌టాపికే అవుతుంది. అయితే ఇప్పుడు దేశవ్యాప్తంగా అంతా అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకల గురించి కథలు కథలుగా చర్చించుకుంటున్నారు. ఎందుకంటే గతంలో ఎన్నడూ కనివినీ ఎరుగని రీతిలో దీన్ని చేస్తున్నారు. దీంతో ప్రీ వెడ్డింగే ఇంత భారీగా చేస్తున్నారేంటని నొరేళ్లబెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇండియన్ సినీ, స్పోర్ట్స్ సెలబ్రిటీస్‌లో జరిగిన అత్యంత ఖరీదైన పెళ్లి వేడుక ఏంటో తెలుసుకుందాం.
50 మంది అతిథులతో రూ.100కోట్లు : ఇండియన్ సినీ, స్పోర్ట్స్ సెలబ్రిటీస్‌లో జరిగిన అత్యంత ఖరీదైన పెళ్లి విరాట్ కోహ్లీ - అనుష్కది. విరుష్క జంట ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరి పెళ్లి 2017లో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగింది. ఈ వేడకకు కేవలం 50 మంది మాత్రమే హాజరయ్యాని సమాచారం. ఈ 50 మంది కోసమే ఏకంగా రూ. 100 కోట్ల వరకు ఖర్చు చేసి ఈ జంట ఘనంగా పెళ్లి చేసుకున్నట్లు ఇంగ్లీష్ మీడియా కథనాల్లో రాసి ఉంది.
ఈ వేడుకలో అనుష్క శర్మ ఖరీదైన పాస్టెల్ లెహంగాను ధరించి ఓ కొత్త ట్రెండ్‌ను మొదలుపెట్టింది. ఇంకా ఈ వేడుకలో ఆమె ధరించిన సబ్యసాచి వెడ్డింగ్ లెహంగా ఒక్కటే రూ. 30 లక్షలు. అలాగే టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ కోహ్లీ తెల్లటి షేర్వాణీ ధరించి ఆకట్టుకున్నాడు. అలా ఈ జంట ధరించిన వెడ్డింగ్ డ్రెస్స్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.