ETV Bharat / entertainment

తగ్గని 'పుష్ప రాజ్' జోరు- తొలి ఇండియన్ సినిమాగా రికార్డ్ - PUSHPA 2 RECORDS

బాక్సాఫీస్ వద్ద పుష్ప రూలింగ్- ఖాతాలో మరో రికార్డ్

Pushpa 2
Pushpa 2 (Source : ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 5, 2025, 3:21 PM IST

Pushpa 2 Records : ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 'పుష్ప రూలింగ్' అస్సలు తగ్గట్లేదు. డిసెంబర్ 5న రిలీజైన ఈ సినిమా ఇప్పటికే అనేక రికార్డులు బద్దలుకొట్టింది. ముఖ్యంగా నార్త్​లో ఈ సినిమాకు ఫుల్ క్రేజ్ ఏర్పడింది. ఈ క్రమంలోనే పుష్ప 2 మరో అరుదైన రికార్డ్ సొంతం చేసుకుంది. ఇప్పటివరకు హిందీలో అత్యధిక నెట్ కలెక్షన్లు సాధించిన తొలి భారతీయ సినిమాగా రికార్డ్ సాధించింది.

పుష్ప 2 హిందీ వెర్షన్​ రూ.800 కోట్లు క్లబ్​లో చేరిపోయింది. 31 రోజుల్లోనే ఈ సినిమా రూ.806 కోట్ల నెట్ వసూల్ చేసినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. 'బ్రాండ్ పుష్ప రూ.800 కోట్ల క్లబ్​లో చేరిపోయింది. 31రోజుల్లోనే రూ.806 కోట్ల రికార్డ్ బ్రేకింగ్ నెట్ కలెక్షన్లు సాధించింది' అని పోస్టర్​ షేర్ చేశారు. ఇక ఓవరాల్​గా పుష్ప 2 వరల్డ్​వైడ్ కలెక్షన్లు రూ.1800 కోట్లు (గ్రాస్) దాటిపోయింది. మరో వారంలో 'బాహుబలి 2' (రూ.1810 కోట్లు) సినిమాను దాటేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

అందులోనూ రికార్డే
రిలీజ్​కు ముందు నుంచే ప్రముఖ టికెట్ బుకింగ్ యాప్ 'బుక్‌ మై షో'లో పుష్ప 2 బుకింగ్స్​లో దూసుకుపోతోంది. రోజుకు లక్షల్లోనే టికెట్లు బుక్ అవుతున్నాయి. వీకెండ్, హాలీడేస్​లో అయితే ఇంకా రెట్టింపు సంఖ్యలో బుకింగ్స్ ఉంటున్నాయి. ఈ క్రమంలోనే పుష్ప 2 మరో అరుదైన రికార్డ్‌ సాధించింది. 30 రోజుల్లో పుష్ప 2 సినిమా టికెట్ల అమ్మకాలు 20 మిలియన్ (20 కోట్లు) దాటాయని బుక్ మై షో అధికారికంగా ప్రకటించింది.

ఇక సినిమా విషయానికొస్తే, సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా డిసెంబర్ 5న రిలీజైంది. ఫుల్ మాస్ యాక్షన్ డ్రామాతో తెరకెక్కిన ఈ మూవీ భారీ విజయం దక్కించుకుంది. రష్మిక మంధన్నా హీరోయిన్​గా నటించగా, ఫహద్ ఫాజిల్, అనసూయ, సునీల్, జగపతి బాబు తదితరులు ఆయా పాత్రల్లో నటించారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా, మైత్రి మూవీ మేకర్స్​ బ్యానర్​పై రవి, నవీన్ సంయుక్తంగా నిర్మించారు.

'పుష్ప 2' కలెక్షన్ల సునామీ- 'బాహుబలి 2' రికార్డ్ బ్రేక్ అవ్వడం పక్కా!

'పుష్ప 2' కలెక్షన్ల సునామీ- 21 రోజుల్లోనే రూ.1700 కోట్లు వసూల్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.