TTD Stops the These Sevas on the Occasion of Ratha Saptami : కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే వేంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకునేందుకు ప్రపంచం నలుమూలల నుంచి నిత్యం వేల మంది భక్తులు తిరుమలకు వస్తుంటారు. జీవితంలో ఒక్కసారైనా ఆ స్వామి వారి సన్నిధిలో అడుగు పెట్టాలని ఎంతో మంది ఆశపడతారు. భక్తులు కాలి నడక మార్గం ద్వారా ఏడుకొండలు ఎక్కి తమ మొక్కులను చెల్లించుకుంటారు. అయితే.. ఫిబ్రవరి 16వ తేదీన తిరుమల వెళ్లాలనుకునే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం కీలక ప్రకటన చేసింది. ఆరోజున పలు సేవలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఆ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం..
ఆ సేవలు రద్దు:ఫిబ్రవరి 16న తిరుమల శ్రీవారి ఆలయంలో రథసప్తమి వేడుకలను నిర్వహించనున్నట్టు టీటీడీ ప్రకటించింది. సూర్య జయంతిని పురస్కరించుకొని ఆలయంలో ఈ వేడుకలు జరగనున్నాయని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా.. స్వామివారికి పలు వాహన సేవలు ఉంటాయని పేర్కొంది. ఏడు వాహనాలపై శ్రీ మలయప్ప స్వామివారు ఆలయ మాఢ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారని వివరించింది. ఈ నేపథ్యంలో ఆలయంలో ఆ రోజున స్వామివారికి నిర్వహించే పలు ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలు రద్దు చేసినట్టు పేర్కొంది. కాగా.. సుప్రభాతం, తోమాల, అర్చన సేవలు ఏకాంతంలో నిర్వహించనున్నట్లు తెలిపింది. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని స్పష్టం చేసింది..
అత్యంత వైభవంగా మలయప్పస్వామివారి పుష్పయాగం - 3 రాష్ట్రాల నుంచి 11రకాలు పూలు