తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

ఆ రాశుల వారికి ఉద్యోగం, వివాహం, ధనలాభం గ్యారెంటీ - గణనాథుని ఆలయ సందర్శనం శుభకరం! - WEEKLY HOROSCOPE

డిసెంబర్​ 15వ తేదీ నుంచి డిసెంబర్​ 21వ తేదీ వరకు మీ రాశి ఫలం ఎలా ఉందంటే ?

Weekly Horoscope
Weekly Horoscope (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : 5 hours ago

Weekly Horoscope From December 15th To December 21st 2024 : డిసెంబర్​ 15వ తేదీ నుంచి డిసెంబర్​ 21వ తేదీ వరకు మీ రాశి ఫలం ఎలా ఉందంటే ?

మేషం (Aries) :మేషరాశి వారికి ఈ వారం సానుకూలంగా, విజయవంతంగా ఉంటుంది. ఉద్యోగంలో మార్పు కోరుకునేవారు, నిరుద్యోగులు గొప్ప అవకాశాలను అందుకుంటారు. వ్యాపారులు గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి లాభాలను పొందుతారు. అన్ని రంగాల వారికి కొత్త ఆదాయ వనరులు అందుబాటులోకి రావడం వల్ల ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. కుటుంబంలో సుఖ శాంతులు వెల్లివిరుస్తాయి. కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని గడుపుతారు. గృహంలో శుభకార్యాలు జరిగే సూచన ఉంది. విద్యార్థులు పోటీ పరీక్షలో విజయం సాధిస్తారు. నూతన వస్తువాహనాలు, స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. మీ ప్రియమైన వారి నుంచి బహుమతులు అందుకుంటారు. కుటుంబ సభ్యులతో తీర్థయాత్రలకు ప్రణాళిక వేస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. ఇష్ట దేవతారాధన శుభప్రదం.

వృషభం (Taurus) :వృషభ రాశి వారికి ఈ వారం శుభప్రదంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలలో కీలకమైన పురోగతి ఉంటుంది. ఊహించని విజయాలను సొంతం చేసుకుంటారు. ఆర్థికంగా శుభ ఫలితాలు ఉంటాయి. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. నూతన బాధ్యతలు స్వీకరిస్తారు. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. ఉన్నత పదవులను చేపడతారు. ఉన్నతాధికారుల మద్దతు ఉంటుంది. కోరుకున్న చోటికి బదిలీ, ప్రమోషన్ ఛాన్సులు ఉంటాయి. జీవిత భాగస్వామితో అనుబంధం దృఢ పడుతుంది. ఓ శుభవార్త మీ సంతోషాన్ని రెట్టింపు చేస్తుంది. విద్యార్థులు చదువులో రాణిస్తారు. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంటి మరమ్మత్తుల కోసం ధనవ్యయం ఉంటుంది. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

మిథునం (Gemini) :మిథునరాశి వారికి ఈ వారం ఫలవంతంగా ఉంటుంది. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను విజయవంతంగా ఎదుర్కొంటారు. ప్రియమైన వారి మద్దతుతో వృత్తి, కెరీర్, వ్యాపారంలో పురోగతి సాధిస్తారు. వైవాహిక జీవితం కొత్త ఆనందాన్ని ఇస్తుంది. ఇది వరకు మీ మధ్య ఉన్న అపార్థాలు కూడా తొలగిపోతాయి. ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు అనువైన సమయం నడుస్తోంది. వ్యాపారం ప్రోత్సాహకారంగా ఉంటుంది. పెట్టుబడులు, లాభాల రూపంలో ధనప్రవాహం ఉంటుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. సంపద వృద్ధి చెందుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. చాలా కాలంగా వాయిదా పడిన పనులు అనుకోకుండా ముందుకు సాగుతాయి. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి భుజంగ స్తోత్ర పారాయణ శుభకరం.

కర్కాటకం (Cancer) :కర్కాటకరాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. బద్దకం, నిర్లక్ష్యాన్ని ప్రయత్నపూర్వకంగా వదిలించుకోకపోతే విజయాలు సిద్ధించవు. వృత్తి, వ్యాపార రంగాలవారు, ఉద్యోగులు తమ లక్ష్యంపై నుంచి దృష్టి మరలకుండా జాగ్రత్త వహించాలి. అహంకారం, అధికార గర్వం వీడి అందరినీ కలుపుకొని పోవడం మంచిది. సమిష్టి కృషితో సాధించిన విజయాల ప్రయోజనం అందరికీ చెందేలా వ్యవహరిస్తే మేలు. ఉద్యోగంలో మార్పు కోసం ప్రయత్నించేవారికి కోరుకున్న ఉద్యోగం దొరుకుతుంది. వ్యాపారంలో హెచ్చు తగ్గులు ఉంటాయి. లాభాలు కూడా ఆశించిన మేరకు ఉండకపోవచ్చు. ముఖ్యమైన వ్యవహారాలు, ప్రయాణాలు వాయిదా వేసుకుంటే మంచిది. నవగ్రహ ఆలయ సందర్శన ఆపదలను తొలగిస్తుంది.

