తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

ఆ రాశివారు ముఖ్యమైన పనులు వాయిదా వేస్తే మంచిది! శివాష్టకం పఠించడం ఉత్తమం! - HOROSCOPE TODAY FEBRUARY 13TH 2025

2025 ఫిబ్రవరి 13వ తేదీ (గురువారం) రాశిఫలాలు

Horoscope Today February 13th 2025
Horoscope Today February 13th 2025 (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Feb 13, 2025, 5:01 AM IST

Horoscope Today February 13th 2025 : 2025 ఫిబ్రవరి 13వ తేదీ (గురువారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

మేషం (Aries) :మేషరాశి వారికి ఈ రోజు సాధారణంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో జాప్యం ఉండవచ్చు. సమయపాలన ముఖ్యం. తొందరపడి పనులు చేయకుండా ప్రశాంతంగా ఉండండి. చిన్నపాటి అనారోగ్యం ఇబ్బంది కలిగిస్తుంది. రుణభారం పెరగవచ్చు. ఖర్చులు అదుపులో ఉంచుకుంటే మంచిది. ప్రయాణాన్ని వాయిదా వేయండి. ఆదిత్య హృదయం పారాయణ శుభప్రదం.

వృషభం (Taurus) :వృషభరాశి వారికి ఈ రోజు అత్యంత ఫలదాయకమైన రోజు. అన్ని రంగాల వారికి చేపట్టిన పనులలో మంచి పురోగతి ఉంటుంది. మీ కార్యదీక్ష, పట్టుదలతో అందరికి ఆదర్శంగా నిలుస్తారు. మీరు సమావేశాలు నిర్వహించే విధానం ఇతరులను ఆకట్టుకొని వారిలో స్ఫూర్తి నింపి ప్రోత్సహిస్తాయి. ఆర్థికంగా శుభ ఫలితాలు ఉంటాయి. ఇష్ట దేవతారాధన శుభకరం.

మిథునం (Gemini) :మిథునరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో కొత్త ప్రాజెక్టులు మొదలు పెడతారు. ప్రభుత్వ వ్యవహారాల్లో లాభాలు పొందుతారు. ఏ పని చేపట్టినా విజయం మీదే! ఉన్నతాధికారుల ప్రసంశలు అందుకుంటారు. సన్నిహితుల మధ్య అపార్థాలు, ఇరుగుపొరుగువారితో గొడవలు రాకుండా చూసుకోండి. ఆర్థిక సంబంధమైన లావా దేవీలు జాగ్రత్తగా చెయ్యాలి. కార్యసిద్ధి హనుమ ఆరాధన శ్రేయస్కరం.

కర్కాటకం (Cancer) :కర్కాటకరాశి వారికి ఈ రోజు సాధారణంగా ఉంటుంది. శ్రమకు తగిన ఫలితాలు ఉండకపోవచ్చు. మానసిక ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉంటాయి. ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉంటే మంచిది. కుటుంబ సభ్యులతో గొడవలు తారా స్థాయికి చేరుకుంటాయి. ఆదాయాన్ని మించిన ఖర్చులుంటాయి. అనారోగ్యం కారణంగా ఏ పనిపై ఆసక్తి ఉండదు. నవగ్రహ శ్లోకాలు పఠించడం ఉత్తమం.

సింహం (Leo) :సింహరాశి వారికి ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది. పిత్రార్జితం కలిసి వస్తుంది. సమాజంలో పరపతి పెరుగుతుంది. ఓ శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం అవసరం. స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

కన్య (Virgo) :కన్యారాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆత్మ విశ్వాసంతో వేసే ప్రతీ అడుగు విజయాన్ని చేకూరుస్తుంది. అహంకారం, గర్వం లేకుండా చూసుకోండి. కుటుంబ కలహాలతో మనశ్శాంతి దెబ్బ తింటుంది. ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. యోగా ధ్యానం చేస్తే ప్రశాంతత కలుగుతుంది. వృథా ఖర్చులు నివారిస్తే మంచిది. శివారాధన శ్రేయస్కరం.

తుల (Libra) :తులారాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కుటుంబ సౌఖ్యం, కార్యసిద్ధి ఉంటాయి. ఉన్నతాధికారుల ప్రసంశలు అందుకుంటారు. వృథా ఖర్చులు నివారిస్తే మంచిది. కుటుంబ సభ్యుల సహకారంతో ఓ కీలకమైన పనిలో విజయం సాధిస్తారు. అనవసర వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. స్నేహితులతో విందు వినోదాలలో పాల్గొంటారు. అభయ ఆంజనేయ స్వామి ఆరాధన మేలు చేస్తుంది.

వృశ్చికం (Scorpio) :వృశ్చికరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. దృఢమైన పట్టుదలతో ముందుకు సాగితే విజయం వరిస్తుంది. వృత్తి వ్యాపార ఉద్యోగాలలో ఒత్తిడి పెరగకుండా చూసుకోండి. తారాబలం అనుకూలంగా ఉన్నందున పని ప్రదేశంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ఉద్యోగంలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. పదోన్నతి వచ్చే అదృష్టం వుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. గణపతి ఆరాధన శ్రేయస్కరం.

ధనుస్సు (Sagittarius) :ధనుస్సురాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. సన్నిహితుల సహకారంతో పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. వ్యాపారంలో అనుకూలత ఉంటుంది. బంధువులతో విభేదాలు ఏర్పడతాయి. జీవిత భాగస్వామితో మనస్పర్థలు ఏర్పడే అవకాశముంది. ఉద్యోగంలో పనిభారం పెరగకుండా చూసుకోండి. స్థానచలనం ఉండవచ్చు. ఖర్చులు పెరుగుతాయి. హనుమాన్ చాలీసా పారాయణ మేలు చేస్తుంది.

మకరం (Capricorn) :మకరరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆర్ధిక వ్యవహారాలు విజయవంతంగా ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో ఊహించని ఇబ్బందులు, ఒత్తిడి వుండే అవకాశం వుంది. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తే మంచిది. ఇంట్లో ఒక శుభకార్యం జరగవచ్చు. ఖర్చులు పెరగవచ్చు. ఆరోగ్యం బాగుంటుంది. శివాష్టకం పఠించడం ఉత్తమం.

కుంభం (Aquarius) :వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. ప్రయత్నపూర్వక కార్యసిద్ధి ఉంది. శారీరక శ్రమ పెరగకుండా చూసుకోండి. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. నూతన వస్త్రాభరణాలు, వాహనం కొనుగోలు చేస్తారు. నిర్ణయాలలో స్థిరత్వం ఉండేలా చూసుకోండి. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ ఉత్తమం.

మీనం (Pisces) :మీనరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఇంటా బయట పరిస్థితులు మీకు అనుకూలంగా మారుతాయి. చేపట్టిన పనుల్లో విజయం సిద్ధిస్తుంది. మనోబలంతో ఓ క్లిష్టమైన పనిని సునాయాసంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. కుటుంబంలో శాంతియుతమైన వాతావరణం ఉంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. శివారాధన శ్రేయస్కరం.

ABOUT THE AUTHOR

...view details