Shani Thrayodashi Importance :ఎంత కష్టపడ్డ మీరు అనుకున్న రంగంలో రాణించలేకపోతున్నారా? అయితే మీ కష్టానికి తోడు ఆ దేవుడి అనుగ్రహం కూడా ఉండాలని చెబుతుంటారు పెద్దలు, పండితులు. ఇందులో భాగంగానే మీ ఇష్టదైవారధనతో పాటే శనివారానికి అధిపతి అయిన ఆ శనిభగవానుడినీ పూజించాలి. ముఖ్యంగా శనిత్రయోదశి తిథి నాడు శనిదేవుడిని పూజిస్తే అద్భుతమైన ఫలితాలను పొందగలరని పురాణాలు స్పష్టం చేస్తున్నాయి. మరి మహాతిథికి సంబంధించి మరిన్ని విశేషాలు మీకోసం.
శనిత్రయోదశిని ఏ విధంగా నిర్ణయిస్తారు?
How Shani Trayodashi Date Decided : హిందూపంచాంగం ప్రకారం శనివారం త్రయోదశి తిథితో కలిసివస్తే దానిని శనిత్రయోదశిగా పరిగణిస్తారు. ఈ త్రయోదశి తిథి సూర్యోదయం సమయానికి తప్పకుండ ఉండాలి. ఈ ఏడాది మార్చి 23 శనివారం రోజున ఉదయం 7 గంటల 24 నిమిషాల వరకు త్రయోదశి తిథి ఉంది కాబట్టి ఆ రోజును శనిత్రయోదశిగా పంచాంగ కర్తలు నిర్ణయించారు.
త్రయోదశి తిథి ప్రాముఖ్యత!
Shani Thrayodashi Priority :దేవదానవులు చేసిన క్షీరసాగర మథనంలో ఉద్భవించిన హాలాహలాన్ని దిగమింగి తన కంఠంలో దాచుకున్నాడు శివుడు. ఈ విధంగా లోకాలను కాపాడిన ఆ నీలకంఠుడికి కృతఙ్ఞతలు తెలపడానికి దేవతలందరూ ఆయన వద్దకు వెళ్ళింది ఈ త్రయోదశి తిథి నాడేనని పురాణాలు చెబుతున్నాయి.
శనిత్రయోదశికి విశిష్టత!
Importance Of Shani Trayodashi Pooja :శనిత్రయోదశి రోజున శని దేవుడికి భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాలు చేసి శనిత్రయోదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా ఆర్థిక, ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
శని దేవుడు కష్టాలు ఇస్తాడా?
జ్యోతిష్య శాస్త్రరీత్యా శని శనివారానికి అధిపతి. ఏ వ్యక్తికైనా పూర్వజన్మ కర్మఫలితాలను కలుగచేసే అధికారం ఆ శని దేవుడికి ఉంది. అందుకే మనకు మంచి ఫలితాలు అయినా చెడు ఫలితాలు అయినా కలిగేది శని భగవానుని అనుగ్రహం వల్లే. నిజానికి శని పాపగ్రహం అంటారు. అయితే ఒక వ్యక్తిని అగ్నిపరీక్షలకు గురి చేసి దుర్మార్గం వైపు నుంచి సన్మార్గం వైపు నడిపించేది శని భగవానుడే. అందుకే శనిదేవుని ఆరాధనకు అంతటి విశిష్టత.