సింహం (Leo) :సింహరాశి వారికి ఈ వారం శుభప్రదంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి వృత్తి, వ్యాపార ప్రయత్నాలు సజావుగా సాగుతాయి. ఆర్థిక అంశాలు ఫలప్రదంగా, లాభదాయకంగా ఉంటాయి. వ్యాపారంలో గణనీయమైన లాభాలుంటాయి. నూతన అవకాశాలను అందుకుంటారు. ఊహించిన దానికన్నా ఎక్కువ ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. కుటుంబ శ్రేయస్సు కోసం పనిచేస్తారు. స్నేహితుల సాయంతో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. వ్యాపారులు వ్యూహాత్మకంగా పనిచేసి సంస్థను లాభాలబాటలో నడిపిస్తారు. వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. వారం చివరలో విలాసాల కోసం అధికంగా ధనవ్యయం ఉండవచ్చు. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. జీవితభాగస్వామితో బంధాలు దృఢపడతాయి. విహార యాత్రలు, విందు వినోదాలతో కాలక్షేపం చేస్తారు. ఇష్ట దేవతారాధన శుభకరం.

కన్య (Virgo) : కన్యారాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి వృత్తి, వ్యాపారాలలో పురోగతి అస్థిరంగా ఉంటుంది. ఉద్యోగులకు పనిభారం పెరగడం వల్ల ఒత్తిడికి లోనవుతారు. ఆరోగ్యం దెబ్బ తింటుంది. తగిన విశ్రాంతి అవసరం. సహోద్యోగుల, ఉన్నతాధికారుల సహకారంతో పనులు పూర్తి చేస్తారు. వ్యాపారులు సమయానుకూలంగా నడుచుకుంటే వ్యాపారంలో పురోగతి సాధించవచ్చు. స్థిరాస్తి వ్యవహారాలలో అడ్డంకులు ఎదురవుతాయి. కుటుంబ వ్యవహారాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా చూసుకోండి. వ్యక్తిగత జీవితంలో సమస్యలు తలెత్తవచ్చు. జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడపండి. శనిస్తోత్ర పారాయణ చేయడం వలన ఆపదలు తొలగిపోతాయి.

తుల (Libra) :తులారాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కెరీర్ పరంగా ముఖ్యులతో చేసే సంప్రదింపులు లక్ష్యాలలో విజయానికి దారి తీస్తాయి. గ్రహ సంచారం అంత అనుకూలంగా లేదు కాబట్టి మీ ఆరోగ్యం, ఆస్తుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడం చాలా ముఖ్యం. నూతన ఆదాయ వనరులు ఏర్పాటు చేసుకున్నప్పటికినీ ఖర్చులు అదుపు తప్పడం వల్ల అశాంతికి లోనవుతారు. వ్యక్తిగత జీవితాన్ని, వృత్తి జీవితాన్ని సమన్వయము చేసుకుంటూ ముందుకెళ్లండి. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. లేకపోతే అపార్థాలు ఏర్పడవచ్చు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు అందరి సలహా తీసుకోండి. అందరినీ కలుపుకొని ముందుకెళ్తే విజయం ఉంటుంది. ప్రయాణాలలో జాగ్రత్త వహించాలి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఆదిత్య హృదయం పారాయణ శక్తినిస్తుంది.

వృశ్చికం (Scorpio) :వృశ్చికరాశి వారికి ఈ వారం ఫలవంతంగా ఉంటుంది. ఉద్యోగులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. ఇది వారి వృత్తిపరమైన ఎదుగుదల మరియు ఆర్థిక స్థిరత్వాన్ని గణనీయంగా పెంచుతుంది. తెలివైన పెట్టుబడుల ద్వారా ఆర్థిక లబ్ది పొందవచ్చు. షేర్ మార్కెట్ పెట్టుబడుల ద్వారా గణనీయమైన లాభాలు అందుకుంటారు. వ్యాపారులు వ్యాపార ప్రయత్నాలలో పురోగతి, విజయాలను సాధిస్తారు. విద్యార్థులు మంచి విజయాలను సాధిస్తారు. సమాజంలో గౌరవం కూడా ఉంటుంది. ఉద్యోగులు నూతన బాధ్యతలను స్వీకరిస్తారు. స్థాన చలనం జరిగే సూచన ఉంది. వారం మధ్యలో గృహంలో కొన్ని సమస్యలు ఆందోళన కలిగించవచ్చు. కానీ మీ ప్రతిభతో వాటిని పరిష్కరిస్తారు. ఈ రాశివారు ఈ వారం ఆర్థిక పరంగా శుభ ప్రయోజనాలను అందుకుంటారు. శత్రువుల నుంచి ఆపదలు ఎదురు కావచ్చు. అప్రమత్తంగా ఉండండి. ఆరోగ్యం బాగుంటుంది. శ్రీలక్ష్మీ ధ్యానం శుభప్రదం.

