ETV Bharat / spiritual

2025 రాశిఫలాలు - ఆ 5 రాశులవారికి ఉద్యోగం, వివాహం, ధనలాభం గ్యారెంటీ! - 2025 HOROSCOPE

కొత్త ఏడాదిలో 12 రాశుల వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే?

Horoscope
Horoscope (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 31, 2024, 4:45 AM IST

2025 Horoscope : ఈటీవీ భారత్‌ యూజర్లు అందరికీ ముందస్తుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఆంగ్ల నూతన సంవత్సరం 2025లో ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఈ కథనంలో తెలుసుకుందాం.

1. మేషరాశి : మేష రాశికి కుజుడు అధిపతిగా ఉంటాడు. 2025 నూతన సంవత్సరంలో మార్చి 25 నుంచి మీనంలో శని ప్రవేశిస్తాడు. దీనితో మేష రాశి వారికి ఏలినాటి శని ప్రారంభం కానుంది. శనిదేవుని అనుగ్రహంతో ఈ రాశి వారికి శుభ ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. ప్రేమికులకు పెద్దల ఆమోదంతో వివాహాలు జరుగుతాయి. ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆదాయం గణనీయంగా పెరిగినప్పటికీ ఖర్చులు కూడా పెరగవచ్చు. తెలివిగా పెట్టుబడి పెట్టాలి. ధన నష్టం జరగకుండా జాగ్రత్త పడాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాలి. కెరీర్ పరంగా సానుకూల ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులకు స్వస్థానప్రాప్తి, పదోన్నతులు ఉంటాయి. విద్యార్థులు చదువులో రాణిస్తారు. వ్యాపారులకు లాభాలు గణనీయంగా పెరుగుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి.

పాటించాల్సిన పరిహారాలు : ప్రతి శనివారం సుందరకాండ పారాయణం చేయాలి. శని స్తోత్రం, విష్ణు సహస్రనామం చదువుకోవాలి. శివాభిషేకం చేయించుకుంటే మంచిది.

2. వృషభరాశి : జ్యోతిష్యం ప్రకారం, వృషభ రాశికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు. రానున్న ఆంగ్ల నూతన సంవత్సరంలో వృషభ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కొత్త ఏడాదిలో వృషభ రాశి వారికి ఆర్థిక పరంగా అద్భుతమైన ఫలితాలు రానున్నాయి. గురువు అనుగ్రహం తో ఆర్థిక పరమైన విషయంలో కష్టానికి తగిన ఫలితాలు రానున్నాయి. కెరీర్ పరంగా అద్భుతమైన పురోగతి ఉంటుంది. రాహు-కేతువుల ప్రభావం వల్ల వ్యాపారంలో ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. పెట్టుబడులకు దూరంగా ఉండటం మంచిది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. అవివాహితులకు వివాహం అయ్యే అవకాశాలున్నాయి. ఆరోగ్యపరంగా మెరుగ్గా ఉంటుంది. శుభ గ్రహాలు అనుకూలతతో కొన్ని రాజయోగాలు కూడా ఏర్పడతాయి. విదేశాలకు వెళ్లే అవకాశం కూడా ఉంది. విద్యార్థులు బాగా రాణిస్తారు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది.

పాటించాల్సిన పరిహారాలు : నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయడం, రాహు, కేతు పూజలు జరిపించుకోవడం శ్రేయస్కరం. శివాభిషేకం ఉత్తమం.

3. మిథునరాశి : జ్యోతిష్యం ప్రకారం, మిథున రాశికి బుధుడు అధిపతి. మిథున రాశి వారికి ఆంగ్ల నూతన సంవత్సరంలో శనీశ్వరుని ప్రత్యేక అనుగ్రహం వల్ల అనేక ప్రయోజనాలు కలగనున్నాయి. అవివాహితులకు మంచి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. కుటుంబ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. విదేశాలకు వెళ్లే అవకాశాలు పొందవచ్చు. నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశాలున్నాయి. ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆర్థిక సమస్యలు లేనప్పటికీ ఆశించిన మేరకు ఆదాయం ఉండకపోవచ్చు. అదనపు ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. విద్యార్థులు తీవ్రమైన కృషితోనే విజయాలను పొందగలరు. విదేశీ వ్యాపారాలు చేసే వారికి శుభ ఫలితాలొస్తాయి. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. వృత్తి, వ్యాపారాలలో శక్తివంతంగా మారుతారు.

పాటించాల్సిన పరిహారాలు : దేవాలయ సందర్శన, గురువులకు సేవ చేయడం, రావి చెట్టుకు నీటిని సమర్పించడం చేస్తే శుభ ఫలితాలుంటాయి.

