ETV Bharat / sports

7 పరుగులకే ఆలౌట్​ - టీ20ల్లో అత్యల్ప స్కోర్ ఇదే! - NIGERIA VS IVORY COAST

నైజీరియా దెబ్బకు ఆ జట్టు ఘోర పరాజయం - టీ20లో అత్యల్ప స్కోర్ రికార్డు

ICC T20 WORLD CUP 2024
Nigeria Vs Ivory Coast (Getty Images)
author img

By ETV Bharat Sports Team

Published : Nov 25, 2024, 4:02 PM IST

Nigeria Vs Ivory Coast T20 World Cup : కేవలం 7 పరుగులకే ఓ జట్టు ఆలౌటైంది. అంతేకాకుండా అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలో అత్యల్ప స్కోర్​ను నమోదు చేసింది. దీంతో ప్రత్యర్థి జట్టు భారీ తేడాతో విజయం సాధించింది. ఇంతకీ ఆ జట్లు ఏదో, వాళ్లు అలా ఎందుకు ఔట్​ అయ్యరో ఈ స్టోరీలో చూద్దాం.

లాగోస్‌ వేదికగా తాజాగా జరిగిన ఐసీసీ పురుషుల T20 ప్రపంచకప్​లో ఈ ఘటన జరిగింది. సబ్-రీజనల్ ఆఫ్రికా క్వాలిఫైయర్ గ్రూప్ C మ్యాచ్‌లో ఐవరీ కోస్ట్​పై నైజీరియా కేవలం 7 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచిన నైజీరియా తొలుత బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 4 వికెట్లకు 271 పరుగులు నమోదుచేసింది. ఇక నైజీరియా ఓపెనర్ సలీం సలావ్ 112 పరుగుల భారీ ఇన్నింగ్స్ నమోదు చేయగా, మిడిలార్డర్‌లో వచ్చిన ఇసాక్ ఒపెక్ 65 పరుగులు చేశాడు. అలా ఆ జట్టు ఐవరీకోస్ట్ ముందు 272 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.

అయితే నైజీరియా నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని చేధించేందుకు వచ్చిన ఐవరీ కోస్ట్​కు ఆదిలోనే చుక్కెదురైంది. 4 పరుగుల స్కోర్ ఉన్నప్పుడే మొదటి 2 వికెట్ల పడిపోయాయి. ఆ తర్వాత మరో ఇద్దరు బ్యాట్స్‌మెన్స్ 5 పరుగుల వద్ద పెవిలియన్ బాటపట్టారు. ఇక 6 పరుగుల వద్ద ఐవరీకోస్ట్ చేతులెత్తేసింది. ఇక 7.3 ఓవర్లలో 7 పరుగులకే ఆలౌట్​గా వెనుతిరిగింది. మరో ముగ్గురు బ్యాట్లరు కూడా తమ వికెట్లను వరుసగా కోల్పోయారు.

సింగిల్ డిజిట్​ టీమ్ స్కోరు ఇదే మొదటిసారి : పురుషుల T20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో ఓ టీమ్ ఇలా సింగిల్ డిజిట్​ స్కోర్​కే పరిమితం అవ్వడం ఇదే తొలిసారి. అంతకుముందు ఈ ఫార్మాట్‌లో 10 పరుగులు స్కోరు నమోదైంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో సింగపూర్‌పై మంగోలియా 10 పరుగులకే ఔటవ్వగా, గత ఏడాది స్పెయిన్‌పై ఐల్ ఆఫ్ మ్యాన్ కూడా ఇదే స్కోర్​కే కుప్పకూలింది.

టీ20 ఇంటర్నేషనల్‌లో అత్యల్ప జట్టు స్కోర్లు ఇవే :

  • ఐవరీ కోస్ట్: 7 పరుగులు, vs నైజీరియా ( 2024 నవంబర్)
  • మంగోలియా: 10 పరుగులు, vs సింగపూర్ (2024 సెప్టెంబర్)
  • ఐల్ ఆఫ్ మ్యాన్: 10 పరుగులు, v స్పెయిన్ (2023 ఫిబ్రవరి)
  • మంగోలియా: 12 పరుగులు, vs జపాన్ (2024 మే)
  • మంగోలియా: 17 పరుగులు, vs హాంకాంగ్ (2024 ఆగస్టు)
  • మాలి: 18 పరుగులు, vs టాంజానియా (2024 సెప్టెంబర్)

ఒక్క మ్యాచ్​తో కెరీర్ ఫినిష్​ - టీ20 తర్వాత క్రికెట్​కు దూరమైన 5 ప్లేయర్స్​ ఎవరంటే?

10 పరుగులకే ఆలౌట్- T20 హిస్టరీలో అత్యల్ప స్కోర్ - T20 Lowest Score

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.