ETV Bharat / state

కొత్త రేషన్​కార్డుల దరఖాస్తుల డేట్ ఇదే! - అప్లై చేసేందుకు మళ్లీ ఊరెళ్లాల్సిందే - CM REVANTH ON NEW RATION CARDS

రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ రేషన్‌ కార్డులు - 15వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ - అర్హులకు 26 నుంచి కొత్త కార్డుల జారీ

New Ration Cards In Telangana
CM Revanth Reddy On New Ration Cards (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 5, 2025, 12:06 PM IST

CM Revanth Reddy On New Ration Cards : తెలంగాణలో అర్హులైన పేదలందరికీ కొత్త రేషన్​కార్డుల జారీకి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ నెల 26 నుంచి వాటిని జారీ చేయనుంది. మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. మొదట కొత్త కార్డుల కోసం దరఖాస్తులను స్వీకరిస్తారు. విధి విధానాలు, దరఖాస్తుల స్వీకరణ తేదీ వివరాల్ని పౌర సరఫరాల శాఖ ఒకట్రెండు రోజుల్లో ప్రకటించనుంది. దరఖాస్తులను 15వ తేదీ నుంచి స్వీకరించనున్నట్లు సమాచారం. అర్హత నిబంధనల్లో ఎలాంటి మార్పులు చేర్పులు చేయొద్దని ప్రభుత్వం నిర్ణయించింది. 2014లో అప్పటి ప్రభుత్వం జారీ చేసిన జీవోను యథాతథంగా అమలు చేయనున్నట్లు సమాచారం.

ఆఫ్‌లైన్‌లోనే దరఖాస్తులు : కొత్త రేషన్‌కార్డుల కోసం ఇప్పటి వరకు ఆన్‌లైన్‌లో మీ-సేవలో దరఖాస్తు చేసే వారు. ఇప్పుడు ఆఫ్‌లైన్‌లోనే దరఖాస్తులు తీసుకోవాలని ప్రభుత్వం తెలిపింది. గ్రామ సభలు, బస్తీ సభలు నిర్వహించి దరఖాస్తులను స్వీకరిస్తారు. వాటిని కంప్యూటరీకరించి అర్హులకు 26 నుంచి కొత్త కార్డుల జారీ ప్రక్రియను ప్రారంభించనున్నారు.

కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్లు చేర్చాలి : ఇప్పటికే ఉన్న కార్డుల్లో కుటుంబసభ్యుల పేర్లు చేర్చాలని వచ్చిన దరఖాస్తులను ఆమోదించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. వివాహమయ్యాక పుట్టింటి రేషన్ కార్డుల్లో పేర్లను తీసేసుకున్న మహిళలు, మెట్టినింటి కార్డుల్లో చేర్చాలని దరఖాస్తులు చేశారు. తమ పిల్లల పేర్లు రేషన్ కార్టులో చేర్చాలని తల్లిదండ్రులు అర్జీలు సమర్పించారు. ఇలాంటివి 12 లక్షలకు పైగా వచ్చాయి. వాటిలో 16 లక్షలకు పైగా పేర్లు ఉన్నట్లు తెలిసింది. కొత్త రేషన్ కార్డులకు 10 లక్షల దరఖాస్తులు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

కొత్త డిజైన్‌, ఫిజికల్‌ కార్డు : గతంలో రేషన్‌ కార్డులను ఎలక్ట్రానిక్‌ రూపంలో జారీ చేశారు. ప్రస్తుతం రీ డిజైన్‌ చేసి ఫిజికల్‌ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వాటి డిజైన్‌ రూపకల్పనపై మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, శ్రీధర్‌ బాబుతో చర్చించాలని పౌర సరఫరాల శాఖ ముఖ్య కార్యదర్శి డీఎస్‌ చౌహాన్‌ను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు.

జనవరి 4న మంత్రివర్గ సమావేశం - కొత్త రేషన్​ కార్డులు, రైతుభరోసాలపై చర్చ

"తెలుగు రాష్ట్రాల ప్రజలకు సంక్రాంతి బొనాంజా​" - ఇటు వీరి ఖాతాల్లో డబ్బులు, అటు వారికి రేషన్​ కార్డులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.