4. కర్కాటకం : జ్యోతిష్యం ప్రకారం, కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి. కర్కాటక రాశి వారికి ఆంగ్ల నూతన సంవత్సరంలో అనేక రంగాల్లో సానుకూల ఫలితాలు రానున్నాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆకస్మిక ధనలాభాలు ఉంటాయి. చేసే ప్రతి పనిలోనూ భారీ ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. శని దోషం విముక్తి కావడం వల్ల శారీరక, మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారు శుభవార్తలు వింటారు. ఉద్యోగులు ప్రమోషన్ పొందే అవకాశం ఉంది. వ్యాపారంలో శుభ ఫలితాలు ఉంటాయి. పెట్టిన పెట్టుబడులకు మంచి ప్రయోజనాలు పొందుతారు. లాభాలు గణనీయంగా పెరుగుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. విద్యార్థులకు మెరుగైన ఫలితాలు ఉంటాయి. విదేశాలలో చదువుతున్న విద్యార్థులు అద్భుత ఫలితాలను పొందుతారు. వైవాహిక జీవితంలో సమస్యలు ఉండవు. అవివాహితులకు వివాహం నిశ్చయమవుతుంది.

పాటించాల్సిన పరిహారాలు : రావిచెట్టు కింద దీపం పెట్టడం, శని స్తోత్రం పారాయణ చేయడం, శివాభిషేకం జరిపించుకోవడం ఉత్తమం.

5. సింహరాశి : జ్యోతిష్యం ప్రకారం, సింహ రాశికి సూర్యుడు అధిపతిగా ఉంటాడు. సింహరాశి వారికి ఆంగ్ల నూతన సంవత్సరంలో కొత్త అవకాశాలతో పాటు, సరికొత్త సవాళ్లు కూడా ఎదురుకానున్నాయి. కెరీర్ పరంగా ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఏడాది ప్రారంభంలో గురు గ్రహం దశమ స్థానంలో ఉండటం వల్ల ఉద్యోగులకు ప్రమోషన్ లభించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు రానున్నాయి. ముఖ్యంగా ఏడాది చివర్లో శుభ ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. కొత్త ఆదాయ వనరులను పొందుతారు. అనుకోని ధనలాభాలు ఉంటాయి. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మానుకోవాలి. వ్యాపార పరంగా మిశ్రమ ఫలితాలు రానున్నాయి. కొత్త ప్రయోగాలు చేసేందుకు సమయం అనుకూలంగా లేదు. సమాజంలో గౌరవం లభిస్తుంది. కుటుంబ జీవితంలో ప్రశాంత వాతావరణం ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి విజయం సాధిస్తారు.

పాటించాల్సిన పరిహారాలు : ఆదిత్య హృదయం పారాయణ చేయడం, సుబ్రహ్మణ్యస్వామి ఆలయ సందర్శనం, శివాభిషేకం, శ్రీలక్ష్మీదేవి ఆరాధన శుభప్రదం.

6. కన్యారాశి : జ్యోతిష్యం ప్రకారం, కన్య రాశికి బుధుడు అధిపతిగా ఉంటాడు. నూతన ఆంగ్ల సంవత్సరంలో కన్య రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కెరీర్ పరంగా విజయం సాధించే అవకాశం ఉంది. ప్రమోషన్ పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. వ్యాపారంలో పురోగతి లభిస్తుంది. నూతన ఆదాయ వనరులు ఏర్పడతాయి. పొదుపు ప్రణాళికలు అనుకూలిస్తాయి. నూతన గృహ, వాహన యోగాలున్నాయి. వైవాహిక జీవితంలో చిన్నపాటి మనస్పర్థలు ఏర్పడవచ్చు. గురు గ్రహ ప్రార్థనతో అవి కూడా తొలగిపోతాయి. విద్యార్థులు కష్టానికి తగిన ఫలితాలు సాధిస్తారు. కుటుంబంలో సంతోషం, శాంతి నెలకొంటాయి. ఆరోగ్యపరంగా సాధారణంగా ఉంటుంది. కానీ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరం.

పాటించాల్సిన పరిహారాలు : రాహు, కేతు పూజలు జరిపించుకోవడం, సంకష్ట గణపతి పూజ చేసుకోవడం, శివాభిషేకం జరిపించుకోవడం శ్రేయస్కరం.

