తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

ఆ రాశి వారు నేడు ఎక్కడికెళ్లినా ప్రశంసలే- శివాలయ సందర్శన శుభప్రదం - DAILY HOROSCOPE IN TELUGU

నవంబర్ 8వ తేదీ (శుక్రవారం) రాశిఫలాలు

Daily Horoscope In Telugu
Daily Horoscope In Telugu (Etv Bharat)

By ETV Bharat Telugu Team

Published : Nov 8, 2024, 3:44 AM IST

Horoscope Today November 8th 2024 : నవంబర్ 8వ తేదీ (శుక్రవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

మేషం (Aries) :మేష రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో ధనాదాయం బాగా పెరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి ఉంది. ఇంటి అలంకరణ, పరిసరాల పరిశుభ్రతపై దృష్టి సారిస్తారు. కుటుంబ విషయాలకు సంబంధించిన చర్చలు ఫలవంతం కావడం వల్ల సంతృప్తిగా ఉంటారు. ఆరోగ్యం సహకరిస్తుంది. శివారాధన శ్రేయస్కరం.

వృషభం (Taurus) :వృషభ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. పాలనాపరమైన నైపుణ్యాలు, శక్తిసామర్ద్యాలతో సహచరులు, ఉన్నతాధికారులను ఆకట్టుకుంటారు. అందరి ప్రశంసలు, మద్దతు అందుకుంటారు. అయితే అతి అనర్ధానికి దారి తీస్తుందని గుర్తుంచుకోండి. మీ శక్తికి మించినది చేయాలని అనుకుంటే నష్టం కలుగుతుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉండవచ్చు. ఖర్చులు అదుపు చేసుకుంటే ఆర్ధిక పరిస్థితి మెరుగవుతుంది. ఇష్ట దేవతారాధన శుభకరం.

మిథునం (Gemini) :మిథునరాశి వారికి సామాన్యంగా ఉంటుంది. కొన్ని అనుకోని సంఘటనల కారణంగా మనస్తాపానికి గురవుతారు. వృత్తి పరంగా పనిఒత్తిడి పెరగడంతో ఆందోళనకు గురవుతారు. సన్నిహితులతో మంచి సమయం గడపడం, దేవాలయ సందర్శన ద్వారా ఒత్తిడిని అధిగమించవచ్చు. ఖర్చులు పెరిగే సూచన ఉంది కాబట్టి అదనపు ఆదాయ వనరులపై దృష్టి సారించండి. ఈశ్వరుని ఆలయ సందర్శన శుభకరం.

కర్కాటకం (Cancer) :కర్కాటకరాశి వారికి ఈ రోజు ఆనందకరంగా ఉంటుంది. అన్ని పనులు అనుకున్నట్లుగా జరగడం వల్ల ప్రశాంతంగా ఉంటారు. వృత్తి పరమైన ఒత్తిడి లేకపోవడం వల్ల స్నేహితులతో, కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. వ్యాపారంలో ఆశించిన మేరకు ఆర్ధిక లాభాలకు అవకాశం ఉంది. వ్యాపార భాగస్వాముల ద్వారా ప్రయోజనం పొందుతారు. ప్రియమైనవారితో విహారయాత్రలకు వెళతారు. శ్రీలక్ష్మి గణపతి ఆలయ సందర్శన శుభకరం.

సింహం (Leo) :సింహరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఈ రాశి వారు ఈ రోజు కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఎవరితోనూ వాదనలు దిగడం మంచిది కాదు. వృత్తి ఉద్యోగాలలో సవాళ్లు, సమస్యలు ఎదురు కావచ్చు. ఎంతగా శ్రమించి పని చేసినా ఫలితం నిరుత్సాహకరంగా ఉంటుంది. మీ తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు. అభయ ఆంజనేయస్వామి ఆరాధన మేలు చేస్తుంది.

కన్య (Virgo) :కన్యా రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు వుంటాయి. సంతానం భవిష్యత్ పట్ల బెంగతో ఆరోగ్యం పాడు చేసుకుంటారు. దైవబలం మీద విశ్వాసం ఉంచితే అన్ని అనుకూలంగానే ఉంటాయి. కష్టాలు కలకాలం ఉండవని గుర్తించండి. కుటుంబ శ్రేయస్సు కోసం పని చేస్తారు. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. షేర్ మార్కెట్లో పెట్టుబడులకు దూరంగా ఉంటే మంచిది. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొనడం ప్రశాంతత కలిగిస్తుంది. ఆదిత్య హృదయం పారాయణ శక్తినిస్తుంది.

