ETV Bharat / spiritual

వ్రత కథతో వైకుంఠ ఏకాదశి వ్రతం సంపూర్ణం- ఈ నియమాలతో ఉపవాసం ఉంటే స్వర్గప్రాప్తి! - PUTRADA EKADASHI VRAT KATHA

వ్రత కథను చదవకుంటే వ్రతం అసంపూర్ణం! - వైకుంఠ ఏకాదశి రోజు ఇలా ఉపవాసం వైకుంఠవాసం ఖాయం!

Vaikuntha Ekadashi 2025 Vrat Katha
Vaikuntha Ekadashi 2025 Vrat Katha (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : 7 hours ago

Vaikuntha Ekadashi 2025 Vrat Katha : వైకుంఠ ఏకాదశి అనే పేరులో వైకుంఠ, ఏకాదశి అని రెండు పదాలున్నాయి. వైకుంఠ శబ్దం ఆకారాంత పుంలింగం. ఇది విష్ణువునూ, విష్ణువుండే స్థానాన్ని కూడా సూచిస్తుంది. చాక్షుస మన్వంతరంలో వికుంఠ అనే ఆమె నుంచి అవతరించినందున విష్ణువు వైకుంఠుడు అయ్యాడు.

ముక్కోటి అని ఇందుకే అంటారు
ఈ రోజు మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందంటారు. ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సరి సమానమైన పవిత్రతను కలిగి ఉంటుంది కాబట్టి దీన్ని ముక్కోటి ఏకాదశి అనీ కూడా అంటారు.

వైకుంఠ ఏకాదశి వ్రత కథ
పద్మ పురాణం ప్రకారం ముర అనే రాక్షసుడి దురాగతాలు భరించలేక దేవతలు విష్ణువు శరణువేడగా ఆయన వాడితో తలపడి వాడిని సంహరించేందుకు ప్రత్యేక అస్త్రం కావాలని గ్రహించి బదరికాశ్రమంలో హైమావతి గుహలోకి ప్రవేశించాడు. అక్కడ విశ్రమిస్తున్న విష్ణువును ముర సంహరించేందుకు ప్రయత్నించగా ఆయన నుంచి ఒక శక్తి ఉద్భవించి తన కంటి చూపుతో మురను కాల్చి వేసింది. అప్పుడు విష్ణువు సంతసించి ఆమెకు ఏకాదశి అని పేరు పెట్టి వరం కోరుకోమని చెప్పాడు. ముక్కోటి ఏకాదశి రోజున ఉపవాసం ఉన్న వారి పాపాలను పరిహరించాలని ఆమె కోరింది.

ఇందుకే ఉపవాసం ఉండాలి
ధనుర్మాస శుక్ల ఏకాదశి రోజున ఉపవాసం ఉన్న వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని విష్ణువు వరమిచ్చాడు. వైకుంఠ ఏకాదశి రోజు ముర బియ్యంలో దాక్కుంటాడని , అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థం తినకుండా ఉండాలని అంటారు. ఈ రోజున ఉపవాసం ఉంటే మిగతా 23 ఏకాదశులు ఉపవాసం ఉన్నట్టే అని విష్ణుపురాణం చెబుతోంది. ముర అంటే తామసిక, రాజసిక గుణాలకు , అరిషడ్వర్గాలకు ప్రతీక. వీటిని ఉపవాస జాగరణల ద్వారా జయిస్తే సత్వ గుణం లభించి తద్వారా ముక్తికి మార్గం ఏర్పడుతుంది. వరి అన్నంలో ముర నివాసం ఉంటాడు కనుక ఏకాదశి రోజు ఉపవాసం ఉండి , ద్వాదశినాడు అన్నదానం చేయడం ద్వారా ఏకాదశి వ్రత ఫలం సంపూర్ణంగా దక్కుతుంది.

వైకుంఠ ఏకాదశి రోజున భక్తిశ్రద్ధలతో వ్రతమాచరించే వారికి మరో జన్మంటూ ఉండదని పురాణాలు చెబుతున్నాయి. అలాగే ముక్కోటి ఏకాదశిన మరణించేవారికి వైకుంఠవాసం సిద్ధిస్తుందని, స్వర్గంలోని తలుపులు వారి కోసం తెరిచే ఉంటాయని శాస్త్రాలు పేర్కొంటున్నాయి.

ముక్కోటి ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన వారు ఈ వ్రత కథను కూడా చదువుకుంటే ఏకాదశి వ్రత ఫలం లభిస్తుంది.

జై శ్రీమన్నారాయణ!

ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.