7. తులారాశి : జ్యోతిష్యం ప్రకారం, తులా రాశికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు. నూతన ఆంగ్ల సంవత్సరంలో తులారాశి వారికి మెరుగైన ఫలితాలు రానున్నాయి. ఈ కాలంలో వీరికి కెరీర్ పరంగా అద్భుతంగా ఉంటుంది. శని శుభ స్థానంలో సంచారం చేయడం వల్ల పోటీ రంగాల్లో మంచి విజయం సాధిస్తారు. అదే విధంగా గురుడి ప్రభావంతో గొప్పవారితో పరిచయాలు పెరుగుతాయి. సామాజిక స్థితి పెరుగుతుంది. ముఖ్యమైన పనుల్లో జాప్యం జరిగినప్పటికీ దీర్ఘకాలిక విజయాలను పొందే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా కొన్ని సవాళ్లు ఉండవచ్చు. వ్యూహాత్మకంగా వ్యవహరించి అధిగమిస్తారు. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ జీవితంలో ఆనందం ఉంటుంది. అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉన్నందున ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.

పాటించాల్సిన పరిహారాలు : శనిధ్యానం, గురు ధ్యానం చేయడం, దక్షిణామూర్తి స్తోత్రం పారాయణం చేయడం, శివాభిషేకం ఉత్తమం.

8. వృశ్చిక రాశి : జ్యోతిష్యం ప్రకారం, వృశ్చిక రాశికి కుజుడు అధిపతి. నూతన ఆంగ్ల సంవత్సరంలో వృశ్చిక రాశి వారి జీవితంలో అనేక మార్పులు జరగనున్నాయి. నూతన సంవత్సరంలో మీరు చేసే ప్రయత్నాలన్నింట్లో విజయం సాధిస్తారు. కెరీర్ పరంగా కొన్ని సమస్యలు ఉన్నప్పటికినీ కృషితో సానుకూల ఫలితాలు ఉంటాయి. స్వయం కృషితో ఆర్థిక స్థితిని బలోపేతం చేసుకుంటారు. కొత్త ఆదాయ వనరులు కూడా పొందుతారు. విదేశాల నుంచి ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. కొత్త వ్యాపార ఒప్పందాలు చేసుకుంటారు. అవివాహితులకు మంచి వివాహ సంబంధాలు వచ్చే అవకాశం ఉంది. కుటుంబంలో సుఖ శాంతులు మెరుగ్గా ఉంటాయి. ఆరోగ్య పరంగా కొంత ఇబ్బందిగా ఉంటుంది. ప్రత్యేక శ్రద్ధ అవసరం.

పాటించాల్సిన పరిహారాలు : దక్షిణామూర్తి స్తోత్రం పారాయణ చేయడం, శనికి తైలాభిషేకం జరిపించుకోవడం, శివాభిషేకం, సూర్య ఆరాధన శ్రేయస్కరం.

9. ధనుస్సు రాశి : జ్యోతిష్యం ప్రకారం, ధనుస్సు రాశికి గురుడు అధిపతిగా ఉంటాడు. నూతన ఆంగ్ల సంవత్సరంలో ధనుస్సు రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కెరీర్ పరంగా ఒడిదొడుకులు ఉండే అవకాశం ఉంది. ఆర్థికపరంగా అనుకూలంగా ఉంటుంది. అనుకున్న దానికంటే అధికంగా ఖర్చులు పెరుగుతాయి. వృత్తి నిపుణులు నైపుణ్యాలు పెంచుకోకపోతే మనుగడ ఉండదు. వ్యాపారంలో పోటీ, ఒత్తిళ్లు అధికంగా ఉంటాయి. ఈ రాశి వారికి ఈ ఏడాది శత్రుపీడ ఉండే అవకాశం ఉంది. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు జాప్యం కావచ్చు. విద్యార్థులకు తీవ్రమైన కృషితోనే విజయం దక్కుతుంది. వైవాహిక జీవితంలో అనుకూలత ఉంటుంది. జీవిత భాగస్వామితో అనుబంధం దృఢ పడుతుంది. ఆరోగ్య పరంగా కొంత ఇబ్బందికర పరిస్థితి ఉండవచ్చు. తగినంత శ్రద్ధ అవసరం.

పాటించాల్సిన పరిహారాలు : నవగ్రహ ప్రదక్షిణలు చేయడం, ఆదిత్య హృదయం పారాయణం చేయడం, శివాభిషేకం జరిపించుకోవడం శ్రేయస్కరం.

