తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

తిరుమల శ్రీ‌వారి సేవ‌కు వెళ్తున్నారా? - టీటీడీ సూచనలు తెలుసా? - Tirumala Srivari Brahmotsavam 2024

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఎంతో వైభవంగా కొనసాగుతున్నాయి. అయితే, ఈ ఉత్సవాల్లో పాల్గొనే భక్తులకు టీటీడీ ఈవో శ్యామలరావు కొన్ని ముఖ్యమైన సూచనలు చేశారు.

Tirumala Brahmotsavam 2024
Tirumala Brahmotsavam 2024 (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Oct 7, 2024, 12:25 PM IST

Tirumala Brahmotsavam 2024 :తిరుమ‌ల వెంకన్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా.. స్వామివారి గరుడ సేవకు ఏర్పాట్లు శరవేగంగా చేస్తున్నారు. ఈ నెల 8న సాయంత్రం 6:30 గంటల నుంచి.. రాత్రి 11 గంటల వరకు శ్రీ మలయప్ప స్వామి గరుడ వాహనంపై విహరిస్తారు. ఈ ఉత్సవానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తారు. ఈ నేపథ్యంలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్టు టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు.

సుమారు 2 లక్షల మంది భక్తులకు గ్యాలరీలు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. గరుడ సేవ దర్శనం కోసం.. ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు, ఔటర్‌ రింగ్‌ రోడ్డుల్లో వేచి ఉండే భక్తులకు సౌత్‌ వెస్ట్‌ కార్నర్‌, సుపథం, నార్త్‌ వెస్ట్‌ గేట్‌, గోవిందనిలయం, నార్త్‌ ఈస్ట్‌ గేట్ల ద్వారా దర్శనం క‌ల్పిస్తామని చెప్పారు. భక్తుల సౌకర్యార్థం అన్ని పాయింట్ల దగ్గర సైన్ బోర్డులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

ముఖ్య సూచనలు..

  • భక్తులు లగేజీని తీసుకెళ్లకుండా.. బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు ఆయా పాయింట్లలోకి ప్రవేశించాలి.
  • భక్తుల సేఫ్టీ, సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని తిరుమల ఘాట్‌ రోడ్లలో ద్విచక్రవాహనాల రాకపోకలను అక్టోబ‌రు 7వ తేదీ రాత్రి 9 గంట‌ల నుంచి అక్టోబ‌రు 9వ తేదీ ఉద‌యం 6 గంట‌ల వ‌ర‌కు రద్దు చేశారు.
  • ట్రాఫిక్‌ రద్దీని తగ్గించేందుకు వీలైతే భక్తులు ప్రజారవాణాను వినియోగించుకోవాలని కోరారు.
  • ఆర్‌టీసీ బస్సుల్లో దాదాపు మూడు వేల రౌండ్‌ ట్రిప్పుల ద్వారా.. సుమారు 3 లక్షల మందిని తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
  • తిరుపతి, శ్రీకాళహస్తి, చిత్తూరు, కడప రూట్లలో పార్కింగ్‌ స్థలాల నుంచి కూడా తిరుమలకు వెళ్లేందుకు ఆర్టీసీ బస్సులను అధికారులు ఏర్పాటు చేశారు.
  • పార్కింగ్ స్థలాలను ఈజీగా గుర్తించడానికి క్యూఆర్‌ కోడ్‌లను ఏర్పాటు చేశారు.
  • తిరుమలలోని బాలాజీనగర్, కౌస్తుభం ఎదురుగా, రాంభాగీచా బస్టాండ్, ముళ్లగుంట ప్రాంతాల్లో దాదాపు 25 చోట్ల తొమ్మిది వేల వాహనాలకు సరిపడా పార్కింగ్ ఏర్పాట్లు చేశారు.
  • తిరుపతిలోని అలిపిరి పాత చెక్‌పాయింట్‌ వద్ద రెండు వేల ద్విచక్ర వాహనాలు, వినాయకనగర్‌ క్వార్టర్స్‌, నెహ్రూ మున్సిపల్‌ పార్కు, భారతీయ విద్యాభవన్‌, దేవలోక్‌, అదనంగా శ్రీవారి మెట్టు వద్ద పార్కింగ్​ సౌకర్యం ఉంది.
  • భక్తులకు వైద్య సదుపాయాల కోసం.. మాడ వీధుల్లో నాలుగు మూలల్లో మొబైల్ క్లినిక్‌లు, 12 అంబులెన్స్‌లు, వైద్యులు, పారామెడికల్ సిబ్బందిని ఏర్పాటు చేశారు.
  • బ్రహ్మోత్సవాల్లో గరుడసేవ వాహనసేవను తిలకించేందు మాడవీధులు, భక్తులతో రద్దీగా ఉండే మ్యూజియం, వరాహస్వామి విశ్రాంతి భవనం, అన్నదానం కాంప్లెక్స్, రంభగీచ విశ్రాంతి భవనం, ఫిల్టర్ హౌస్ వంటి తదితర ప్రాంతాల్లో 28 భారీ హెచ్‌డి డిజిటల్ స్క్రీన్లను ఏర్పాటు చేశారు.
  • గరుడ సేవను పర్యవేక్షించేందుకు 1250 మంది టీటీడీ నిఘా, భద్రతా సిబ్బంది, ఐదు వేల‌ మంది పోలీసులతో పాటు ఆక్టోపస్, గ్రే హౌండ్స్ బృందాలను కూడా ఏర్పాటు చేశారు.
  • భక్తుల కోసం అన్నప్రసాదం, తాగు నీటి సౌకర్యాలను విస్తృతంగా ఏర్పాటు చేశారు. అన్ని గ్యాలరీలు, బయట వివిధ చోట్ల భక్తులకు వీటిని అందిస్తారు.
  • భక్తులు ఈ సూచనలను గమనించాలని టీటీడీ ఈవో శ్యామలరావు చెప్పారు.

ఇవి కూడా చదవండి :

బ్రహ్మోత్సవాల కోసం తిరుమల వెళ్తున్నారా? - శ్రీవారి వాహన సేవల టైమింగ్స్​ ఇవే

ABOUT THE AUTHOR

...view details