TOP 5 BATHUKAMMA SONGS WITH LYRICS : బతుకమ్మ తెలంగాణ ప్రజల సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక. పూలను పూజించే గొప్ప పండగ. ఈ పండగకు ఆడపిల్లలకు విడదీయరాని అనుబంధం ఉంటుంది. తొమ్మిది రోజుల పాటు సాగే ఈ బతుకమ్మ ఉత్సవాల్లో ఆడపడుచులు అందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొంటారు. మహిళలు అందంగా ముస్తాబై.. తీరొక్క పువ్వులతో బతుకమ్మను పేర్చుతారు. ఆ తర్వాత వాటికి పూజలు చేసి బతుకమ్మల చుట్టూ చేరి పాటలు పాడుతూ ఆడతారు. అయితే.. ఈ పండగలో ప్రధాన పాత్ర పాటదే. పాత తరంలో మగువలు తమ గాత్రాలతోనే మధురమైన పాటలు పాడేవారు. కానీ ఈ తరం అమ్మాయిలకు ఆ పాటలు అంతగా రావు. కేవలం ఇటీవల వచ్చిన సాంగ్స్ మాత్రమే వింటుంటారు. అయితే.. కొత్తగా వచ్చిన పాటలు ఎన్ని విన్నా సరే.. ఆ పాత పాటలకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. బతుకమ్మ పండగ వచ్చిదంటే.. ఈ పాత పాటలు మోగాల్సిందే. మరి, ఇంకెందుకు ఆలస్యం ఆ టాప్ 5 పాత బతుకమ్మ పాటలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
1 బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో..
బంగారు బతుకమ్మ ఉయ్యాలో..
ఆనాటి కాలాన ఉయ్యాలో..
ధర్మాంగుడను రాజు ఉయ్యాలో..
ఆ రాజు భార్యయు ఉయ్యాలో..
అతి సత్యవతి యనేరు ఉయ్యాలో..
నూరు నోములు నోమి ఉయ్యాలో..
నూరు మందిని కాంచె ఉయ్యాలో..
వారు శూరులై ఉయ్యాలో..
వైరులచే హతమైరి ఉయ్యాలో.
2. ఏమిమి పువ్వొప్పునే గౌరమ్మ
ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ.. ఏమేమి కాయెుప్పునే గౌరమ్మ
తంగేడు పువ్వొప్పునే గౌరమ్మ తంగేడు కాయెుప్పునే గౌరమ్మ
తంగేడు చెటుకింద ఆటసిలకలాల పాటసిలకలాల కలికిసిలకలాల
కందుమ్మగుట్టలు రానువోనడుగులు తీరుద్దరాషలు తారుగోరంటలు..
గనమైన పున్నపూవే గౌరమ్మ.. గజ్జెలా వడ్డాలమే గౌరమ్మ..
3. చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ
చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ
బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన