తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

ఆ రాశి వారు నేడు కోపాన్ని కంట్రోల్ చేసుకోవాల్సిందే- లేకుంటే సమస్యలు తప్పవ్! - DAILY HOROSCOPE

2025 జనవరి​ 4వ తేదీ (శనివారం) రాశిఫలాలు

Daily Horoscope
Daily Horoscope (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jan 4, 2025, 4:49 AM IST

Horoscope Today January 4th 2025 : 2025 జనవరి​ 4వ తేదీ (శనివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

మేషం (Aries) :మేషరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలలో శుభ ఫలితాలు ఉంటాయి. కుటుంబంతో చేసే ప్రయాణాలు హాయిగా, ఆహ్లాదంగా ఉంటాయి. వృత్తిరీత్యా ఎటువంటి ఆందోళనలు ఉండవు. పని భారం పెరగకుండా జాగ్రత్త పడండి. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆచరణాత్మకంగా ఉండండి. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. శివారాధన శుభకరం.

వృషభం (Taurus) :వృషభరాశి వారికి ఈ రోజు సరదాగా గడిచిపోతుంది. తీరికలేని పనుల నుంచి విరామం తీసుకొని సరదాగా విహార యాత్రకు వెళ్తారు. విందు వినోదాలలో పాల్గొంటారు. ఓ శుభవార్త మీ సంతోషాన్ని రెట్టింపు చేస్తుంది. ఉద్యోగంలో స్థానచలనం ఉండవచ్చు. ప్రమోషన్ ఛాన్స్ కూడా ఉంది. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

మిథునం (Gemini) :మిథునరాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. అనారోగ్య సమస్యలు పనులకు అవరోధంగా మారుతాయి. అన్ని రంగాల వారికి పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. సంతానం ప్రవర్తన ఆందోళన కలిగిస్తుంది. ఆర్థిక సమస్యలు వల్ల ముఖ్యమైన పనులు ఆలస్యం కావచ్చు. నవగ్రహ శ్లోకాలు పఠించడం ఉత్తమం.

కర్కాటకం (Cancer) :కర్కాటకరాశి వారికి ఈ రోజంతా అంత అనుకూలం కాదు. గ్రహసంచారం అనుకూలంగా లేనందున చేసే పనుల్లో దురదృష్టం, జాప్యం ఉండవచ్చు. కొత్త వ్యవహారాలు మొదలు పెట్టవద్దు. ఇబ్బందులు వస్తాయి. కోపాన్ని తగ్గించుకొని శాంతం వహించండి. అనైతికమైన ఆలోచనలకు, పనులకు దూరంగా ఉండండి. కుటుంబ సభ్యులతో ఘర్షణలు మానుకోండి. కార్యసిద్ధి హనుమ ఆరాధనతో మెరుగైన ఫలితాలు ఉండవచ్చు.

సింహం (Leo) :సింహరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని పనులు విజయవంతంగా ముందుకు సాగడం వల్ల సంతోషంగా ఉంటారు. ఒత్తిడిని అధిగమిస్తే కార్యజయం ఉంటుంది. స్నేహితులు, బంధువులతో సరదాగా గడుపుతారు. విందు వినోదాలలో పాల్గొంటారు. వ్యాపారంలో భాగస్వాములతో కీలక ఒప్పందాలు చేసుకుంటారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ శుభప్రదం.

కన్య (Virgo) :కన్యారాశి వారికి ఈ రోజు చాలా అనుకూలమైన రోజు. ఇంట్లో శాంతి, సమన్వయ ధోరణి ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరగడం వల్ల రోజంతా ఆనందంగా, హుషారుగా ఉంటారు. మీకు నచ్చిన కెరీర్​లో ముందుకెళ్తారు. ఆర్థిక లాభం, పరపతి ఊపందుకుంటాయి. సహోద్యోగుల సహకారం, ఉన్నతాధికారుల మద్దతు అందుకుంటారు. ఊహించని శుభవార్తలు ఉంటాయి. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

తుల (Libra) :తులారాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఇంటా బయట వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది. ఏదైనా మాట్లాడేటప్పుడు ఒకటికి, రెండుసార్లు ఆలోచించి మాట్లాడండి. మీ మాటతీరు కారణంగా ఊహించని పరిస్థితులు ఏర్పడవచ్చు. ఈ రోజు గ్రహ సంచారం అనుకూలంగా లేదు. అందుకే నూతన పనులను ప్రారంభించకండి. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ప్రసన్న ఆంజనేయస్వామి దర్శనం శుభకరం.

వృశ్చికం (Scorpio) :వృశ్చికరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి పరంగా శుభ సమయం నడుస్తోంది. తలపెట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. నూతన ఆర్థిక వనరులను ఏర్పాటు చేసుకోవడానికి ఇది మంచి సమయం. ఈ రోజంతా మేథోపరమైన, సామాజిక చర్చల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో విందు వినోదాలలో పాల్గొని ఆనందంగా గడుపుతారు. శుభ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే ఉన్నత స్థానానికి ఎదుగుతారు. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ శుభకరం.

ధనుస్సు (Sagittarius) :ధనుస్సురాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఈ రోజు ఈ రాశి వారికి ఆరోగ్యం క్షీణించే అవకాశం వుంది. అందుకే ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. వృత్తి వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు రావడానికి మరికొంత సమయం పట్టవచ్చు. సహనంతో ఉంటే మంచిది. ప్రయాణాలను వాయిదా వేసుకోండి. వివాదాలకు దూరంగా ఉంటే మంచిది. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు. ఆదిత్య హృదయం పారాయణతో ప్రతికూలతలు తొలగిపోతాయి.

మకరం (Capricorn) :మకరరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగులకు, వ్యాపారస్థులకు ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. అన్ని పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆదాయం ఆశించిన మేరకు ఉంటుంది. పదోన్నతులు పొందే అవకాశం ఉంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. సన్నిహితులతో తీర్థయాత్రలకు వెళ్తారు. ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. దుర్గాదేవి ఆరాధన శుభప్రదం.

కుంభం (Aquarius) :కుంభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి పరంగా ముఖ్యమైన చర్చలలో పాల్గొంటారు. మీ వాక్చాతుర్యంతో అందరినీ మెప్పిస్తారు. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ఆర్థికంగా ఉన్నత స్థానానికి చేరుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. తీర్థయాత్రలకు ప్రణాళికలు వేస్తారు. కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి. శ్రీలక్ష్మీదేవి ధ్యానం శుభకరం.

మీనం (Pisces) :మీనరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. పరోపకారంపై దృష్టి సారిస్తే దేవుని ఆశీస్సులు అందుతాయి. వృత్తి పరంగా ఎదగడానికి కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. కొత్త ప్రాజెక్టులు చేపట్టవద్దు. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే ఎలాంటి వివాదాలు ఉండవు. ముఖ్యమైన పనులు, ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. అభయ ఆంజనేయస్వామి ఆలయ సందర్శనతో మెరుగైన ఫలితాలు ఉంటాయి.

ABOUT THE AUTHOR

...view details