How to Attract Money as Per Astrology : భర్త సంపాదన రెట్టింపు కావాలంటే.. అలాగే ధనం ఎక్కువగా సంపాదించాలంటే మహిళలు కొన్ని ప్రత్యేకమైన పనులు చేయాలని ప్రముఖ జ్యోతిష్య పండితుడు 'మాచిరాజు కిరణ్ కుమార్'సూచిస్తున్నారు. ఈ పనులు చేస్తే భర్త ఆదాయం పెరిగి, ఇంట్లో ఎలాంటి ఆర్థిక సమస్యలూ తలెత్తవని చెబుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.
ఇలా చేయకండి..
- చాలా మంది మహిళలు.. భర్త ఉద్యోగం చేయడానికి లేదా వ్యాపారం పనిమీద ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన వెంటనే తలుపులు వేసేస్తుంటారు. కానీ, ఇలా వెంటనే తలుపులు వేసుకోకూడది. 5 నిమిషాల తర్వాత తలుపులు వేసుకుంటే మంచిది.
- అలాగే భర్త ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన వెంటనే ఇల్లు ఊడ్చకూడదు. తడివస్త్రంతో తుడవకూడదు.
- కొంతమంది మహిళలు భర్త బయటకు వెళ్లగానే స్నానం చేయడానికి వెళ్తుంటారు. కానీ.. వెంటనే స్నానానికి వెళ్లకుండా.. 5 నిమిషాలు ఆగి వెళ్లాలి.
- ఉతికిన బట్టలను మడతబెట్టేటప్పుడు తలకిందులుగా ఫోల్డ్ చేయకూడదు. బట్టలను తలకిందులుగా మడతబెడితే భర్తకు అదృష్టం కలసిరాదు.
ఈ మంత్రం జపించండి:
రోజూ స్నానం చేసిన తర్వాత కుంకుమ బొట్టు పెట్టుకునేటప్పుడు ఒక మంత్రం జపించండి. ఇలా చేస్తే భర్తకు అదృష్టం కలసివస్తుంది. బాగా డబ్బులు సంపాదిస్తాడు. ఆ మంత్రం..
"ఓం సర్వేస్వరీ సర్వ శక్తి స్వరూపిని..
మమ కుటుంబ రక్షామ్..
కురు కురు స్వాహాః.."
ఉదయాన్నే టీ పెట్టడానికి, టిఫెన్లు రెడీ చేయడానికి మహిళలు కిచెన్‌లోకి వెళ్తుంటారు. అయితే.. స్టౌ వెలిగించే ముందు"ఓం బ్రహ్మనే నమః" అనే మంత్రం జపించడం వల్ల భర్త సంపాదన పెరుగుతుంది.
- భర్తకు అదృష్టం కలసిరావాలంటే.. ఉదయం నిద్రలేవగానే మహిళలు వినాయకుడి ఫొటో చూసే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలి.
- 5 వారాల పాటు ప్రతీ శుక్రవారం అమ్మవారికి ఎండుద్రాక్ష నైవేద్యంగా సమర్పించాలి.
- వంటింట్లోని యాలకులు ఎండిపోయి ఉండకూడదట. యాలకులు ఆకుపచ్చ రంగులోనే ఉండాలి. ఆకుపచ్చ రంగులోని యాలకులకు ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంటుందని పరిహార శాస్త్రంలో చెప్పారు. కాబట్టి, కిచెన్‌లో యాలకులు ఆకు పచ్చవి ఉండేలా చూసుకోవాలి.
- శుక్రవారం రోజున పసుపు వస్త్రం తీసుకుని అందులో 5 యాలకులు వేయాలి. ఈ వస్త్రాన్ని మూటకట్టి బీరువాలో ధనం దాచుకునే చోట పెట్టాలి.
- పూజ మందిరంలోనూ 5 యాలకులు పెట్టవచ్చు.
- భర్త పర్స్‌లో 5 యాలకులు ఉంచాలి. ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది.
- శుక్రవారం రోజున పసుపు వస్త్రం తీసుకుని అందులో పచ్చకర్పూరం ఉంచండి. దానిని మూటకట్టి పూజ గదిలో పెట్టండి. రోజూ దానికి అగర్ బత్తీలు చూపిస్తూ ఉండండి. శుక్రవారం ధూపం వేయండి. ఇలా చేస్తే భర్త సంపాదన రెట్టింపవుతుంది.
- ఆకుపచ్చ లేదా ఎరుపు రంగు మట్టి గాజులు వేసుకోవాలి. ఆదివారం, శుక్ర వారాల్లో గాజులు కొనుక్కుంటే మంచి జరుగుతుంది. మంగళవారం, శనివారం గాజులు కొనుక్కుంటే భర్త సంపాదన తగ్గిపోతుంది.
- పూజ గదిలో దేవుడి ఫొటోలు దక్షిణం వైపు లేకుండా చూసుకోండి. మహిళలు ప్రత్యేకమైన ఈ పనులు చేయడం వల్ల భర్తకు అదృష్టం కలసి వస్తుందని, అనేక మార్గాల్లో ధనం వస్తుందని మాచిరాజు తెలిపారు.
Note : పైన తెలిపిన వివరాలు కొందరు జ్యోతిష్య నిపుణులు, శాస్త్రంలో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతేకానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
ఇవి కూడా చదవండి :
'ఈ 3 వస్తువులు కలిపి చీమలకు పెట్టండి - మీ డబ్బు రెట్టింపు అవ్వడం ఖాయం!'
"అదృష్టలక్ష్మి మీ తలుపు తట్టాలంటే - సోమవారం ఈ పనులు అస్సలు చేయకూడదట"