తెలంగాణ

telangana

ETV Bharat / sports

స్టార్ ఆటగాళ్లను వదులుకున్న ఫ్రాంచైజీలు- లిస్ట్​లో ఇషాన్, పంత్ ఇంకా ఎవరంటే?

2025 ఐపీఎల్ రిలీజ్ ప్లేయర్స్- స్టార్ ఆటగాళ్లను వదులుకున్న ఫ్రాంచైజీలు- లిస్ట్​లో పంత్, ఇషాన్ ఇంకా ఎవరంటే? ​

2025 IPL Released Players
2025 IPL Released Players (Source: Getty Images)

By ETV Bharat Sports Team

Published : 6 hours ago

2025 IPL Released Players :2025 ఐపీఎల్ రిటెన్షన్స్​పై సస్పెన్స్ వీడింది. ఆన్ని ఫ్రాంచైజీలు తాము అట్టిపెట్టుకున్న ప్లేయర్ల లిస్ట్​ను గురువారం ప్రకటించాయి. స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మను ముంబయి అట్టిపెట్టుకుంటుందా? ధోనీ మరో సీజన్ ఆడతాడా? అనే సందేహాలపై కూడా క్లారిటీ వచ్చేసింది. రోహిత్ ముంబయితోనే కొనసాగనుండగా, ధోనీని అన్​క్యాప్డ్​ ప్లేయర్​గా చెన్నై అట్టిపెట్టుకుంది. అయితే రిటెన్షన్స్ పక్కనపెడితే, పలు నిబంధనల కారణంగా అన్ని ఫ్రాంచైజీలు తమతమ స్టార్ ప్లేయర్లను వదులుకుంది. అలా ఫ్రాంచైజీల నుంచి దూరమై, మెగా వేలంలోకి రానున్న కీలక ఆటగాళ్లపై ఒ లుక్కేద్దాం!

ముంబయి ఇండియన్స్‌

  • ఇషాన్ కిషన్
  • టిమ్ డేవిడ్
  • డివాల్డ్ బ్రేవిస్
  • గెరాల్డ్ కాట్జీ

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

  • ఫాఫ్ డూప్లెసిస్
  • మహ్మద్ సిరాజ్
  • గ్లెన్ మ్యాక్స్​వెల్
  • విల్ జాక్స్

చెన్నై సూపర్ కింగ్స్

  • డేవన్ కాన్వే
  • మిచెల్ శాంట్నర్
  • దీపక్ చాహర్
  • రచిన్ రవీంద్ర

దిల్లీ క్యాపిటల్స్

  • రిషభ్ పంత్
  • డేవిడ్ వార్నర్
  • జేక్ ఫ్రేజర్

కోల్​కతా నైట్​రైడర్స్

  • శ్రేయస్ అయ్యర్
  • మిచెల్ స్టార్క్
  • వెంకటేశ్ అయ్యర్

లఖ్​నవూ సూపర్ జెయింట్స్

  • కేఎల్ రాహుల్
  • క్వింటన్ డికాక్
  • దేవదత్ పడిక్కల్
  • మార్కస్ స్టొయినిస్

సన్​రైజర్స్ హైదరాబాద్

  • భువనేశ్వర్ కుమార్
  • ఎయిడెన్ మర్​క్రమ్
  • వాషింగ్టన్ సుందర్

గుజరాత్ టైటాన్స్

  • డేవిడ్ మిల్లర్
  • మహ్మద్ షమీ

పంజాబ్ కింగ్స్

  • శిఖర్ ధావన్
  • కగిసొ రబాడా
  • అర్షదీప్ సింగ్

రాజస్థాన్ రాయల్స్

  • జాస్ బట్లర్
  • యుజ్వేంద్ర చాహల్
  • ట్రెంట్ బోల్ట్

రాహుల్, పంత్ కోసం ఆర్సీబీ :మెగా వేలంలో కేఎల్ రాహుల్ లేదా రిషభ్ పంత్​ను దక్కించుకునేందుకు ఆర్సీబీ వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరిలో ఎవరిని దక్కించికున్నా వికెట్ కీపింగ్, కెప్టెన్సీతో జట్టుకు ఉపయోగపడతారు. ఒకవేళ విరాట్ కోహ్లీ జట్టు కెప్టెన్సీ బాధ్యతలు తీసుకునేందుకు ఆసక్తి కనబర్చకుంటే ఈ ఇద్దరిలో ఒకరి కోసం ఆర్సీబీ వేలంలో పోటీ పడే అవకాశం లేకపోలేదు. అలాగే ఆర్సీబీ వద్ద మూడు రైట్ టు మ్యాచ్ కార్డు ఆప్షన్స్ ఉన్నాయి. దీంతో తమ పాత ప్లేయర్లు ఫాఫ్ డూ ప్లెసిస్, గ్లెన్ మ్యాక్స్​వెల్, మహ్మద్ సిరాజ్, కామెరూన్ గ్రీన్​ను తిరిగి జట్టులోకి తెచ్చుకునేందుకు కూడా ప్రయత్నించవచ్చు.

రిటెన్షన్​లో అత్యధిక ధర పలికిన ప్లేయర్లు

  • హెన్రీచ్ క్లాసెన్ (సన్​రైజర్స్ హైదరాబాద్)- రూ. 23 కోట్లు
  • విరాట్ కోహ్లీ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు)- రూ. 21 కోట్లు
  • నికొలస్ పూరన్ (లఖ్​నవూ సూపర్ జెయింట్స్) - రూ. 21 కోట్లు

2025 IPL రిటెన్షన్ లిస్ట్ ఔట్- మెగా వేలంలోకి ఐదుగురు కెప్టెన్లు!

మెగా వేలంలో పంజాబ్​ 'కింగ్'- రూ.110 కోట్ల పర్స్ వ్యాల్యూతో ఆక్షన్​లోకి ఎంట్రీ

ABOUT THE AUTHOR

...view details