Pushya Masam Festivals List : ఎలాగైతే కార్తికం శివునికి, మార్గశిరం విష్ణుమూర్తికి ప్రీతికరమైన మాసాలుగా భావిస్తామో అలాగే పుష్య మాసం శనీశ్వరునికి ప్రీతికరమైన మాసం. ఆధ్యాత్మికత వెల్లివిరిసే పుష్య మాసంలో అనేక విశేషమైన పర్వదినాలు, పుణ్యతిథులు ఉన్నాయి. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడం వల్ల ఈ మాసంలో ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం అవుతుంది. మకర రాశికి అధిపతి శని భగవానుడు కాబట్టి ఈ మాసమంటే శనికి ప్రీతికరం. ఇంతటి విశిష్టమైన పుష్య మాసంలో ఎన్నో పండుగలు, మరెన్నో విశేషాలు. అవేంటో తెలుసుకుందాం.
- డిసెంబర్ 31వ తేదీ మంగళవారం: పుష్య శుద్ధ పాడ్యమి: ఈ రోజు నుంచి పుష్య మాసం ప్రారంభం అవుతుంది.
- జనవరి 1వ తేదీ బుధవారం: పుష్య శుద్ధ విదియ: ఆంగ్ల నూతన సంవత్సరాది, చంద్ర దర్శనం.
- జనవరి 5వ తేదీ ఆదివారం: పుష్య శుద్ధ షష్టి: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి రామతీర్థ కట్ట మీదకు వేంచేయుట
- జనవరి 6వ తేదీ సోమవారం: పుష్య శుద్ధ సప్తమి: ఆండాళ్ నీరాటోత్సవం ప్రారంభం.
- జనవరి 8వ తేదీ బుధవారం: పుష్య శుద్ధ నవమి: కపిలతీర్థంలో శ్రీ కపిలేశ్వర స్వామి తెప్పోత్సవం ప్రారంభం.
- జనవరి 9వ తేదీ గురువారం: పుష్య శుద్ధ దశమి: తిరుమల శ్రీవారి ఆలయంలో చిన్న శాత్తుమొఱ ప్రారంభం.
- జనవరి 10వ తేదీ శుక్రవారం: పుష్య శుద్ధ ఏకాదశి/ద్వాదశి: ముక్కోటి ఏకాదశి. వైకుంఠ ఏకాదశి. శ్రీరంగం, భద్రాచలం, తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం. తిరుమల శ్రీవారి స్వర్ణ రధోత్సవం.
- జనవరి 11వ తేదీ శనివారం: పుష్య శుద్ధ ద్వాదశి/త్రయోదశి: శని త్రయోదశి, శ్రీ స్వామి పుష్కరిణి తీర్థ ముక్కోటి, శ్రీవారి చక్రస్నానం.
- జనవరి 12వ తేదీ ఆదివారం: పుష్య శుద్ధ చతుర్దశి: తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామి తెప్పోత్సవం పరిసమాప్తి. ఆండాళ్ నీరాటోత్సవం సమాప్తి.
- జనవరి 13వ తేదీ సోమవారం: పుష్య శుద్ధ పౌర్ణమి: భోగి పండుగ. శ్రీ గోదా రంగనాయక కళ్యాణం. ప్రయాగరాజ్ కుంభమేళాలో తొలి రాజ స్నానం. కపిల తీర్థంలో ఆరుద్ర దర్శనం మహోత్సవం.
- జనవరి 14వ తేదీ మంగళవారం: పుష్య బహుళ పాడ్యమి: మకర సంక్రమణం. మకర సంక్రాంతి పండుగ. ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం.
- జనవరి 15వ తేదీ బుధవారం: పుష్య బహుళ విదియ: కనుమ పండుగ. తిరుమల శ్రీవారి ప్రణయ కలహ మహోత్సవం. శ్రీవారి పార్వేట ఉత్సవం. వీరవాసరం కోట సత్తెమ్మ అమ్మవారి జాతర
- జనవరి 16వ తేదీ గురువారం: పుష్య బహుళ తదియ: ముక్కనుమ. బొమ్మల నోము ప్రారంభం.
- జనవరి 17వ తేదీ శుక్రవారం: పుష్య బహుళ చవితి: సంకష్టహర చతుర్థి
- జనవరి 18వ తేదీ శనివారం: పుష్య బహుళ పంచమి: వేమన శతజయంతి ఉత్సవాలు. త్యాగరాజస్వామి ఆరాధన.
- జనవరి 19వ తేదీ ఆదివారం: పుష్య బహుళ షష్టి: తిరుమల శ్రీవారి ఆలయంలో పెద్ద శాత్తుమొఱ, వైకుంఠద్వార దర్శనం సమాప్తం.
- జనవరి 23వ తేదీ గురువారం: పుష్య బహుళ నవమి: తిరుమల శ్రీవారి సన్నిధిలో అధ్యయనోత్సవం సమాప్తం.
- జనవరి 24వ తేదీ శుక్రవారం: పుష్య బహుళ దశమి: తిరుమల శ్రీవారు తిరుమలనంబి సన్నిధికి వేంచేయుట.
- జనవరి 25వ తేదీ శనివారం: పుష్య బహుళ ఏకాదశి: మతత్రయ ఏకాదశి . సర్వ ఏకాదశి.
- జనవరి 26వ తేదీ ఆదివారం: పుష్య బహుళ ద్వాదశి: రిపబ్లిక్ డే. గణతంత్ర దినోత్సవం.
- జనవరి 27వ తేదీ సోమవారం : పుష్య బహుళ త్రయోదశి: పక్ష ప్రదోషం. మాసశివరాత్రి.
- జనవరి 28వ తేదీ సోమవారం: పుష్య బహుళ చతుర్దశి: తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామి సన్నిధిన అధ్యయనోత్సవం ప్రారంభం.
- జనవరి 29వ తేదీ మంగళవారం: పుష్య బహుళ అమావాస్య: చొల్లంగి అమావాస్య. పురందరదాసు ఆరాధన ఉత్సవం. దేవుని కడప శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం. పుష్య మాసం సమాప్తం.
పరమ పవిత్రమైన పుష్య మాసంలో నెల రోజుల పాటు శనైశ్చరుని పూజించే వారిపట్ల శని ప్రసన్నుడై శుభాలు కలిగిస్తాడని పురాణాలు తెలుపుతున్నాయి. కాబట్టి పుష్య మాసంలో శాస్త్రంలో చెప్పిన విధముగా పండుగలు జరుపుకుందాం. ఆధ్యాత్మిక అనుభూతులను సొంతం చేసుకుందాం. శుభం భూయాత్!
ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.