ధనుస్సు (Sagittarius) :ధనుస్సురాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. వారం ప్రారంభంలో తీవ్రమైన అనారోగ్య సమస్యల కారణంగా పనులకు అంతరాయం కలగవచ్చు. వైద్య ఖర్చుల నిమిత్తం అధిక ధనవ్యయం ఉంటుంది. విద్యార్థులకు చదువుపై ఏకాగ్రత లోపిస్తుంది. ఆశించిన ఫలితాలను సాధించడానికి పట్టుదలతో ప్రయత్నించాలి. వ్యాపారంలో పోటీదారుల నుంచి తీవ్రమైన సవాళ్లు ఎదుర్కొంటారు. మార్కెట్ తిరోగమనం ఫలితంగా తీవ్ర నష్టాలు చూస్తారు. ఉద్యోగులకు పనిలో శ్రమ పెరుగుతుంది. జీవిత భాగస్వామి మద్దతుతో కుటుంబ సమస్యలు ఓ కొలిక్కి వస్తాయి. కోర్టు సంబంధిత సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకుంటే మేలు. ప్రయాణాలు అనుకూలించవు. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే ప్రతికూలతలు తొలగిపోతాయి.

మకరం (Capricorn) :మకరరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఎంతోకాలంగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులు కోరుకున్న ఉద్యోగాన్ని పొందుతారు. మంచి జీతంతో ఉద్యోగం లభిస్తుంది. వృత్తి, వ్యాపారపరమైన సమస్యలను స్నేహితుల సహకారంతో అధిగమిస్తారు. పనిపట్ల మీ అంకితభావానికి, మీ నిరంతర కృషికి ఉన్నతాధికారుల ప్రశంసలు లభిస్తాయి. ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగులకు సహోద్యోగుల సహకారం లభిస్తుంది. ఆస్తి వివాదంలో తీర్పు మీకు అనుకూలంగా ఉండవచ్చు. జీవిత భాగస్వామితో అనుబంధం దృఢ పడుతుంది. వారం చివరలో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబంతో తీర్థయాత్రలకు వెళతారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ఇష్ట దేవతారాధన శుభప్రదం.

కుంభం (Aquarius) :కుంభరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. గత కొంతకాలంగా వేధించిన సమస్యలు తగ్గుముఖం పడతాయి. కుటుంబ సభ్యుల సహకారంతో వృత్తిలో స్థిరత్వం సాధిస్తారు. వ్యాపారంలో లాభాల కోసం కొత్త మార్గాలు అన్వేషిస్తారు. వ్యాపార నిమిత్తం చేసే ప్రయాణాలు ప్రయోజనకరంగా ఉంటాయి. ఈ పర్యటనలో కొత్త వ్యక్తులను కలుసుకుంటారు. ఉద్యోగులు చేపట్టిన నూతన బాధ్యతలను సహచరుల సహకారంతో పూర్తి చేస్తారు. ప్రమోషన్​కు అవకాశం ఉంది. విలాసాల కోసం ధనవ్యయం చేస్తారు. ఆర్థిక క్రమశిక్షణ పాటించడం అవసరం. వృధా ఖర్చులు నివారిస్తే మంచిది. ఆరోగ్యం సహకరిస్తుంది. ఇష్ట దేవతారాధన శుభప్రదం.

మీనం (Pisces) :మీనరాశి వారికి ఈ వారం లాభదాయకంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలలో ఊహించిన దానికన్నా ఎక్కువ పురోగతి ఉంటుంది. ఉద్యోగులు వారం ప్రారంభంలో ఉద్యోగ రీత్యా దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. అదనపు ఆదాయ వనరులు సమకూరుతాయి. ఉద్యోగంలో మార్పు కోరుకునేవారు మంచి అవకాశాలు పొందుతారు. వ్యాపారంలో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. పని ప్రదేశంలో గౌరవం పెరుగుతుంది. స్థిరాస్తి రంగంలో కొనుగోళ్లు, అమ్మకాలు జోరందుకుంటాయి. అవివాహితులకు వివాహం నిశ్చయమవుతుంది. కుటుంబంతో కలిసి పర్యాటక ప్రదేశాలకు వెళతారు. ఆదాయానికి తగ్గట్లుగా ఖర్చులుంటాయి. ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబంలో శాంతి నెలకొంటుంది. గణనాథుని ఆలయ సందర్శన శుభకరం.

ABOUT THE AUTHOR

...view details