ETV Bharat / state

అవి డీప్ ఫేక్ వీడియోలు, వాటిని నమ్మి మోసపోకండి - ఎస్​బీఐ వార్నింగ్ - SBI BANK ALERT TO CUSTOMERS

సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వివిధ స్కీమ్స్‌ వీడియోలపై స్పందించిన ఎస్‌బీఐ - ఎప్పుడూ ఇలాంటి ప్రకటనలను జారీ చేయదని స్పష్టం చేసిన బ్యాంక్

BEWARE OF DEEPFAKE VIDEOS
STATE BANK OF INDIA ALERT (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : 3 hours ago

SBI Bank Alert on Deepfake Videos : ఎస్‌బీఐ (భారతీయ స్టేట్​ బ్యాంక్)పేరిట సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రకటనలపై తాజాగా ఆ బ్యాంకు స్పందించింది. అవి డీప్‌ఫేక్ వీడియోలని, అలాంటి ఫేక్ వీడియోలను నమ్మి ఎవరూ మోసపోవద్దని తమ ఖాతాదారులకు, ప్రజలకు సూచించింది. ఎస్‌బీఐ ఎప్పుడూ ఇలాంటి ప్రకటనలు చేయదని బ్యాంకు వర్గాలు స్పష్టం చేశాయి. ఈ మేరకు ఎస్‌బీఐ ఓ ప్రకటన విడుదల చేసింది.

BEWARE OF DEEPFAKE VIDEOS
STATE BANK OF INDIA LETTER (ETV Bharat)

సోషల్‌ మీడియాలో ఫేక్‌ ప్రకటనలేంటి? : ఎస్‌బీఐకి చెందిన ఉన్నతాధికారుల పేర్లతో ఇన్వెస్ట్​మెంట్ స్కీమ్ ప్రకటనలను జారీ చేసినట్లు ఎస్బీఐ గుర్తించింది. ఈ డీప్​ ఫేక్​ వీడియోలపై బ్యాంకు వినియోగదారులను ముందు జాగ్రత్తగా అప్రమత్తం చేసింది. పెద్ద ఎత్తున లాభాలు వస్తాయంటూ ఎస్‌బీఐ మేనేజ్​మెంట్​ వెల్లడించినట్లు సోషల్​ మీడియాలో వస్తున్న వీడియోలన్నీ ఫేక్​ అని స్పష్టం చేసింది. ఎస్‌బీఐ ఎప్పుడూ ఇలాంటి ప్రకటనలను చేయదని బ్యాంకు అధికారిక వర్గాలు స్పష్టం చేశాయి. ఇలాంటి వాటిని చూసి వినియోగదారులు మోసపోవద్దని తెలిపింది.

ఎస్‌బీఐ ​​ అని చెప్పుకుంటూ వివిధ స్కీమ్స్‌ అని కొందరు డీప్​ వీడియోల ద్వారా ప్రచారం చేస్తున్నారు. వాళ్లు ప్రకటించిన స్కీములకు సంబంధించి బ్యాంకుతో గానీ, అధికారులతో గానీ ఎలాంటి సంబంధం​ లేదు. వివిధ బ్యాంకు పథకాల్లో ఇన్వెస్ట్‌మెంట్‌ పెట్టడంటూ కొంత మంది నేరగాళ్లు చేస్తున్న ప్రచారాన్ని నమ్మవద్దు. ఇలాంటి ఫేక్​ వీడియోలలో ఎక్కువ రాబడి వస్తుందంటూ ఎస్‌బీఐ ఎప్పుడూ ఎవరికీ హామీ ఇవ్వదు. ఇలాంటి ప్రకటనలను నమ్మి మోసపోకుండా ఎస్‌బీఐ వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలి. -భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా

తక్కువ మొత్తంతో ఎక్కువ లాభం- 'SBI లఖ్​పతి' స్కీమ్​తో లక్షాధికారి అవ్వడం గ్యారెంటీ- నెలకు ఎంత కట్టాలంటే?

నమ్మకమైన ఖాతాదారుడి పేరుతో వాట్సాప్​లో చెక్కు - అడ్డంగా దొరికిపోయిన SBI బ్యాంక్ మేనేజర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.