తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

ఈవారం ఆ రాశివారు వాహనం కొనుగోలు చేసే ఛాన్స్​! శ్రీలక్ష్మీ దేవిని పూజిస్తే ఐశ్వర్యప్రాప్తి! - Weekly Horoscope In Telugu

Weekly Horoscope From 4th Aug to 10th Aug 2024 Horoscope : 2024 జులై​ 28వ తేదీ నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు మీ రాశిఫలం ఎలా ఉందంటే ?

Weekly Horoscope From 4th Aug to 3rd Aug 2024 in telugu
Weekly Horoscope From 4th Aug to 3rd Aug 2024 (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Aug 4, 2024, 5:23 AM IST

Weekly Horoscope From 4th Aug to 10th Aug 2024 Horoscope :2024 ఆగస్టు 4వ తేదీ నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు మీ రాశి ఫలం ఎలా ఉందంటే ?

మేషం (Aries) :మేష రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ముందుగా నిర్దేశించుకున్న ప్రణాళిక ప్రకారం అన్ని పనులు పూర్తవుతాయి. ఉద్యోగ వ్యాపారంలో విజయాన్ని సాధిస్తారు. వారం మధ్యలో కొన్ని సానుకూల వార్తలు అందుతాయి. ఉద్యోగులు సహోద్యోగుల నుంచి పూర్తి సహాయాన్ని అందుకుంటారు. వ్యాపారస్థులు ఆర్థిక విషయాల పట్ల జాగ్రత్త వహించాలి. పెట్టుబడుల విషయంలో తెలివిగా, ముందుచూపుతో వ్యవహరించాలి. వృత్తి పరంగా, వ్యక్తిగతంగా ఎదురయ్యే సవాళ్లు పరిష్కరించడంలో జీవిత భాగస్వామి మద్దతు లభిస్తుంది. అవివాహితులకు వివాహం నిశ్చయం కావచ్చు. విద్యార్థులు చదువులో రాణిస్తారు. ఇష్ట దేవతారాధన శుభకరం.

వృషభం (Taurus) :వృషభ రాశి వారికి ఈ వారం అత్యంత అనుకూలంగా ఉంటుంది. గృహంలో శుభకార్యాలు జరుగుతాయి. బంధు మిత్రుల రాకతో కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. వృత్తి వ్యాపారంలో అనుకూలత, ఆర్థికంగా అభివృద్ధి ఉంటాయి. ఉద్యోగంలో ఆటంకాలు ఉన్నా అధిగమిస్తారు. సమాజంలో గొప్ప వ్యక్తులను కలుసుకుంటారు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న భూమి, వాహనం కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో తీర్థయాత్రలకు వెళ్తారు. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో అనుబంధం దృఢ పడుతుంది. ఆకస్మిక ధనలాభాలు ఉండవచ్చు. శ్రీలక్ష్మీ దేవిని పూజిస్తే ఐశ్వర్యప్రాప్తి ఉంటుంది.

మిథునం (Gemini) :మిథునరాశి వారికి ఈ వారం విశేషమైన యోగం కలుగబోతోంది. ఇప్పటివరకు జీవితంలో అనుభవించిన అన్ని కష్టాలకు పరిష్కారం లభిస్తుంది. ఉద్యోగ వ్యాపారాలలో లక్ష్య సాధనకు సన్నిహితుల మద్దతు లభిస్తుంది. వృత్తి నిపుణులు అత్యంత ప్రతిభతో పనిచేసి గొప్ప విజయాలను సొంతం చేసుకుంటారు. వ్యాపారంలో పెట్టుబడులు, లాభాలు పెరుగుతాయి. సంపద వృద్ధి చెందుతుంది. ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. కుటుంబంలోని వృద్ధుల ఆరోగ్యం ఆందోళనకరంగా ఉంటుంది. ఉద్యోగస్థులకు వారం ప్రారంభంలో విదేశాలకు వెళ్లే అవకాశాలు వస్తాయి. మీ సంతానం ప్రయోజకత్వం సమాజంలో గౌరవాన్ని పెంచుతుంది. చాలా కాలంగా నిలిచిపోయిన లేదా వాయిదా పడిన ప్రణాళికలు ఆకస్మికంగా ముందుకు సాగుతాయి. శివారాధన శ్రేయస్కరం.

