BJP Announces Three Candidates For MLC Elections : తెలంగాణలో త్వరలో జరగునున్న ఎమ్మల్సీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీకి అభ్యర్థులను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శుక్రవారం ప్రకటించారు.
నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి అభ్యర్థిగా సరోత్తమ్ రెడ్డి, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మల్క కొమరయ్య, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా సి.అంజిరెడ్డిని ఎంపిక చేసినట్లు ఓ ప్రకటనలో తెలిపారు.
![BJP Announces Three Candidates For MLC Elections](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10-01-2025/23297396_2.jpeg)
![BJP Announces Three Candidates For MLC Elections](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10-01-2025/23297396_132.jpeg)
![BJP Announces Three Candidates For MLC Elections](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10-01-2025/23297396_1.jpeg)