Mahashivratri 2024 : హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండగలలో మహాశివరాత్రి ఒకటి. ప్రతి సంవత్సరం మాఘ మాసం శుక్ల పక్షం చతుర్దశి తిథి రోజున మహాశివరాత్రిని జరుపుకుంటాం. ఈ ఏడాది మార్చి 8న మహా శివరాత్రి వస్తోంది. ఈ పర్వదినం పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైన రోజు. అందుకే శివ భక్తులు ఈ రోజు అత్యంత నియమ నిష్ఠలు, భక్తి శ్రద్ధలతో శివయ్యను పూజిస్తారు. ఉపవాసం ఉండి రాత్రంతా జాగరణ చేస్తారు. అయితే, శివరాత్రి(Mahashivratri)రోజు అన్ని నియమాలు పాటించడంతో పాటు.. మీ రాశికి అనుగుణంగా ఉన్న జ్యోతిర్లింగాన్ని పూజించినప్పుడే ఉత్తమ ఫలితాలు పొందవచ్చంటున్నారు జ్యోతిష్యశాస్త్ర నిపుణులు. అలాగే ఆ పరమేశ్వరుని అనుగ్రహం లభిస్తుందని చెబుతున్నారు. ఇంతకీ, మహాశివరాత్రి రోజు ఏ రాశి వారు ఏ జ్యోతిర్లింగాన్ని పూజించాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మేషం :ఈ రాశివారు రామేశ్వరం జ్యోతిర్లింగాన్ని పూజిస్తే మంచి ప్రయోజనాలు పొందవచ్చంటున్నారు జ్యోతిష్య పండితులు. మేషరాశిని అంగారకుడు పాలిస్తాడు. ఇది ధైర్యం, నిర్ణయాత్మకతకు ప్రసిద్ధి చెందిన రాశి. తమిళనాడులో ఉన్న రామేశ్వరం జ్యోతిర్లింగం స్వచ్ఛతను సూచిస్తుంది. ఈ రాశి వారు గ్రహపీడా నివారణార్థం రామేశ్వరంలో ఉన్న జ్యోతిర్లింగాన్ని దర్శించుకుంటే మంచిదని చెబుతున్నారు పండితులు.
వృషభం : ఈ రాశివారు పూజించాల్సిన లింగం.. మల్లికార్జున జ్యోతిర్లింగం. వృషభ రాశికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు. ఇది స్థిరత్వం, అందం, ప్రశంసలకు ప్రసిద్ధి చెందిన రాశి. ఈ గుణాలు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీశైలంలో వెలసిన మల్లికార్జున జ్యోతిర్లింగంలో ప్రతిబింబిస్తాయి. శివరాత్రి రోజు వృషభ రాశివారు ఈ జ్యోతిర్లింగాన్ని దర్శించుకుంటే మంచి ఫలితాలు పొందవచ్చంటున్నారు పండితులు.
మిథునం :ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగాన్ని మిథునరాశి వారు పూజించడం వల్ల ఉత్తమ ప్రయోజనాలు పొందవచ్చంటున్నారు పండితులు. ఈ రాశిని బుధుడు పరిపాలిస్తాడు. మధ్యప్రదేశ్‌లోని నర్మదా నది మధ్యలో హిందూ చిహ్నం 'ఓం' ఆకారం రూపంలో ఉన్న ద్వీపంలో ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం ఉంది.
కర్కాటకం : ఈ రాశివారు పూజించాల్సిన శివలింగం భీమశంకర్ జ్యోతిర్లింగం. కర్కాటకరాశిని చంద్రుడు పరిపాలిస్తాడు. ఇది భావాలను, అంతర్ దృష్టిని సూచిస్తుంది. మహారాష్ట్రలోని పుణెకు సమీపంలో ఉన్న భావగిరి గ్రామంలో భీమశంకర్ జ్యోతిర్లింగం ఉంది. నిత్యం ఈ జ్యోతిర్లింగం నుంచి నీరు ప్రవహిస్తూనే ఉంటుంది. శివరాత్రి రోజు ఈ రాశివారు ఈ జ్యోతిర్లింగాన్ని ఆరాధించడం వల్ల మంచి ప్రయోజనాలు పొందవచ్చంటున్నారు పండితులు.
సింహం :వీరు ఆరాధించాల్సిన జ్యోతిర్లింగం.. సోమనాథ్. సూర్యుడు సింహరాశికి అధిపతి. వీరు రాజ్యం, ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారు. సోమనాథ్ జ్యోతిర్లింగం గుజరాత్‌లో ఉంది. అలాగే ఈ రాశి దృఢత్వం, గొప్పతనానికి ప్రసిద్ధి చెందింది. ఇక శివరాత్రి రోజు ఈ రాశివారు ఈ శివలింగాన్ని దర్శించుకున్నా, ఆరాధించినా పుణ్య ఫలాలు పొందవచ్చని పండితులు చెబుతున్నారు.
కన్యారాశి : మహాకాళేశ్వర జ్యోతిర్లింగాన్ని ఈ రాశివారు పూజించడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయంటున్నారు. బుధుడు కన్యారాశిని కూడా పాలిస్తాడు. ఈ శివలింగం మధ్యప్రదేశ్‌లోని క్షిప్రా నది ఒడ్డున ఉన్న ఉజ్జయినిలో ఉంది. శివరాత్రి రోజు వీరు ఈ జ్యోతిర్లింగాన్ని పూజించినా, సందర్శించినా శివయ్య అనుగ్రహం పొందడంతోపాటు అంతా మంచి జరుగుతుందంటున్నారు పండితులు.
మహా శివరాత్రి రోజున జ్యోతిర్లింగాల దర్శనం ఎంతో పుణ్యం - ఎక్కడున్నాయి? - ఎలా వెళ్లాలి?