Telangana Govt Focused on Incompleted Houses : గత ప్రభుత్వం చేపట్టిన రెండు పడక గదుల ఇళ్లలో సుమారు 36,538 నిర్మాణాలు అసంపూర్తిగా ఉన్నాయి. వాటిని పూర్తి చేసేందుకు కావాల్సిన నిధుల కోసం గృహ నిర్మాణ శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. కొన్ని ఇళ్లు స్లాబులు స్థాయిలో మరికొన్ని గోడలు కట్టి ఆపేయగా మరికొన్నింటికి చిన్నచిన్న సౌకర్యాలు కల్పించాల్సి ఉందని అధికారులు గుర్తించారు. పెద్ద ఎత్తున చేపట్టాల్సిన గోడలు, ఫ్లోరింగ్ తదితర పనులకు సుమారు రూ.1,570 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేశారు.
ఇళ్లు నిర్మాణం పూర్తి చేసేందుకు అయ్యే ఖర్చులో రూ.570 కోట్ల వరకు కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసేందుకు సుముఖత వ్యక్తం చేసింది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన ఇళ్ల కేటాయింపు కోసం ఎంపిక చేసిన లబ్ధిదారుల వివరాలను వెబ్సైట్లో నమోదు చేసిన తర్వాత మిగతా నిధులు విడుదల చేస్తామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో అధికారులు ప్రస్తుతం ఆ పనిలో పడ్డారు.
కొత్త సంవత్సరంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభం
పనుల పూర్తికి : కేంద్రం వాటాతో పాటు మరో రూ.600 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తే దాదాపు 16వేల ఇళ్లు పూర్తవుతాయని అధికారులు భావిస్తున్నారు. మూసీ పునరుజ్జీవన పథకంలో భాగంగా ఆయా ప్రాంతాల్లో 15వేల మందికి అసంపూర్ణంగా ఉన్న ఇళ్ల పనులు పూర్తి చేసి వారికి కేటాయించాలని ప్రభుత్వం అధికారులకు స్పష్టం చేసింది. ఆయా పనులకు మరో రూ.400 కోట్లు అవసరమవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఆ జిల్లా వాసులకు గుడ్న్యూస్ - 84 వేల ఇందిరమ్మ ఇళ్లు మీ కోసమే - కానీ ఆ ఒక్కటే సమస్య
ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ డేట్ వచ్చేసింది - సీఎం చేతుల మీదుగా ఆరోజే శ్రీకారం