Weekly Horoscope From 18th Aug to 24th Aug 2024 Horoscope : 2024 ఆగస్టు 18వ తేదీ నుంచి ఆగస్టు 24 తేదీ వరకు మీ రాశిఫలం ఎలా ఉందంటే ?
మేషం (Aries) :మేషరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలుంటాయి. వృత్తి వ్యాపారాలలో ఏర్పడిన ఆటంకాలను అధిగమించి విజయం సాధిస్తారు. కుటుంబ వ్యవహారాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలి. గందరగోళం నెలకొనే సందర్భంలో విషయాలను వాయిదా వేయడం ఉత్తమం. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు బలపడతాయి. గతంలో ఆగిపోయిన పనులను పూర్తి చేస్తారు. వైవాహిక జీవితంలో మధురానుభూతి ఉంటుంది. సోదరుల మధ్య అంబంధాలు దృఢ పడతాయి. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. ఇతరుల ఒత్తిడి ప్రభావంతో నిర్ణయాలు తీసుకోవడం మానుకోండి. ఆదాయం వృద్ధి చెందుతుంది. శ్రీలక్ష్మీ నారాయణులను పూజిస్తే శుభఫలితాలు ఉంటాయి.
వృషభం (Taurus) :వృషభరాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. ఇంటా బయటా చిన్న చిన్న సమస్యలను భూతద్దంలో చూసి లేనిపోని సమస్యలను కొని తెచ్చుకుంటారు. మితిమీరిన కోపం కారణంగా అందరితో కలహాలు ఏర్పడతాయి. స్థిరాస్తి కొనుగోలు, అమ్మకాలు కలిసి వస్తాయి. వ్యాపారంలో ఆశించిన లాభాలను పొందుతారు. గతంలో రావలసిన బకాయిలు కూడా అందుతాయి. ఉద్యోగంలో శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారు వారం చివరలో శుభవార్తలను అందుకుంటారు. జీవిత భాగస్వామితో సుదూర ప్రయాణాలకు అవకాశం ఉంది. మీ తల్లి గారి ఆరోగ్యం ఆందోళనకరంగా ఉంటుంది. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు. ఓ విషయంలో బంధువుల ప్రవర్తన మనస్తాపాన్ని కలిగిస్తుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. అభయ ఆంజనేయ స్వామి ఆలయ సందర్శన శుభకరం.
మిథునం (Gemini) :మిథున రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో తీవ్రమైన శ్రమతో మాత్రమే అనుకున్న పనులు సమయానికి పూర్తవుతాయి. చేపట్టిన పనిలో తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. ఉద్యోగులు టార్గెట్లు సాధించడానికి సమస్యలు ఎదురవుతాయి. ఆర్థిక సమస్యలపై దృష్టి సారిస్తే మంచిది. అదనపు ఆదాయ వనరుల కోసం చేసే ప్రయత్నాలు ఫలవంతం అవుతాయి. భూమి, భవనాలు, వాహనాల కొనుగోలు అమ్మకాలను వాయిదా వేస్తే మంచిది. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరం. భార్యాభర్తల మధ్య అనుబంధం దృఢపడుతుంది. ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. శివారాధన శ్రేయస్కరం.
కర్కాటకం (Cancer) :కర్కాటక రాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. వృత్తి వ్యాపార రంగాల వారికి వృత్తిలో ఎదగడానికి చేసే ప్రయత్నాలకు తరచుగా ఆటంకాలు ఏర్పడతాయి. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఉత్సాహాన్ని కోల్పోకూడదు. అసూయపరులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. వ్యాపారులు వారం ప్రారంభంలో వ్యాపార నిమిత్తం దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. వారం చివరి భాగంలో ఉద్యోగ సమస్యలు సీనియర్ల సహకారంతో పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. ఆస్తి సంబంధిత సమస్యలను కోర్టు వెలుపల పరిష్కారం చేసుకుంటే మంచిది. నవగ్రహ ధ్యానంతో మెరుగైన ఫలితాలు ఉంటాయి.
