ETV Bharat / sports

తేలిపోయిన ఆసీస్ - 47 ఏళ్ల రికార్డును బ్రేక్ చేసి తొలి టెస్ట్​లో భారత్‌ ఘన విజయం

తొలి టెస్టులో బుమ్రా సేనదే పైచేయి - 295 పరుగుల ఆధిక్యంతో విన్

India Vs Australia 1st Test
India Vs Australia 1st Test (Associated Press)
author img

By ETV Bharat Sports Team

Published : Nov 25, 2024, 1:21 PM IST

India Vs Australia 1st Test : ఆస్ట్రేలియా వేదికగా ఎంతో ఉత్కంఠగా సాగుతున్న బోర్డర్ గావస్కర్ తొలి టెస్టు నాలుగో రోజులో ఆసీస్​ బ్యాటర్లు తేలిపోయారు. దీంతో 295 పరుగుల ఆధిక్యంతో టీమ్ఇండియా టెస్ట్​ను సొంతం చేసుకుంది. బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌ 238 పరుగులకు ఆలౌట్‌ అయింది. ట్రావిస్‌ హెడ్‌ 89, మార్ష్‌ 47 పరుగులు చేశారు. భారత బౌలర్లలో సిరాజ్‌, బుమ్రా చెరో 3 సుందర్‌ 2, నితీశ్‌రెడ్డి ఒక వికెట్‌ తీశారు. ఆదివారం బ్యాటింగ్​తో దంచికొట్టిన టీమ్ఇండియా, సోమవారం బౌలింగ్​లోనూ అదరగొట్టడం ఈ విజయానికి కారణం.

ఇక ఈ విజయంతో టీమ్ఇండియా ఓ అరుదైన రికార్డును తమ ఖాతాలో వేసుకుంది. 1977 డిసెంబర్ 30న మెల్‌బోర్న్‌లో ఆస్ట్రేలియాను 222 పరుగుల తేడాతో ఓడించిన భారత జట్టు, ఆ తర్వాత 2018 డిసెంబర్ 26న మెల్‌బోర్న్‌లో మరో పెద్ద విజయాన్ని నమోదు చేసింది. ఆ తర్వాత ఇప్పుడు ఈ రికార్డుతో మరో పెద్ద విజయాన్ని నమోదు చేసింది. దీంతో 47 ఏళ్ల తర్వాత ఈ ఫీట్ సాధించిన టీమ్​గా చరిత్రకెక్కింది.

మ్యాచ్ సాగిందిలా :
భారీ లక్ష్య ఛేదనలో 80 పరుగులు స్కోర్ చేసే లోపే సగం వికెట్లను కోల్పోయిన డీలా పడ్డ ఆసీస్ జట్టును ట్రావిస్ హెడ్ (89) కొంతమేర ఆదుకున్నాడు. ఓ వైపు వికెట్లు పడినా కూడా ఏమాత్రం వెనకడుగు వేయకుండా దూకుడుగా ఆడాడు. అయితే సెంచరీ దిశగా సాగుతున్న సమయంలో అతడ్ని బుమ్రా ఔట్‌ చేశాడు. ఆఫ్‌సైడ్ వేసిన షార్ప్‌ బంతిని అంచనా వేయడంలో విఫలమైన హెడ్‌, పంత్‌ చేతికి చిక్కాడు.

అయితే అప్పటికే క్రీజులో ఉన్న మిచెల్ మార్ష మార్ష్‌ కాస్త వేగం పెంచాలని భావించాడు. నితీశ్‌ రెడ్డి చేతిలో బౌల్డ్‌ కావడం వల్ల అనూహ్యంగా పెవిలియన్ బాట పట్టాడు. ఇక నితీశ్‌కు ఇదే తొలి అంతర్జాతీయ టెస్టు వికెట్‌ కావడం విశేషం. అలా ఒక్కో వికెట్​ పడుతున్న కొద్ది ఆసీస్ ప్లేయర్లలో ఆందోళన నెలకొంది.

టీ బ్రేక్ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన నాథన్‌ లైయన్ (0)ను సుందర్ క్లీన్‌బౌల్డ్ చేయగా, అతడు వెనుతిరగాల్సి వచ్చింది. అంతకుముందే మిచెల్ స్టార్క్‌ (12) ఔటయ్యాడు. సుందర్ బౌలింగ్​లో స్టార్క్ ఆడిన ఆ బంతిని షార్ట్‌ లెగ్‌సైడ్‌ ఉన్న ధ్రువ్‌ జురెల్ అద్భుతంగా పట్టాడు. దీంతో 227 పరుగుల వద్ద ఆసీస్‌ తమ 8వ అలాగే 9వ వికెట్‌ను కోల్పోయింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.