ETV Bharat / offbeat

ఆలూ, అరటి చిప్సే కాదు - ఇలా "కాకరకాయ చిప్స్" ట్రై చేయండి! - చేదు తక్కువ, రుచి ఎక్కువ! - KAKARAKAYA CHIPS RECIPE

ఆలూ చిప్స్​ని మించిన టేస్ట్ - ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండిలా!

How to Make Kakarakaya Chips
Kakarakaya Chips Recipe (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 3, 2025, 1:33 PM IST

Kakarakaya Chips Recipe in Telugu : మనందరికీ చిప్స్ అనగానే బంగాళదుంపతో ప్రిపేర్ చేసుకునేవే ముందుగా గుర్తొస్తాయి. కరకరలాడుతూ ఉండే వీటిని పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టంగా తింటుంటారు. అయితే, ప్రతిసారీ ఒకేలా తినాలంటే ఎవరికైనా బోరింగ్​గా అనిపిస్తోంది. అందుకే ఈసారి కాస్త వెరైటీగా ఇలా "కాకరకాయ చిప్స్" ట్రై చేయండి. ఇవి కూడా చాలా రుచికరంగా ఉండి తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది. అంతేకాదు, కాకరకాయ అంటే నచ్చని వారూ ఇంకా ఇంకా కావాలని అడిగి మరీ తినేస్తారు. మరి, ఈ సూపర్ టేస్టీ చిప్స్ తయారీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :

  • కాకరకాయలు - 3
  • ఉప్పు - రుచికి సరిపడా
  • పసుపు - అరటీస్పూన్
  • మైదా - 1 టేబుల్​స్పూన్
  • బియ్యప్పిండి - 2 టేబుల్​స్పూన్లు
  • కార్న్​ఫ్లోర్ - 1 టేబుల్​స్పూన్
  • వెల్లుల్లి పేస్ట్ - 1 టీస్పూన్
  • ధనియాల పొడి - 1 టీస్పూన్
  • కారం - రుచికి తగినంత
  • ఆయిల్ - డీప్​ ఫ్రైకి సరిపడా

తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా కాకరకాయలను శుభ్రంగా కడిగి చాకు లేదా పీలర్ సహాయంతో వాటిపై ఉండే చెక్కును తొలగించుకోవాలి. ఆపై వాటిని మీకు నచ్చిన షేప్​లో సన్నని ముక్కలుగా కట్ చేసుకొని మధ్యలో గింజలను తీసేసుకోవాలి.
  • అనంతరం కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలన్నింటినీ ఒక బౌల్​లోకి తీసుకొని కాస్త ఉప్పు, పావు టీస్పూన్ పసుపు వేసి బాగా కలిపి పది నిమిషాల పాటు పక్కనుంచాలి.
  • 10 నిమిషాల తర్వాత అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకొని శుభ్రంగా కడిగి ఆపై ముక్కలన్నింటినీ చేతితో గట్టిగా పిండి మరో మిక్సింగ్ బౌల్​లో వేసుకోవాలి. ఇలా చేయడం ద్వారా కాకర ముక్కల్లోని చేదు చాలా వరకు తగ్గుతుంది.
  • ఆ తర్వాత అందులో మైదా, బియ్యప్పిండి, కార్న్​ఫ్లోర్, వెల్లుల్లి పేస్ట్, పావుటీస్పూన్ పసుపు, ధనియాల పొడి, ఉప్పు, కారం ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని ఇంగ్రీడియంట్స్ అన్నీ కాకర ముక్కలకు పట్టేలా బాగా కలుపుకోవాలి.
  • అలా మిక్స్ చేసుకునేటప్పుడు అవసరమనుకుంటే కొద్దికొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పకోడీ పిండి మాదిరిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు స్టౌపై కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె బాగా వేడయ్యాక కలిపి పెట్టుకున్న పిండిని తీసుకొని కాకరకాయ ముక్కలను ఒక్కొక్కటిగా నెమ్మదిగా వేసుకోవాలి. ఆపై మంటను మీడియం ఫ్లేమ్​లో ఉంచి ఎర్రగా, క్రిస్పీగా మారేంత వరకు వేయించుకోవాలి.
  • ఆవిధంగా వేయించుకున్నాక వాటిని పేపర్ నాప్​కిన్ వేసుకొన్న ప్లేట్​లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే చాలు. అంతే.. ఎంతో టేస్టీగా ఉండే కరకరలాడే "కాకరకాయ చిప్స్" రెడీ!

ఇవీ చదవండి :

ఈవెనింగ్ స్నాక్స్​గా "ఉల్లి వడలు" - ​ఇలా ప్రిపేర్ చేశారంటే పకోడిని మించిన టేస్ట్!

సూపర్​ స్నాక్​ రెసిపీ "కోడిగుడ్డు కజ్జికాయలు" - ఈ పద్ధతిలో చేస్తే ఒక్కటీ మిగలదు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.