సింహం (Leo) :సింహరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలలో ఆశించిన ప్రయోజనాలు ఉంటాయి. కళాకారులకు శుభ సమయం. అరుదైన అవకాశాలను అందుకుంటారు. సమాజంలో సన్మానం సత్కారాలను పొందుతారు. ఆర్థికంగా ఈ వారం ఈ రాశి వారికి శుభకరంగా ఉంటుంది. పలు మార్గాలలో ధనాదాయం ఉంటుంది. పిత్రార్జిత ఆస్తులు కలిసి వస్తాయి. భూమి, భవనాలు, వాహనాలు కొనడానికి, అమ్మడానికి ఈ వారం అనుకూలంగా ఉంది. సన్నిహితులతో, కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని గడుపుతారు. ప్రేమ వ్యవహారాలు పెద్దల అంగీకారంతో పెళ్లితో ముగుస్తాయి. విద్యార్థులకు అదృష్టకరమైన సమయం నడుస్తోంది. గొప్ప విజయాలను సాధిస్తారు. ఉన్నత విద్య కోసం విదేశాలకు ప్రయాణమవుతారు. శ్రీలక్ష్మీ కుబేర అష్టోత్తరం పఠించడం శుభప్రదం.
కన్య (Virgo) : కన్యా రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. వ్యాపారులు వారం ప్రారంభంలో దూరప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. గతంలో ఉన్న ఆర్థిక సమస్యలు ఓ కొలిక్కి వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగులు ఒక ప్రణాళిక ప్రకారం పనిచేస్తే అన్ని పనులు సకాలంలో పూర్తవుతాయి. ప్రేమ వ్యవహారాలు వివాహబంధంగా మారుతాయి. వైవాహిక జీవితం ఆనందంగా సాగుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. వ్యాపారంలో అధిక లాభాలను సాధించడానికి చేసే ప్రయత్నాలు విఫలమవుతాయి. ప్రతికూల ఆలోచనలు వీడి సానుకూల దృక్పథంతో ఉంటే విజయం సాధ్యమవుతుంది. ఎగుమతి దిగుమతి వ్యాపారులు విదేశాలతో కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.ఇష్ట దేవతారాధన శుభప్రదం.
తుల (Libra) :తులారాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. వారం ప్రారంభంలో వృత్తి వ్యాపారాలలో సవాళ్లను ఎదుర్కొంటారు. ఉద్యోగంలో పనిభారం పెరుగుతుంది. సహోద్యోగుల సహకారాన్ని పొందుతారు. వారం మధ్యలో ఒత్తిడి తగ్గి సాధారణ పరిస్థితులు నెలకొంటాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో క్లిష్టమైన నిర్ణయం తీసుకునే విషయంలో కుటుంబ సభ్యులందరి మద్దతును అందుకుంటారు. జీవిత భాగస్వామితో తీర్థయాత్రలకు వెళతారు. వ్యాపారులకు భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. శ్రమకు తగిన ఫలితాలను పొందుతారు. సంస్థ అభివృద్ధికి మీ వంతు సహకారాన్ని అందిస్తారు. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు. ఆరోగ్యం సహకరిస్తుంది. శివారాధన శ్రేయస్కరం.
వృశ్చికం (Scorpio) :వృశ్చిక రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి ఈ వారం పరీక్ష సమయం. వృత్తి వ్యాపారాలలో, వ్యక్తిగత జీవితంలో కూడా శత్రువుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. తీవ్రంగా శ్రమిస్తే తప్ప ఆశించిన ఫలితాలను అందుకోలేరు. ఆర్థిక వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే మోసపోయే ప్రమాదముంది. వ్యాపారులు వ్యాపారం నిమిత్తం ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఉద్యోగంలో మార్పు కోరుకునేవారు శుభవార్తలు అనుకుంటారు. కోరుకున్న ఉద్యోగం దొరుకుతుంది. విద్యార్థులు ఏకాగ్రతతో ప్రయత్నిస్తే కార్యజయం ఉంటుంది. స్వల్ప అనారోగ్య సమయాలు ఉండవచ్చు. సూర్య ఆరాధన శ్రేయస్కరం.
ధనుస్సు (Sagittarius) :ధనుస్సు రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో గణనీయమైన పురోగతిని సాధిస్తారు. ఆదాయం పదింతలు పెరుగుతుంది. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. నూతన ఆదాయ వనరుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తుంటాయి. సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. వ్యాపారులకు కొత్త పరిచయాల ద్వారా పెట్టుబడులు సమకూరుతాయి. లాభాలలో పురోగతి ఉంటుంది. మీ స్వంత వ్యాపారాన్ని ప్రారంభించడం లేదా ఇప్పటికే ఉన్న వ్యాపారాన్ని విస్తరించడం గురించి ఆలోచిస్తున్నట్లయితే, ఈ వారం మీ కోరిక నెరవేరవచ్చు. కళాకారులకు, స్థిరాస్తి రంగం వారికి ఈ వారం శుభ ప్రదంగా ఉంటుంది. అందరు గుర్తించే విజయాలను సాధిస్తారు. ఇది మీ గౌరవాన్ని పెంచుతుంది. సంతానం పురోగతికి సంబంధించి శుభవార్తలు అందుకుంటారు. కుటుంబంతో విహారయాత్రకు వెళతారు. ఆరోగ్యం సహకరిస్తుంది. గణపతి ఆలయ సందర్శన శుభకరం.
