Paris Olympics Medalఅమెరికా యంగ్ అథ్లెట్ లియోన్ మర్చండ్ తన తొలి ఒలింపిక్స్‌లోనే 4 గోల్డ్ మెడల్స్, 1 కాంస్యం సాధించి సంచలనంగా మారాడు.
s:పారిస్ ఒలింపిక్స్ సంబరానికి తెర పడింది. సెన్ నది వేదికగా ఈ విశ్వ క్రీడల ఆరంభ వేడుకలు అట్టహాసంగా జరగ్గా, తాజాగా స్టేడ్ డి ఫ్రాన్స్ స్టేడియంలో క్లోజింగ్ సెర్మనీ కూడా అంతే గ్రాండ్‌గా జరిగింది. ఈ పోటీల్లో 32 క్రీడాంశాల్లో 329 పతకాలకోసం ప్రపంచవ్యాప్తంగా 206 దేశాలకు చెందిన 10వేలకుపైగా అథ్లెట్లు పోటీల్లో పాల్గొన్నారు. మరి ఏ దేశానికి ఎక్కుల పతకాలు వచ్చాయో తెలుసా?
ఈ విశ్వ క్రీడల్లో అమెరికా అథ్లెట్లు సత్తా చాటారు. అన్ని క్రీడాంశాల్లో కలిపి 40 స్వర్ణ పతకాలు ఎగరేసుకుపోయారు. మొత్తంగా ఈ పోటీల్లో 126 పతకాలతో అమెరికా టాప్ ప్లేస్ దక్కించుకుంది. ఇక చైనా ఖాతాలోనూ 40 గోల్డ్ మెడల్స్ సహా మొత్తం 91 పతకాలతో రెండో స్థానంలో నిలిచింది. జపాన్ 20 బంగారు పతకాలతోపాటు 45 మెడల్స్‌తో మూడో ప్లేస్ దక్కించుకుంది.
భారత్ ప్లేస్ ఎంతంటే
ఈసారి భారత్ నుంచి 117 మంది అథ్లెట్లు ఆయా క్రీడాంశాల్లో పాల్గొని సత్తా చాటారు. మొత్తం 6పతకాలతో పట్టికలో భారత్ 71వ స్థానంలో నిలిచింది. అందులో ఒకటి రజతం కాగా, మిగిలిన ఐదు కాంస్యాలే. ఇక బంగారు పతకం లేకుండానే పారిస్‌లో భారత్ పోరాటం ముగిసింది.
మరిన్ని విశేషాలు
- గత ఒలింపిక్స్‌లో భారత్ (7 పతకాలు) 48వ స్థానంలో ఉండగా, ఈసారి 71వ ప్లేస్‌కు పడిపోయింది
- పారిస్ ఒలింపిక్స్‌లో 84 దేశాలు కనీసం ఒక్క పతకమైనా సాధించాయి.
- చైనా స్విమ్మర్ జాన్ యు ఈ ఒలింపిక్స్‌లో అత్యధిక పతకాలు నెగ్గిన అథ్లెట్‌గా నిలిచింది. ఆమె మొత్తం 6 పతకాలు (1 రజతం, 5 కాంస్యాలు) సాధించింది.
- కేవలం ఒకే ఒక్క పసిడి పతకంతో పాకిస్థాన్ 62వ స్థానం దక్కించుకుంది.
- ఈ ఒలింపిక్స్‌లో భారత్ ఆరు ఈవెంట్లలో నాలుగో స్థానానికి పరిమితమై త్రుటిలో మెడల్స్ చేజార్చుకుంది.
పారిస్ ఒలింపిక్స్‌కు ఎండ్ కార్డ్- నెక్ట్స్ స్టాప్ లాస్‌ఏంజెలెస్- 2028లో క్రికెట్ కూడా - Olympics 2028
పారిస్ ఒలింపిక్స్: భారత్ ఖాతాలో 6 పతకాలు- త్రుటిలో చేజారినవి ఎన్నో తెలుసా? - Paris Olympics 2024