10. మకర రాశి : జ్యోతిష్యం ప్రకారం, మకర రాశికి శని అధిపతిగా ఉంటాడు. నూతన ఆంగ్ల సంవత్సరంలో మకర రాశి వారికి అనుకూల ఫలితాలు ఉన్నాయి. ఏలినాటి శని ప్రభావం తొలగిపోవడం వల్ల వృత్తి పరంగా, వ్యక్తిగతంగా శుభ ఫలితాలు ఉంటాయి. కెరీర్ పరంగా సానుకూల ఫలితాలతో దూసుకెళ్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగులకు ప్రమోషన్లు, స్థాన చలనం ఉంటాయి. ఆర్థికంగా శుభ ఫలితాలు ఉంటాయి. ఆదాయం పదింతలు పెరుగుతుంది. పూర్వీకుల ఆస్తుల నుంచి ధనలాభం ఉంటుంది. రుణ సమస్యలు తీరుతాయి. పొదుపు చేసే మొత్తం పెరుగుతుంది. అవివాహితులకు కల్యాణ యోగం కలుగుతుంది. విద్యార్థులు చదువులో చక్కగా రాణిస్తారు. వ్యాపారంలో పెట్టుబడులు, లాభాల రూపంలో ధన ప్రవాహం ఉంటుంది. ఆకస్మిక ధనలాభాలు కూడా ఉండవచ్చు. ఆరోగ్యం బాగుంటుంది.

పాటించాల్సిన పరిహారాలు : శనికి తైలాభిషేకం చేయడం, శివాభిషేకం, గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం మంచిది.

11. కుంభరాశి : జ్యోతిష్యం ప్రకారం, కుంభ రాశికి శని అధిపతిగా ఉంటాడు. నూతన ఆంగ్ల సంవత్సరంలో కుంభ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఏలినాటి శని ప్రభావం చివరి దశలో ఉన్నందున ఈ రాశి వారికి వృత్తి వ్యాపారాలలో సాధారణ ఫలితాలు ఉంటాయి. కెరీర్ పరంగా శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో పదోన్నతులు ఉండవచ్చు. వ్యాపారపరంగా సానుకూల ఫలితాలు ఉంటాయి. పెట్టుబడుల మీద మంచి లాభాలు అందుకుంటారు. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. రుణభారం పెరగవచ్చు. అవసరానికి ధనసహాయం లభించడం వల్ల రుణభారం తగ్గుతుంది. నూతన గృహ నిర్మాణానికి అనువైన సమయం. విద్యార్థులు బుద్ధిబలంతో విజయం సాధిస్తారు. అవివాహితులకు కల్యాణం జరుగుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాలి.

పాటించాల్సిన పరిహారాలు : నవగ్రహ పీడాహరణ స్తోత్రం పఠించాలి. ఆర్థిక అనుకూలత కోసం కనకధారా స్తోత్రాన్ని పఠించాలి. విష్ణు సహస్రనామ పారాయణ, శివాభిషేకం ఉత్తమం.

12. మీనరాశి : జ్యోతిష్యం ప్రకారం, మీనరాశికి శని అధిపతిగా ఉంటాడు. నూతన ఆంగ్ల సంవత్సరంలో మీనరాశి వారికి సామాన్య ఫలితాలు ఉంటాయి. మీనరాశిలో 2025 మార్చి 25 నుంచి శని ప్రవేశించడం వల్ల ఈ రాశి వారికి ఏలినాటి శని ప్రభావం, జన్మ శని రాహువుల ప్రభావంతో పనిలో తీవ్ర ఆటంకాలు ఉంటాయి. అన్ని పనులు నత్త నడకన నడుస్తుంటాయి. కెరీర్ పరంగా ఆశించిన ఫలితాలు ఉండక పోవచ్చు. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలను ఇవ్వవు. ఉద్యోగులకు పదోన్నతులు ఆలస్యం కావచ్చు. పనిభారం కూడా పెరుగుతుంది. వ్యాపారంలో నష్ట భయం ఉంది. పెట్టుబడులు పెట్టే ముందు తెలివిగా వ్యవహరించాలి. ఆర్థికంగా మధ్యస్థం నుంచి చెడు ఫలితాలు ఉంటాయి. మీనరాశి వారు అప్పు చేయొద్దు, అప్పు ఇవ్వొద్దని సూచన. అనుకోని ఖర్చులు అధికంగా ఉంటాయి. విద్యార్థులకు మంచి సమయం. పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. అవివాహితులకు వివాహం ఆలస్యం కావచ్చు. వైవాహిక జీవితంలో మనస్పర్థలు చోటు చేసుకుంటాయి. ఆరోగ్యం క్షీణించే ప్రమాదముంది. ప్రత్యేక శ్రద్ధ అవసరం.

పాటించాల్సిన పరిహారాలు : శనికి తైలాభిషేకం, శివాభిషేకం చేయించుకోవాలి. గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం మంచిది. ఆంజనేయస్వామికి ఆకు పూజ చేయించుకుంటే మేలు జరుగుతుంది.

ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.