కర్కాటకం (Cancer) :కర్కాటకరాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో ఆశించిన విజయాలు పొందాలంటే సోమరితనాన్ని అధిగమించాలి. కష్టపడితే తప్ప విజయాలు రావన్న సంగతి గుర్తించాలి. ఉద్యోగస్థులు అంది వచ్చిన అవకాశాలు చేజారిపోకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యులతో అనుబంధం దృఢ పడుతుంది. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు. కీలకమైన విషయాలలో సానుకూల నిర్ణయాలు వచ్చే అవకాశం ఉంది. బంధుమిత్రులతో విందు వినోదాలలో పాల్గొంటారు. ఆరోగ్య పట్ల శ్రద్ధ అవసరం. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

సింహం (Leo) :సింహ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో సాహసోపేతమైన విజయాలు సాధిస్తారు. ఎవరి అంచనాలకు అందనంత ఎత్తుకు ఎదుగుతారు. వృత్తి జీవితం, వ్యక్తిగత జీవితం సమన్వయము చేసుకుంటూ ముందుకెళ్తూ అందరి అభిమానాన్ని పొందుతారు. చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యుల మధ్య అపార్థాలు తొలగిపోతాయి. ఉద్యోగంలో ప్రమోషన్, జీతం పెరుగుదల వంటి అంశాలకు అవకాశం ఉంది. విదేశాలకు వెళ్లే ఛాన్స్ కూడా ఉంది. కుటుంబ బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహిస్తారు. వైవాహిక జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. కుటుంబలో శుభకార్యాలు జరుగుతాయి. గురువులు, పెద్దల ఆశీస్సులు పుష్కలంగా ఉంటాయి. స్వల్ప అనారోగ్య సమస్యలుండవచ్చు. ఆదిత్య హృదయం పారాయణ శక్తినిస్తుంది.

కన్య (Virgo) : కన్యరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాలలో పోటీతత్త్వం పెరుగుతుంది. స్వల్ప విజయాలు మాత్రమే ఉండవచ్చు. ఆర్ధిక వ్యవహారాల్లో ఆచి తూచి అడుగు వేస్తే మంచిది. అవకాశవాదుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఉద్యోగస్థులు పనిభారం పెరుగుతుంది. ఒత్తిడికి లోనవుతారు. సహోద్యోగుల సహకారం లోపిస్తుంది. ఆర్ధికంగా బలోపేతం అవుతారు. కుటుంబ జీవితం సంతోషకరంగా ఉంటుంది. ఆధ్యాత్మిక అంశాల పట్ల ఆసక్తి కనబరుస్తారు. ముఖ్యమైన వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సలహాలు తప్పకుండా పాటించాలి. క్రీడా రంగం వారు గొప్ప విజయాలను అందుకుంటారు. ఆరోగ్యంపై అదనపు శ్రద్ధ అవసరం. మెరుగైన ప్రయోజనాల కోసం గణపతి ఆలయ సందర్శన చేయడం ఉత్తమం.

తుల (Libra) :తులారాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. వృత్తి వ్యాపార రంగాల వారు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. లేకపోతే సమయం నష్టం, ధన నష్టం రెండూ ఉంటాయి. వ్యక్తిగత జీవితం, వృత్తి జీవితాన్ని సమన్వయము చేసుకుంటూ ముందుకెళ్లకపోతే సమస్యలు తప్పవు. ఇంటి మరమ్మత్తుల కోసం అధిక ధనవ్యయం ఉండవచ్చు. వ్యాపారస్థులు రుణాల కోసం చేసే ప్రయత్నాలకు ఆటంకాలు ఎదురవుతాయి. సమాజంలో పరపతి ఉన్న వ్యక్తుల సహాయం అవసరం అవుతుంది. రక్తసంబంధీకుల మధ్య తలెత్తిన భూ గృహ వివాదాలు కోర్టు వెలుపల పరిష్కారం ఉత్తమం. తీవ్ర అనారోగ్య సమస్యలతో చికాకు కలగవచ్చు. మానసిక ప్రశాంతత కోసం యోగా, ధ్యానం చేయండి. కుటుంబంలో శాంతి కోసం తీవ్ర కృషి అవసరం. సూర్య ఆరాధన, సూర్య నమస్కారాలు చేయడం వలన సమస్యలు తగ్గుతాయి.

