ETV Bharat / offbeat

ఒక్కసారి ఇలా "చికెన్ ఫ్రై" చేయండి - ఇంట్లో వాళ్లు ఎప్పుడూ అలాగే వండమనడం పక్కా! - EASY CHICKEN FRY RECIPE

సాంబార్, పప్పుచారు, రసంలోకి అద్దిరిపోయే సైడ్ డిష్ - సింపుల్​గా చేసేయండిలా!

How to Make Chicken Fry
Chicken Fry Recipe (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 25, 2024, 5:50 PM IST

Easy Chicken Fry Recipe : వేడివేడి అన్నం, కమ్మని పులావ్‌, మాంచి రోటీ.. ఇలా దేనికైనా సరే చికెన్‌ కూర ఉంటే ఆ మజానే వేరు! అలాగని చికెన్ కర్రీని ఎప్పుడూ ఒకే రుచిలో వండుకుంటే బోరింగ్​గా అనిపిస్తోంది. అందుకే ఈసారి కాస్త వెరైటీగా ఇలా "చికెన్ ఫ్రై"ని చేసుకొని చూడండి. ఇందుకోసం పెద్దగా శ్రమించాల్సిన పనిలేదు! అలాగే.. ఎక్కువ మసాలా దినుసులు అవసరం లేదు. ఇంట్లో ఉన్నవాటితోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పైగా టేస్ట్ అద్దిరిపోతుంది! మరి, అందుకు కావాల్సిన పదార్థాలేంటి? ఎలా తయారు చేసుకోవాలి? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :

మారినేషన్‌ కోసం :

  • చికెన్ - 1 కేజీ
  • ఉప్పు - 2 టీస్పూన్లు
  • పసుపు - అరటీస్పూన్
  • కారం - 1 టేబుల్​స్పూన్
  • పెరుగు - 2 టేబుల్​స్పూన్లు
  • అల్లంవెల్లుల్లి పేస్ట్ - ఒకటిన్నర టేబుల్​స్పూన్లు
  • నిమ్మరసం - కొద్దిగా(అరచెక్క)

చికెన్ ఫ్రై కోసం :

  • ఉల్లిపాయలు - 3(మీడియం సైజ్​వి)
  • ఆయిల్ - 5 టేబుల్​స్పూన్లు
  • పచ్చిమిర్చి - 3(నిలువుగా కట్ చేసుకోవాలి)
  • పుదీనా తరుగు - కొద్దిగా
  • కరివేపాకు - కొద్దిగా(సన్నగా తరుక్కోవాలి)
  • కొత్తిమీర తరుగు - కొద్దిగా

మసాలా పొడి కోసం :

  • ఎండుమిర్చి - 4
  • మిరియాలు - 1 టీస్పూన్
  • దాల్చిన చెక్క - 2 అంగుళాలు
  • లవంగాలు - 7
  • యాలకులు - 4
  • ధనియాలు - 2 టేబుల్​స్పూన్లు
  • జీలకర్ర - 1 టీస్పూన్

తెలంగాణ పెళ్లిళ్ల స్పెషల్ "రెడ్ చికెన్" - ఈ పద్ధతిలో చేస్తే టేస్ట్ అదుర్స్!

తయారీ విధానం :

  • ముందుగా చికెన్​ని మారినేట్ చేసుకోవాలి. ఇందుకోసం మొదటగా చికెన్​ని శుభ్రంగా కడిగి ఒక మిక్సింగ్ బౌల్​లోకి తీసుకోవాలి.
  • ఆపై అందులో ఉప్పు, పసుపు, కారం, పెరుగు, అల్లంవెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం పిండి ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత గిన్నెపై మూత పెట్టుకొని పావుగంట పాటు అలా వదిలేయాలి.
  • ఆలోపు రెసిపీలోకి కావాల్సిన ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు స్టౌపై పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడయ్యాక సన్నగా తరుక్కొన్న ఆనియన్స్ వేసి మీడియం ఫ్లేమ్ మీద గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి.
  • ఆవిధంగా ఉల్లిపాయలను వేయించుకున్నాక మారినేట్ చేసుకున్న చికెన్​ని వేసుకోవాలి. ఆపై మీడియం ఫ్లేమ్​ మీదనే గరిటెతో కలుపుతూ ఒకటి లేదా రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి.
  • ఆ తర్వాత పాన్​పై మూతపెట్టి మంటను లో ఫ్లేమ్​లోకి టర్న్ చేసుకొని మధ్యమధ్యలో కలుపుతూ ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి.

క్రిస్పీ అండ్​ టేస్టీ "మద్రాస్​ స్టైల్ చికెన్ 65" - ఇలా చేస్తే ఒక్క ముక్క కూడా మిగల్చరు!

  • ఈలోపు చికెన్ ఫ్రైలోకి ఇంట్లో ఉన్న మసాలా దినుసులతోనే ఒక మసాలా పౌడర్​ని ప్రిపేర్ చేసుకోవాలి.
  • అందుకోసం స్టౌపై చిన్న కడాయి పెట్టుకొని ఎండుమిర్చి, మిరియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, ధనియాలు, జీలకర్ర వేసుకొని లో ఫ్లేమ్​ మీద ఏవీ మాడకుండాదోరగా వేయించుకోవాలి.
  • అనంతరం వాటిని కొద్దిగా చల్లారాక మిక్సీ జార్​లో వేసుకొని మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి.
  • ఇప్పుడు స్టౌపై ఉడికించుకుంటున్న చికెన్ చక్కగా ఉడికి ఆయిల్ పైకి తేలిందనుకున్నాక పచ్చిమిర్చి చీలికలు, పుదీనా, కరివేపాకు, కొత్తిమీర తరుగు వేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టి మధ్యమధ్యలో నెమ్మదిగా కలుపుతూ లో ఫ్లేమ్ మీద మరో రెండు నిమిషాలు వేయించుకోవాలి.
  • ముక్కలు ఎర్రగా మారేంత వరకు వేయించుకున్నాక మీరు ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పొడిని రెండు టేబుల్​స్పూన్లు వేసుకొని ఒకసారి చక్కగా కలుపుకోవాలి.
  • ఆ తర్వాత లో ఫ్లేమ్ మీద ఒకటి లేదా రెండు నిమిషాలు కలుపుతూ వేయించుకొని చివరగా కొత్తిమీర తరుగు వేసుకొని కలిపి దింపేసుకుంటే చాలు. అంతే.. ఎంతో టేస్టీగా ఉండే "చికెన్ వేపుడు" రెడీ!

గోంగూరతో చికెన్ కర్రీ మాత్రమే కాదు బిర్యానీ చేయవచ్చు - ఇలా ప్రిపేర్​ చేయండి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.