తుల (Libra) :తులా రాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. వృత్తి పరంగా, వ్యక్తిగతంగా అన్ని సమస్యలకు మీ కోపమే కారణం. కోపాన్ని అదుపులో ఉంచుకోకుండా ఏ పని చేసినా సత్ఫలితం ఉండదు. సన్నిహితులతో మాట్లాడేముందు ముందూ వెనుకా అలోచించి మాట్లాడాలి. లేకుంటే సంబంధాలు దెబ్బతింటాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టండి. కోపావేశాలను అదుపులో ఉంచుకోడానికి యోగా సాధన చేయండి. కార్యసిద్ధి హనుమ ఆరాధనతో ప్రతికూలతలు తొలగిపోతాయి.

వృశ్చికం (Scorpio) :వృశ్చికరాశి వారికి ఈ రోజు అదృష్టదాయకంగా ఉంటుంది. తారాబలం అనుకూలంగా ఉన్నందున ఈ రోజు నూతన వెంచర్లు మొదలుపెట్టడానికి మంగళకరమైన రోజు. అన్ని రంగాల వారు తమ తమ రంగాలలో తిరుగులేని శక్తిగా ఎదుగుతారు. పట్టిందల్లా బంగారం కావడం వల్ల ఆనందంగా ఉంటారు. కుటుంబ సభ్యులతోనూ, రక్త సంబంధీకులతో సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. కుటుంబ సభ్యులతో చేసే ముఖ్యమైన చర్చలు సఫలం అవుతాయి. అన్ని రంగాల వారికి ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. అన్ని వైపులా అదృష్టం కలిసి రావడంతో స్నేహితులతో విహారయాత్రలకు వెళతారు. శ్రీలక్ష్మీదేవి ఆరాధన శుభప్రదం.

ధనుస్సు (Sagittarius) :ధనుస్సురాశి వారికి ఈ రోజు సాధారణంగా గడుస్తుంది. కీలక విషయాలలో నిర్ణయం తీసుకోవడంలో సందిగ్ధత, అనిశ్చితి నెలకొంటాయి. మొహమాటం కారణంగా చిక్కుల్లో పడతారు. ప్రారంభించిన పనులేవీ పూర్తి కాకపోవడం వల్ల ఆందోళన, ఒత్తిడి పెరుగుతాయి. అనుకోని రీతిలో వ్యాపారంలో నష్టాలు వస్తాయి. ఖర్చులు పెరుగుతాయి. శనిస్తోత్రం పరాయణతో ప్రతికూలతలు తొలగిపోతాయి.

మకరం (Capricorn) :మకరరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగులకు, వ్యాపారస్తులకు ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. అన్ని పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆదాయం ఆశించిన మేరకు ఉంటుంది. పదోన్నతులు పొందే అవకాశం ఉంది. వైవాహిక జీవితంలో సమస్యలు తొలగిపోతాయి. సన్నిహితులతో తీర్థయాత్రలకు వెళతారు. ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇష్ట దేవతారాధన శుభప్రదం.

కుంభం (Aquarius) :కుంభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి పరంగా ముఖ్యమైన చర్చలలో పాల్గొంటారు. మీ వాక్చాతుర్యంతో అందరినీ మెప్పిస్తారు. మీ పనితీరుకు, వాక్పటిమకు ప్రశంసలు లభిస్తాయి. ఆర్ధికంగా ఉన్నత స్థానానికి చేరుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. తీర్థయాత్రలకు ప్రణాళికలు వేస్తారు. కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ శుభకరం.

మీనం (Pisces) :మీనరాశి వారికి ఈ రోజు మంగళకరంగా ఉంటుంది. అవివాహితులకు వివాహం నిశ్చయమవుతుంది. బంధువులతో ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాలలో విజయాలు సాధిస్తారు. సామాజిక పరపతి పెరుగుతుంది. ఆర్ధిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితులతో విహారయాత్రలకు వెళతారు. విందు వినోదాలలో పాల్గొంటారు. శివాలయ సందర్శన శుభప్రదం.

ABOUT THE AUTHOR

...view details