ETV Bharat / technology

గూగుల్​ క్రోమ్​ యూజర్లకు ప్రభుత్వం హై-రిస్క్​ వార్నింగ్- వెంటనే ఇలా చేయకపోతే ఇక అంతే! - CERT WARNING TO GOOGLE CHROME USERS

గూగుల్ క్రోమ్ బ్రౌజర్ డెస్క్​టాప్​ యూజర్లకు ప్రభుత్వం హెచ్చరిక - పాత వెర్షన్లలో అనేక లోపాలున్నట్లు వార్నింగ్​ - వెంటనే ఇలా చేయకపోతే పర్సనల్ డేటా హుష్!

CERT Warning To Google Chrome Users
CERT Warning To Google Chrome Users (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 31, 2024, 5:43 PM IST

CERT Warning To Google Chrome Users : భారత్​లో గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఉపయోగించే డెస్క్​టాప్​ యూజర్లందరికీ ప్రభుత్వం హై-రిస్క్​ వార్నింగ్​లు జారీ చేసింది. కంప్యూటర్లలో పాత క్రోమ్‌ బ్రౌజర్‌ను ఉపయోగిస్తున్నట్లయితే యూజర్లు వెంటనే అప్‌డేట్ చేసుకోవాలని భారత ప్రభుత్వ సైబర్‌ సెక్యూరిటీ ఏజెన్సీ 'కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పానెస్స్ టీమ్‌ ఆఫ్ ఇండియా-CERT-IN' హెచ్చరికలు జారీ చేసింది. క్రోమ్‌ బ్రౌజర్‌లో అనేక లోపాల కారణంగా కంప్యూటర్‌ను సైబర్‌ నేరగాళ్లు రిమోట్‌గా యాక్సెస్‌ చేయొచ్చని, సైబర్​ అటాక్​లకు పాల్పడవచ్చని పేర్కొంది.

గూగుల్‌ క్రోమ్‌ విండోస్​, మ్యాక్ వెర్షన్‌ 131.0.6778.204/.205, లైనక్స్​ 131.0.6778.204 కన్నా ముందు వెర్షన్లలో లోపాలు ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. దీనివల్ల సైబర్​ క్రిమినల్స్​ ఆయా కంప్యూటర్లను రిమోట్​గా యాక్సెస్​ చేయడం, మాల్వేర్​ ఎక్కించడం, చివరికి డినయల్ ఆఫ్​ సర్వీస్​- DoS వంటి అటాక్​లకు పాల్పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇలా జరగడం వల్ల ఎక్కువ రిస్క్​ ఉందని, వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేయడం, సిస్టమ్ కరప్షన్ వంటి అనేక తీవ్ర సమస్యలకు దారితీస్తుందని CERT-IN​ వివరించింది.

అసలు సమస్య ఏంటి?
డైనమిక్ వెబ్ కంటెంట్‌ను రన్ చేసే క్రోమ్​ బౌజర్​ వెర్షన్​-8లోని జావా స్క్రిప్ట్​ ఇంజిన్​లో బగ్స్​( ప్రోగ్రామ్ సోర్స్​ కోడ్​లో ఎర్రర్​ రావడం. ఇది కంప్యూటర్​ క్రాష్​ కావడం వంటి అనుహ్య పరిణామాలకు దారితీస్తుంది​) వల్ల సమస్యలు తలెత్తాయి. టైప్​ కన్ఫ్యూజన్, ఔట్​-ఆఫ్​-బౌండ్స్​ మెమొరీ యాక్సెస్, యూజ్​-ఆఫ్టర్​-ఫ్రీ వంటి బగ్స్​ వల్ల సమస్యలు వచ్చాయి. కంప్యూటర్​లో ఒక్కసారి ఇలాంటి బగ్స్​ వస్తే, సైబరాసురులు మీ డెస్క్​టాప్​ను వారి నియంత్రణలోకి తీసుకుంటారు. లేదా బ్రౌజర్ మొత్తం క్రాష్ అవుతుంది.

పట్టించుకోకపోతే జరిగే ప్రమాదం ఇదే!
ఈ సమస్యను పట్టించుకోకుండా వదిలేస్తే, యుజర్ల వ్యక్తిగత సమాచారం బహిర్గతం అవుతుంది. కంప్యూటర్​పై యూజర్లు నియంత్రణ కోల్పోతారు. వారి వ్యక్తిగత, వృత్తిపరమైన డేటా ప్రమాదంలో పడుతుంది. భారత్​లో చాలా మంది వినియోగదారుల క్రోమ్​ను డిఫాల్ట్​గా బ్రౌజర్‌గా ఉపయోగిస్తారు. ఈ హెచ్చరిక వ్యక్తిగత వినియోగదారులకు, సంస్థలకు చాలా ముఖ్యమైనది.

ముప్పు తప్పించుకోవాలంటే ఏం చేయాలి?
ఈ సమస్యను సులభంగా ఫిక్స్​ చేయొచ్చు. దీనికోసం క్రోమ్​ బ్రౌజర్​ను అప్డేట్​ చేస్తే సరిపోతుంది. బ్రౌజర్​ అప్డేట్​ ఇలా చేయండి.

  • గూగుల్​ క్రోమ్​ను ఓపెన్ చేయండి.
  • సెట్టింగ్స్​లోకి వెళ్లి Help​ ఆప్షన్​ సెలెక్ట్ చేసుకోండి.
  • అనంతరం About Google Chrome ఆప్షన్​ను సెలెక్ట్ చేయండి.
  • ఆ తర్వాత బ్రౌజర్​ ఆటోమెటిగ్​గా అప్డేట్ల కోసం సెర్చ్​ చేసి, ఇన్​స్టాల్​ చేస్తుంది.
  • ఆప్డేట్లు పనిచేయడానికి క్రోమ్​ను రీస్టార్ట్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.