ETV Bharat / state

'మా కలల ఇంటిని జప్తు చేస్తారేమో' - మహిళ ప్రాణం తీసిన హోమ్ లోన్ - WOMAN DIES FAIL TO PAY HOME LOAN

జనగామలో మహిళా ఆత్యహత్య - ఇంటి రుణం కట్టకపోవడంతో నోటీసులు అంటించిన ఫైనాన్స్ యాజమాన్యం - మనస్తాపం చెంది తనువు చాలించిన ఇల్లాలు

Woman Commits Suicide After Failing to Pay Home Loan in Jangaon
Woman Commits Suicide After Failing to Pay Home Loan in Jangaon (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 3, 2025, 1:55 PM IST

Updated : Jan 3, 2025, 2:50 PM IST

Woman Commits Suicide After Failing to Pay Home Loan in Jangaon : ఎక్కడ పని చేసినా అందరూ కోరుకునేది ఒక్కటే సొంత ఇళ్లు. కడుపు నిండ తిండి. అందరూ కష్టపడేది అందుకే. ఆ దంపతులూ అదే కోరుకున్నారు. సొంతిల్లు కట్టుకుని సంతోషంగా జీవించాలి అనుకున్నారు. పిల్లలకు ఏ లోటూ లేకుండా చూసుకోవాలని కలలు కన్నారు. ప్రైవేటు ఫైనాన్స్​ సంస్థలో లోన్​ తీసుకుని ఇల్లు కట్టుకున్నారు. మొదట్లో కిస్తీలు బాగానే కట్టినా, తర్వాత వారిని ఆర్థిక ఇబ్బందులు వెంటాడాయి. రుణం తీర్చడం లేదని సంస్థ నోటీసులు ఇవ్వడంతో ఇంత కష్టపడి కట్టుకున్న ఇల్లు పోతుందని మనస్తాపంతో మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన జమగామ జిల్లాలో చోటుచేసుకుంది.

Woman Commits Suicide After Failing to Pay Home Loan in Jangaon
ఎలేంద్ర (ETV Bharat)

ఆర్థిక సమస్యలు తలెత్తడంతో : ధర్మసాగర్​ ఎస్​ఐ జానీ పాషా తెలిపిన వివరాలు, మహిళ తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు, జనగామ జిల్లా ష్టేషన్​ ఘన్​పూర్​కు చెందిన అంగడి ఎలేంద్ర దుకాణాల వద్ద చీపురు కొడుతూ, భర్త ఉపేందర్​ ఓ మాంసం కొట్టులో పని చేసున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. ఎప్పటి నుంచో వీరు సొంతిళ్లు కట్టుకోవాలని అనుకున్నారు. అందుకు ఆరేళ్ల కిందట ఓ ప్రైవేట్ సంస్థ నుంచి రూ.15 లక్షలు లోన్​ తీసుకుని ఇల్లు కట్టుకున్నారు. కాగా ఇప్పటి వరకు రూ.3 లక్షల వరకు ఈఎంఐలు చెల్లించారు. తర్వాత ఆర్థిక ఇబ్బందులతో కిస్తీలు కట్టలేకపోయారు. వారు చెల్లించలేకపోయేసరికి ఫైనాన్స్​ సంస్థ వారు గురువారం ఇంటికి వచ్చి నోటీసులు అంటించారు.

భార్యాభర్తల ప్రాణం తీసిన రూ.200 - వారి ఆత్మహత్యకు అదే కారణమా?

ఎక్కడ ఇంటిని స్వాధీనం చేసుకుంటారోనని మనస్తాపం చెందిన ఎలేంద్ర, తన బాధను పంచుకునేందుకు హనుమకొండ జిల్లా ధర్మసాగర్​ మండలం ఎల్కుర్తిలోని తన పుట్టింటికి వచ్చారు. తల్లిదండ్రులు ఇంటికి తాళం వేసి పొలం పనులకు వెళ్లారు. ఇక బాధను తట్టుకోలేక పోయిన ఎలేంద్ర ఇంటి ముందున్న చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. పొలం నుంచి వచ్చిన తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. తండ్రి వెంకటయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఉద్యోగం పేరిట తండ్రి మోసం! - వేధింపులు భరించలేక పరిశోధక విద్యార్థిని సూసైడ్

ఒక్కగానొక్క కొడుకుపై ఎన్నో ఆశలు - హిజ్రా ఎంట్రీతో మారిన సీన్

Last Updated : Jan 3, 2025, 2:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.