India Vs Australia Border Gavaskar Trophy : పెర్త్ వేదికగా అట్టహాసంగా ప్రారంభమైన బోర్డర్ - గావస్కర్ ట్రోఫీలో భారత్ శుభారంభం చేసింది. 295 పరుగుల విజయంతో టీమ్ఇండియా మొదటి టెస్టును కైవసం చేసుకుంది. దీంతో ఐదు టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యంతో ముందంజలో ఉంది. ఇక భారత్ నిర్దేశించిన 534 పరుగుల లక్ష్య ఛేదనలో ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో 238 పరుగులకే కుప్పకూలింది. అయితే ఈ వేదికగా ఆస్ట్రేలియాకు ఇదే తొలి ఓటమి. ఇంతకుముందు ఇక్కడ ఆడిన అన్ని టెస్టుల్లోనూ ఆసిస్ విజయం సాధించింది. ఈ క్రమంలో భారత్ పలు రికార్డులను తమ ఖాతాలో వేసుకుంది. అదేంటంటే?
47 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాలో భారత్ అతిపెద్ద విజయం (పరుగుల పరంగా)
ఆస్ట్రేలియా వేదికగా భారత్ నమోదు చేసిన ఈ భారీ స్కోర్ వద్ద టీమ్ఇండియా ఓ రేర్ రికార్డును తమ ఖాతాలో వేసుకుంది. సరిగ్గా 47 ఏళ్ల తర్వాత ఆతిథ్య జట్టుపై వాళ్ల సొంత గడ్డలో ఇలా అత్యథిక రన్స్‌తో ఓడించింది. 1977 డిసెంబర్ 30న మెల్బోర్న్‌లో ఆస్ట్రేలియాను 222 పరుగుల తేడాతో ఓడించిన భారత్, ఆ తర్వాత 2018 డిసెంబర్ 26న మెల్‌బోర్న్‌లోనే మరో పెద్ద విజయం సాధించింది. అప్పుడు భారత్ 137 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ సారి మాత్రం అంతకుమించి రన్స్‌తో చెలరేగిపోయింది. ఇక భారత్ ఇప్పటి వరకూ ఆసీస్‌పై అత్యథిక పరుగులు ఎప్పుడు నమోదు చేసిందంటే :
- ఆప్టస్, పెర్త్ - 295 పరుగులు - 2024 నవంబర్ 25
- మెల్బోర్న్ - 222 పరుగులు - 1977 డిసెంబర్ 30
- మెల్‌బోర్న్ - 137 పరుగులు - 2018 డిసెంబర్ 26
- WACA, పెర్త్ - 72 పరుగులు - 2008 జనవరి 16
- మెల్బోర్న్ - 59 పరుగులు - 1981 ఫిబ్రవరి 7
ఆస్ట్రేలియాపై భారత్‌కు సెకెండ్ బిగ్గెస్ట్ టెస్టు విజయం
పెర్త్ టెస్టులో ఆస్ట్రేలియాను ఓడించడం ద్వారా, టెస్టు క్రికెట్ చరిత్రలో ఆస్ట్రేలియాపై భారత్ రెండో అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. 2008లో మొహాలీ వేదికగా ఆస్ట్రేలియాపై భారత్ పరుగుల పరంగా అతిపెద్ద విజయం నమోదు చేయగా, అప్పుడు ఆస్ట్రేలియాను 320 పరుగుల తేడాతో భారత్ ఓడించింది. ఆ తర్వాత 1977లో మెల్‌బోర్న్‌లో 222 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది.
- మొహాలీ - 320 పరుగులు - 2008 అక్టోబర్ 17
- ఆప్టస్, పెర్త్ - 295 పరుగులు - 2024 నవంబర్ 25
- మెల్బోర్న్ - 222 పరుగులు - 1977 డిసెంబర్ 30
- చెన్నై - 179 పరుగులు - 1998 మార్చి 6
- నాగ్‌పూర్ - 172 పరుగులు - 2008 నవంబర్ 6
ఇదిలా ఉండగా, సొంత గడ్డపై ఆస్ట్రేలియా జట్టు టెస్టు క్రికెట్‌లో ఆతిథ్య దేశం చేతిలో ఎన్ని సార్లు ఓటమి చవి చూసిందంటే :
- ఇంగ్లాండ్ - 675 పరుగులు - బ్రిస్బేన్ - 1928 నవంబర్ 30
- వెస్టిండీస్ - 408 పరుగులు - అడిలైడ్ - 1980 జనవరి 26
- ఇంగ్లండ్ - 338 పరుగులు - అడిలైడ్ - 1933 జనవరి 13
- ఇంగ్లాండ్ - 322 పరుగులు - బ్రిస్బేన్ - 1936 డిసెంబర్ 4
- దక్షిణాఫ్రికా 309 పరుగులు - WACA, పెర్త్ - 2012 నవంబర్ 30
- ఇంగ్లాండ్ - 299 పరుగులు - సిడ్నీ - 1971 జనవరి 9