Horoscope Today January 10th 2025 : 2025 జనవరి 10వ తేదీ (శుక్రవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?
మేషం (Aries) :మేష రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి పరంగా, వ్యక్తిగతంగా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. కుటుంబ సభ్యుల అవసరాలు, కోరికలకు ప్రాధాన్యం ఇవ్వాలి. కోపం అదుపులో పెట్టుకొని జాగ్రత్తగా మాట్లాడితే మంచిది. అనవసర వాదనల్లోకి దిగి అపవాదుల్ని మీదకు తెచ్చుకోకండి. మొండి పట్టుదలకు పోకుండా రాజీధోరణి అవలంబిస్తే మంచిది. వృథా ఖర్చులు తగ్గిస్తే మంచిది. అనారోగ్య సమస్యలు ఉండవచ్చు. ఆదిత్య హృదయం పారాయణ మేలు చేస్తుంది.
వృషభం (Taurus) :వృషభ రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. అదృష్ట యోగం ఉంది. ఆర్థికంగా అభివృద్ధి, ధన లాభం ఉండవచ్చు. అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి కావడం వల్ల సంతోషంగా ఉంటారు. సన్నిహితులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ శుభకరం.
మిథునం (Gemini) :మిథునరాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇంటా బయటా సమయానుకూలంగా నడుచుకోకపోతే ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. కోపం అదుపులో ఉంచుకోవాలి. కుటుంబ సభ్యుల మధ్య అపార్థాలు, వివాదాలు తీవ్రమవుతాయి. మానసిక ఒత్తిడితో ఆరోగ్య సంబంధమైన సమస్యలు ఏర్పడే అవకాశముంది. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు. నవగ్రహ ప్రార్ధన మేలు చేస్తుంది.
కర్కాటకం (Cancer) :కర్కాటక రాశి వారికి ఈ రోజు ఫలప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారులకు విశేషంగా యోగిస్తుంది. ఆదాయంలో గణనీయమైన వృద్ధి ఉంటుంది. కొత్తగా పెట్టుబడులు ఏర్పాటు చేసుకోడానికి ఈ రోజు అనుకూలంగా ఉంది. సన్నిహితులతో విహారయాత్రలకు వెళ్లారు. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇష్ట దేవతారాధన శుభకరం.
సింహం (Leo) :సింహ రాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో విజయం సిద్ధిస్తుంది. ఆత్మవిశ్వాసం, దృఢ నిశ్చయం మీ జీవితంలో అద్భుతాలు చేస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్ ఉండవచ్చు. ఆస్తి వ్యవహారాలు అనుకూలిస్తాయి. మనోబలంతో పనిచేసి మంచి గుర్తింపు పొందుతారు. ముఖ్యమైన పనులు ఈ రోజు ప్రారంభిస్తే విజయవంతం అవుతాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ శుభకరం.
కన్య (Virgo) :కన్యా రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. దైవబలంతో ప్రతికూల పరిస్థితుల నుంచి బయటపడతారు. ఆర్ధిక పరిస్థితి మెరుగవుతుంది. ధ్యానం, ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. స్నేహితులతో సరదాగా గడుపుతారు. విదేశీ మిత్రుల నుంచి శుభసమాచారం అందుకుంటారు. ఆరోగ్యం సహకరిస్తుంది. విష్ణువు ఆలయ సందర్శన శుభకరం.
తుల (Libra) :తులా రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీ ప్రవర్తన కారణంగా బంధు మిత్రులతో విరోధం ఏర్పడుతుంది. కోపావేశాలపై అదుపు లేకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. కోపం వల్ల ఏ సమస్యలూ తీరవు. మాట్లాడేది జాగ్రత్తగా మాట్లాడాలి. ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తే సమస్యలతో పోరాడే శక్తి లభిస్తుంది. ఖర్చులు పెరగవచ్చు. ప్రసన్న ఆంజనేయ స్వామి దర్శనం మేలు చేస్తుంది.
వృశ్చికం (Scorpio) :వృశ్చిక రాశి వారికి ఈ రోజు సరదాగా గడిచిపోతుంది. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి కావడం వల్ల సంతోషంగా ఉంటారు. స్నేహితులతో విహారయాత్రలతో, విందు వినోదాలతో గడుపుతారు. సామాజిక సేవా కార్యక్రమాలతో మంచి గుర్తింపు సాధిస్తారు. కుటుంబ శ్రేయస్సు కోసం పనిచేయడం ఆనందాన్ని ఇస్తుంది. ఆర్ధిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఇష్ట దేవతారాధన శుభకరం.
ధనుస్సు (Sagittarius) :ధనుస్సు రాశి వారికి ఈ రోజు అద్భుతం గా ఉంటుంది. ఆరోగ్యం, సంపద, సంతోషం, అదృష్టం ఇలా అన్నీ ఒకేరోజు అందుకుంటారు. ఇంటి వాతావరణంలో సమన్వయ ధోరణి ఉండడంతో ప్రశాంతంగా ఉంటారు. ఉద్యోగంలో చురుగ్గా వ్యవహరిస్తారు. సహోద్యోగులు నుంచి అవసరమైన సహకారం ఉంటుంది. వ్యాపారంలో ఊహించని లాభాలుంటాయి. విష్ణువు ధ్యానం శుభకరం.
మకరం (Capricorn) :మకర రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. గతం తాలూకు చెడు ప్రభావాలు ఇంకా తొలగిపోలేదు. వృత్తి వ్యాపారాలలో తీరికలేని పనులతో తలమునకలై ఉంటారు. కొందరి ప్రవర్తన బాధిస్తుంది. ఇది మీ నిర్ణయం తీసుకునే శక్తిని బలహీనపరుస్తుంది. వ్యాపారంలో నష్టాలు రాకుండా జాగ్రత్తపడాలి. ఖర్చులు పెరగకుండా చూసుకోండి. కార్యసిద్ధి హనుమ ఆరాధన మేలు చేస్తుంది.
కుంభం (Aquarius) :కుంభ రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. భావోద్వేగాలను అదుపు చేయడంలో విఫలమవుతారు. కుటుంబ కలహాలతో మానసిక ప్రశాంతత లోపిస్తుంది. చేసే పనిలో స్పష్టత లేనందువల్ల పనుల్లో తీవ్ర జాప్యం జరగవచ్చు. విద్యార్ధులు చదువులో రాణిస్తారు. ఆర్ధిక సమస్యలు ఏర్పడకుండా ఖర్చులు అదుపులో ఉంచుకోండి. శని స్తోత్రం పఠిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి.
మీనం (Pisces) :మీన రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో సమిష్టి నిర్ణయాలు తీసుకోవడానికి మంచిరోజు. సానుకూల ఆలోచనలతో సంతోషంగా ఉంటారు. ఆత్మవిశ్వాసంతో లక్ష్యాలను సాధిస్తారు. ఉన్నతాధికారుల ప్రసంశలు అందుకుంటారు. ఉద్యోగంలో స్వస్థానప్రాప్తి ఉంటుంది. ఆదాయం ఆశించిన మేరకు ఉంటుంది. ఇష్ట దేవతారాధన శుభకరం.