వృశ్చికం (Scorpio) :వృశ్చిక రాశి వారికి ఈ వారం సంతోషకరంగా ఉంటుంది. ఉద్యోగులు కోరుకున్న చోటికి బదిలీలు, పదోన్నతులు పొందుతారు. మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచే అదనపు రాబడి సమకూరుతుంది. పొదుపు పథకాలలో గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి సత్ఫలితాలు పొందుతారు. పెండింగ్‌ కోర్టు కేసుల్లో నిర్ణయం మీకు అనుకూలంగా ఉండవచ్చు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. మధురస్మృతులు నెమరువేసుకుంటారు. జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. సంతానానికి సంబంధించిన సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. వ్యాపారంలో మంచి పురోగతి సాధిస్తారు. ఆదాయం వృద్ధి చెందుతుంది. ఈశ్వర ఆరాధన శ్రేయస్కరం.

ధనుస్సు (Sagittarius) :ధనుస్సు రాశి వారికి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి వృతి వ్యాపారాలలో మెరుగైన ప్రయోజనాలు పొందాలంటే తీవ్ర కృషి అవసరం. పని పట్ల సోమరితనం, నిర్లక్ష్య వైఖరి కారణంగా తీవ్రంగా నష్టపోతారు. బద్దకాన్ని వీడి కష్టించి పనిచేస్తే గౌరవం ఉంటుంది. వ్యాపారస్థులు తీవ్రమైన పోటీని ఎదుర్కొంటారు. ఆర్ధిక సంబంధిత విషయాలలో ఆచి తూచి నిర్ణయాలు తీసుకోవడం మేలు. స్థిరాస్తులు కొనుగోలు చేసేటప్పుడు కుటుంబ సభ్యుల సలహా మేలు చేస్తుంది. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. కుటుంబంలో పెద్దల పట్ల గౌరవంతో ఉంటే మంచిది. నవగ్రహ ప్రదక్షిణలు చేస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి.

మకరం (Capricorn) :మకరరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారు తమ తమ రంగాలలో తీవ్రమైన పోటీ, సవాళ్లు ఉన్నప్పటికినీ అధిగమిస్తారు. సరైన సమయంలో సరైన కృషితో అఖండ విజయాలను సాధిస్తారు. వ్యాపారస్థులు మంచి లాభాలను గడిస్తారు. సంస్థ అభివృద్ధి కోసం పాటుపడతారు. ఇంటికి బంధువులు రావడంతో ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఉద్యోగస్థులు సకాలంలో అన్ని పనులు పూర్తిచేసి, పదోన్నతులు ఆర్థిక లాభాలు పొందుతారు. పోటీపరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు శుభవార్తలు ఉండవచ్చు. ఆరోగ్యం బాగుంటుంది. జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు. దైవదర్శనం కోసం తీర్థయాత్రలకు వెళతారు. ఇష్ట దేవతారాధన శుభకరం.

కుంభం (Aquarius) :కుంభరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపార రంగాల వారు పనిలో ఎదురైనా సవాళ్లను ధైర్యంగా స్వీకరించి ముందుకెళ్తే మంచిది. మీ ప్రతిభతో ఎలాంటి అవరోధాలనైనా అవలీలగా ఎదుర్కొంటారు. దైవబలం అండగా ఉంది. విద్యార్థులు తీవ్రమైన కృషి పట్టుదలతో మాత్రమే విజయాలను పొందగలరు. శత్రువులు పొంచి ఉన్నారు. అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. వ్యాపారస్థులు వ్యాపార నిమిత్తం ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండండి. వైవాహిక జీవితం సంతోషకరంగా ఉంటుంది. శ్రీలక్ష్మీ గణపతి ఆలయ సందర్శన శుభకరం.

మీనం (Pisces) :మీన రాశి వారికి రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి, వ్యాపార విస్తరణ చేయాలనుకునేవారికి శుభ సమయం నడుస్తోంది. ఉద్యోగస్థులు కోరుకున్న ప్రమోషన్ పొందుతారు. ఆర్ధికంగా ఎదుగుతారు. సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీ సంతానానికి సంబంధించిన శుభవార్తలు వింటారు. బంధు మిత్రులతో విహార యాత్రలకు వెళతారు. కుటుంబ సభ్యులతో ఉన్న అపార్థాలు తొలగిపోతాయి. మునుపెన్నడూ లేనంతగా ఆదాయం వృద్ధి చెందుతుంది. శ్రీలక్ష్మి ధ్యానం శుభకరం.

ABOUT THE AUTHOR

...view details