ETV Bharat / spiritual

"శనివారం రాత్రి ఇలా చేయండి - మీ కారు, బైక్​కి అసలు దిష్టి దోషమే ఉండదు"! - REMEDIES FOR VAHANA DRISHTI DOSHAM

బైక్, కారుకి దిష్టి దోషం పోవాలంటే - ఈ పరిహారాలు పాటించాలంటున్న జ్యోతిష్య నిపుణులు!

Vahana Drishti Dosham
Remedies for Vahana Drishti Dosham (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 6, 2025, 12:30 PM IST

Remedies for Vahana Drishti Dosham : మనలో చాలా మంది నరదిష్టిని ఎక్కువగా నమ్ముతారు. దీన్ని పోగొట్టుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే, మనిషికి ఉన్నట్లే మనం కొత్తగా తీసుకునే వాహనాలపై కూడా కనుదిష్టి ఉంటుందంటున్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు మాచిరాజు కిరణ్ కుమార్. ఈ క్రమంలోనే బైక్ లేదా కారుకు దిష్టి తగలకుండా ఉండాలంటే కొన్ని పరిహారాలు పాటించాలంటున్నారు. మరి, అవేంటో ఈ స్టోరీలో చూద్దాం.

ఎవరైనా కొత్త కారు, బైకు, ఇంకేదైనా వాహనం తీసుకున్నప్పుడు ఎదుటివారి కనుదిష్టి తప్పకుండా ఉంటుంది. అయితే, అలాంటి టైమ్​లో ఈ పరిహారాలు పాటిస్తే దిష్టి దోష నివారణతో పాటు ప్రయాణాలు సాఫీగా సాగుతాయంటున్నారు జ్యోతిష్యులు మాచిరాజు కిరణ్ కుమార్. అలాగే, ఆర్థికంగా కూడా బాగా కలిసి వస్తుందంటున్నారు.

వెహికల్ కొన్నాక ఇవి కట్టాలి : ఏదైనా వాహనం కొన్న వెంటనే హ్యాండిల్​కు ఒక ఎరుపు, నలుపు రంగు రిబ్బన్​ను కలిపి కట్టి ఇంటికి తీసుకురావాలి. ఇలా చేయడం ద్వారా కనుదిష్టి తగలదంటున్నారు. ఆ తర్వాత పూజ చేయించుకోవడం చేయాలంటున్నారు.

ఇలా చేసినా అసలు దిష్టిదోషం ఉండదు!

ఇంటికి తెచ్చాక కొత్త వాహనానికి అసలు దిష్టి అనేది తగలకుండా ఉండాలంటే ఈ చిన్న పరిహారం చేయాలంటున్నారు మాచిరాజు. అదేంటంటే, 6 గవ్వలు, 5 జీడి గింజలు తీసుకొని వాటిని ఒక రాగి వైర్​కి ఒక గవ్వ, ఒక జీడిగింజ చొప్పున గుచ్చి మీ వెహికల్​కి కట్టాలి. ఇలా చేయడం ద్వారా మీ వాహనానికి లైఫ్​లాంగ్ దిష్టి దోషం అనేది ఉండదట.

జిల్లేడు తాడు : బండికి దోషం ఉండదు. కానీ, మనిషి మీద ఉండే దిష్టి దోషం కారణంగానూ ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉండవచ్చు. కాబట్టి, అలా జరగకుండా ఉండాలంటే జిల్లేడు నారతో చేసిన జిల్లేడు తాడు ఉంటుంది (ఇది పూజా స్టోర్స్​లలో లభిస్తుంది). కొత్తగా వాహనం కొన్నాక ఆ తాడును తీసుకొని మీ కుడి చేతి మణికట్టుకి కట్టుకోండి. అప్పుడు మీపై, మీ వాహనంపై కనుదిష్టి అనేది ఉండదంటున్నారు జ్యోతిష్యులు మాచిరాజు కిరణ్.

శనివారం రాత్రి ఇలా చేస్తే ధనలాభం!

శనివారం రాత్రి పూట ఈ ప్రత్యేక పరిహారం చేస్తే వాహన దిష్టి దోషం తొలగిపోవడమే కాకుండా మీకు ఆర్థికంగానూ బాగా కలిసి వస్తుందంటున్నారు జ్యోతిష్యులు మాచిరాజు. అదేంటంటే, నెలకు ఒకసారి లేదా మూడు నెలలకోసారి మీ కారు లేదా బైక్​ను మొత్తం వాటర్​తో శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత పసుపు, గంధం కొద్దిగా రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. ఆపై మీ వాహనం ముందు, వెనుక భాగంలో రెండు చొప్పున నిమ్మ దీపాలు వెలిగించాలి. అంటే నిమ్మదొప్పలను తీసుకొని దానిలో నువ్వుల నూనె పోసి కుంభవత్తి వేసి దీపం పెట్టాలి. అలా వెలిగించాక చక్రాల కింద నిమ్మకాయలు పెట్టి వాహనాన్ని ముందుకు కదిలించాలి. అదేవిధంగా వాహనానికి నెలకోసారి లేదా మూడు నెలలకోసారి దిష్టి తీసుకోవడం చేయాలి.

ఇలా కొన్ని ప్రత్యేక విధివిధానాలు పాటించడం ద్వారా వాహనాలకు ఉన్న దిష్టి దోషాన్ని పోగొట్టుకోవచ్చంటున్నారు. ఎదుటి వారి ఏడుపు నుంచి మిమ్మల్ని, మీ వాహనాల్ని కాపాడుకోవచ్చని చెబుతున్నారు. అంతేకాకుండా మీ ప్రయాణాలు సాఫీగా సాగి ధనపరంగా కూడా బాగా కలిసి వస్తుందంటున్నారు జ్యోతిష్య నిపుణులు మాచిరాజు కిరణ్ కుమార్.

Note : పైన తెలిపిన వివరాలు కొందరు జ్యోతిష్య నిపుణులు, శాస్త్రంలో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతేకానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ఇవీ చదవండి :

"మిమ్మల్ని నరదిష్టి వేధిస్తోందా? - ఈ ఉంగరం ధరిస్తే ఇట్టే తొలగిపోతుంది"

"ఏ పని చేసినా కలిసి రావట్లేదా? - హనుమంతుడి ఆలయానికి వెళ్లండి"

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.