మకరం (Capricorn) :మకరరాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. ఈ రాశి వారు ఈ వారం తమ లక్ష్యాలపై దృష్టి పెట్టాలి. చిత్తశుద్ధితో, ఏకాగ్రతతో పని చేస్తే తప్ప విజయాలు సాధించలేరు. ఇప్పటివరకు అనుభవించిన కష్టాలు తొలగిపోతాయి. ఆర్థిక వ్యవహారాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా పథకంలో పెట్టుబడి పెట్టే ముందు అనుభవజ్ఞుల సలహా తప్పనిసరి. అనవసర విషయాలకు, వివాదాలకు దూరంగా ఉండాలి. ఉద్యోగంలో సవాళ్ళను సమయస్ఫూర్తితో అధిగమిస్తారు. కుటుంబ కలహాలకు ఆస్కారముంది. మొండి వైఖరి వీడి సర్దుబాటు ధోరణితో ఉంటే సమస్యలు పరిష్కారమవుతాయి. ఈ విషయంలో మీ జీవిత భాగస్వామి మద్దతు పూర్తిగా ఉంటుంది. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి. ఉద్యోగంలో మార్పు కోరుకునేవారు మరికొంత కాలం వేచి చూడాలి. ఆరోగ్యం సహకరిస్తుంది. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి.
కుంభం (Aquarius) :కుంభ రాశి వారికి ఈ వారం గొప్ప ప్రయోజనకరంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలలో శుభ సమయం నడుస్తోంది. ఏ పని చేపట్టినా విజయవంతమవుతుంది. వ్యాపారంలో పట్టిందల్లా బంగారం అవుతుంది. వ్యాపార నిమిత్తం చేసే ప్రయాణాలు కలిసి వస్తాయి. ఉద్యోగులకు సహోద్యోగుల సహకారం సంపూర్ణంగా ఉంటుంది. మీ పనితీరుతో ఉన్నతాధికారులను మెప్పిస్తారు. ప్రమోషన్ ఛాన్స్ ఉంది. ఈ వారం అన్ని రంగాల వారు జీవితంలో ముందుకు సాగడానికి అద్భుతమైన అవకాశాలు అందుకుంటారు. ఉద్యోగులకు అదనపు ఆదాయ వనరులు సమకూరుతాయి. సమాజంలో గొప్ప వ్యక్తితో పరిచయం భవిష్యత్తులో గణనీయమైన ఆదాయానికి దారి తీస్తుంది. భూమి,ఇల్లు కొనుగోలు అమ్మకంలో మీ తల్లిదండ్రుల సహకారం ఉంటుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు కొన్ని ఆనందకరమైన వార్తలను అందుకుంటారు. మొత్తం మీద ఈ వారం పూర్తి శుభకరంగా ఉంటుంది. ఇష్ట దేవతారాధన శ్రేయస్కరం.
మీనం (Pisces) :మీన రాశి వారికి ఈ వారం విజయవంతంగా ఉంటుంది. లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. సంపన్నులు అవుతారు. అన్ని రంగాల వారికి వారం ప్రారంభంలో నూతన అవకాశాలు మీ తలుపు తడతాయి. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. విదేశాలలో చదువుకోవాలని లేదా ఉద్యోగం చేయాలని కోరుకునేవారు కల నిజం అవుతుంది. ఉద్యోగులు పదోన్నతులు, బదిలీలను అందుకుంటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ లేకపోతే వ్యాధుల బారిన పడవచ్చు. కుటుంబ సభ్యులతో అనుబంధాలు దృఢ పడతాయి. భూమి, భవనాలు, పూర్వీకుల ఆస్తికి సంబంధించిన వివాదాలకు పరిష్కారం లభిస్తుంది. చట్టపరమైన కేసులలో ఫలితం మీకు అనుకూలంగా ఉంటుంది. ఈశ్వర ఆలయ సందర్శనతో మరిన్ని శుభ ఫలితాలు ఉంటాయి.