MLC Kavitha On Caste Census : బీసీలకు సంపూర్ణ న్యాయం చేయాలన్న డిమాండ్‌పై భవిష్యత్తులో గల్లీ నుంచి దిల్లీ వరకు పోరాటం చేస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. బీసీలకు న్యాయం జరగాలంటే రాజ్యంగంలో చట్ట సవరణలు చేయాలని సూచించారు. హైదరాబాద్ సంక్షేమ భవన్‌లో బీసీ సంఘాలు, యునైటెడ్ ఫులే ఫ్రండ్, తెలంగాణ జాగృతి నాయకులతో కలిసి కులగణన డెడికేటెడ్ కమిషన్ ఛైర్మన్ బూసాని వెంకటేశ్వరరావును ఆమె కలిశారు.
20 డిమాండ్లు, 35 పేజీల నివేదిక : ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నేతలు గట్టు రామచంద్రరావు, వి.ప్రకాష్, బీసీ సంఘాల నేతలు, జాగృతి సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున బీసీ సంఘాల నాయకులు, శ్రేణులు తరలివచ్చారు. బీసీ సంఘాలు, జాగృతి, యునైటెడ్ ఫులే ఫ్రంట్ ఆధ్వర్యంలో సమగ్ర అధ్యయం చేసి రూపొందించిన 20 డిమాండ్లతో కూడిన 35 పేజీల నివేదికను కమిషన్‌కు సమర్పించారు.
కామారెడ్డి డిక్లరేషన్ అమలు : కవిత మీడియాతో మాట్లాడుతూ బీసీల రిజర్వేషన్ సంబంధించి ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ యధాతథంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే అనేక బీసీ సంఘాలు, మేధావులు ఇచ్చిన సూచనలు అమలుకు నోచుకోలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం 11 మాసాలు కాలయాపన చేసిందని ఆక్షేపించారు. ఈ డెడికేటెడ్ కమిషన్ స్వతంత్రంగా పనిచేయాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ప్రత్యేక కార్యాలయం, మానవ వనరులు, సామగ్రి ఇవ్వకుంటే ఆ కమిటీ ఎలా పనిచేస్తుందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కుల గణనపై నెల రోజుల్లో నివేదిక అంటే ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఆరోపించారు.
ఫ్రిజ్‌లు, కూలర్లు ఎందుకు? : దయచేసి కమిషన్ పూర్తి స్వతంత్రంగా పనిచేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని సూచించారు. కులగణనకు చట్టబద్ధత కల్పించాలని, రిజర్వేషన్ల అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కుల గణన కోసం ఇళ్లకు వెళుతున్న సర్వే సిబ్బంది కుటుంబాలను ఫ్రిడ్జ్, కూలర్ ఉందా? అని అడగాడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. హైదరాబాద్‌లో ఇప్పటికీ 70 శాతం స్టిక్కర్లు వేయని ఇళ్లు ఉన్నాయని ప్రస్తావించారు. 90 శాతం సర్వే పూర్తైందన్న ప్రభుత్వం ఆ డేటా కంప్యూటరీకరణ చేసిందా? అని కవిత ప్రశ్నించారు.
ఆడబిడ్డకో న్యాయం.. అదానీకో న్యాయమా ? : ఎక్స్ వేదికగా ప్రశ్నించిన కవిత
మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు 10 లక్షల పరిహారం ఇవ్వాలి : ఎమ్మెల్సీ కవిత