ETV Bharat / offbeat

తిరుపతిలో వెంకన్న దర్శనంతో పాటు ఇదీ ప్రత్యకమే - ఓ సారి చూసొస్తారా? - SRI VENKATESHWARA ZOOLOGICAL PARK

-ఆసియాలోనే రెండో అతి పెద్ద పార్క్​గా​ శ్రీ వేంకటేశ్వర జంతు ప్రదర్శనశాల -టైమింగ్స్​, ఎంట్రీ ఫీ వివరాలు మీ కోసం

Sri Venkateshwara Zoological Park Tirupati
Sri Venkateshwara Zoological Park Tirupati (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 5, 2025, 11:21 AM IST

Sri Venkateshwara Zoological Park Tirupati: తిరుపతి అనగానే కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వర స్వామి దర్శనం గుర్తుకువస్తుంది. కానీ అది ఒక్కటే కాదు తిరుపతిలో చూడాల్సినవి చాలానే ఉన్నాయి. అందులో శ్రీ వేంకటేశ్వర జంతు ప్రదర్శనశాల కూడా ఒకటి. సింహాల గర్జన, పులుల గాండ్రింపు, ఏనుగుల ఘీంకారాలు, పక్షలు కిలకిలరావాలు, బుస కొట్టే సర్పాలు.. ఇలా ఒక్కటేమిటి ఎన్నో రకాల జంతువులు, పక్షులతో ఇక్కడ అనునిత్యం సందడిగా ఉంటుంది. మరి జూలాజికల్ పార్క్ టైమింగ్స్​ ఏంటి? ఎలా చేరుకోవాలి? ఏఏ వన్యప్రాణులు ఉన్నాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

శ్రీ వేంకటేశ్వర జంతు ప్రదర్శనశాల విస్తీర్ణం పరంగా ఆసియాలోనే రెండో అతి పెద్దది. శేషాచలం అడవుల చెంత మైథలాజికల్‌ థీమ్‌తో 1987లో ఈ పార్క్​ను ప్రారంభించారు. 1254.71 హెక్టార్ల విస్తీర్ణంలోని అడవిలో విస్తరించి ఉంది. సుమారు 289 హెక్టార్లలో వన్యప్రాణుల నివాస స్థావరాలు, సఫారీలు ఏర్పాటు చేశారు. 84 రకాలకు చెందిన 1,040 పక్షులు, జంతువులను సంరక్షిస్తున్నారు. వన్యప్రాణులతో పాటు అరుదైన, అంతరించి పోతున్న జాతుల వన్యప్రాణులూ మనుగడ సాగిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని సందర్శకులే కాకుండా తిరుమల, తిరుపతికి వచ్చే దేశ విదేశీ పర్యాటకులు సైతం జూకు వస్తారు.

ఏమేం ఉంటాయంటే.. సింహాలు, ఏనుగులు, పెద్దపులులు, తెల్లపులులు, ఎలుగుబంట్లు, తోడేళ్లు, నక్కలు, హైనాలు, చిరుతలు, జాగ్వార్లు, జింకలు, దేశీ, విదేశీ పక్షులు, అడవికోళ్లు, కొండచిలువలు ఇక్కడ ఉన్నాయి. అరుదైన జాతులకు చెందిన పునుగుపిల్లి, దేవాంగపిల్లి, బూడిదరంగు అడవికోళ్లు, బబూన్‌ కోతులు, అడవిదున్నలు, కృష్ణజింకలు, మనుబోతులు, నాలుగు కొమ్ముల జింకలు, సీతాకోకచిలుకల పార్కూ ఇక్కడ ఆకట్టుకుంటాయి.

టైమింగ్స్​: మంగళవారం మినహా మిగిలిన అన్ని రోజులూ ఉదయం 8:30 గంటల నుంచి సాయంత్రం 4.45 గంటలకు వరకు ఓపెన్​లో ఉంటుంది. అయితే ఉదయం 10 నుంచి 12 గంటలు, మధ్యాహ్నం 3 నుంచి 4.30 గంటలు బెస్ట్​ విజిటింగ్​ అవర్స్.

సదుపాయాలు: జూపార్కులో వన్యప్రాణులను తిలకించాలంటే సుమారు 5 కి.మీ తిరగాలి. కొంతమంది కాలినడకన విజిట్​ చేస్తుంటారు. నడవలేని వారు ఫోర్​ వీలర్​ వాహనాలను తీసుకెళ్లవచ్చు. ఆటోలు, ద్విచక్ర వాహనాలకు ప్రవేశం ఉండదు. జూ అధికారులు ఏర్పాటు చేసిన బ్యాటరీ వాహనాలు, సాధారణ సైకిళ్లు, ఈ-సైకిళ్లు, ఈ-స్కూటర్లలో తిరుగుతూ జూను చూడొచ్చు. కాకపోతే ఇందుకు కొంత రుసుము చెల్లించాలి.

ఎలా వెళ్లాలంటే: తిరుపతి బస్టాండ్‌ నుంచి కపిలతీర్థం, అలిపిరి, సైన్స్‌ సెంటర్‌ మీదుగా చెర్లోపల్లె బైపాస్‌లో వెళ్లవచ్చు. అలాగే బస్టాండ్‌ నుంచి రైల్వేస్టేషన్, టౌన్‌క్లబ్, విద్యానగర్, చెర్లోపల్లె మీదుగా జూను చేరుకోవచ్చు. ఏ దారిలో వెళ్లినా సరాసరి 8 కి.మీ ప్రయాణించాలి. జూకు బస్సు సదుపాయం లేదు. సొంత లేదా అద్దె వాహనాల్లో వెళ్లాలి.

ఎంట్రీ ఫీజు: శ్రీ వేంకటేశ్వర జంతు ప్రదర్శనశాలకు వెళ్లేందుకు 12 సంవత్సరాల వయసు దాటిని ఎవరికైనా రూ.70, 3 నుంచి 12 సంవత్సరాల చిన్నారులకు 30 రూపాయలుగా ఎంట్రీ ఫీజు ఉంది.

ప్రత్యేక ఆకర్షణగా లయన్‌ సఫారీ: ఈ పార్క్​లో లయన్‌ సఫారీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. సుమారు 10 సింహాలు సఫారీ కోసం ఏర్పాటు చేసిన ప్రదేశంలో ఓపెన్‌గా సంచరిస్తుంటాయి. సందర్శకులు ప్రత్యేకమైన వాహనంలో ప్రయాణిస్తూ వాటిని దగ్గర నుంచి చూడొచ్చు. అలాగే వందలాది జింకలతో ఏర్పాటు చేసిన సఫారీ కూడా ఆకట్టుకుంటోంది. రెండు సఫారీల సందర్శనకు ప్రవేశ రుసుముగా పెద్దలు రూ.50, పిల్లలు రూ.30 చెల్లించాలి.

హైదరాబాద్‌లో మరో జూపార్క్- రాష్ట్రంలో ఎకో టూరిజం అభివృద్ధికి ప్రణాళిక

మిత్రుడ్ని చూసిన ఆనందంలో కొంగ డ్యాన్స్.. 'జూ' నుంచి బయటకు వచ్చే యత్నం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.