తెలంగాణ

telangana

ETV Bharat / spiritual

ఆ రాశి వారికి నేడు అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం- సూర్య ఆరాధన శ్రేయస్కరం - DAILY HOROSCOPE IN TELUGU

నవంబర్ 22వ తేదీ (శుక్రవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Daily Horoscope In Telugu
Daily Horoscope In Telugu (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Nov 22, 2024, 3:18 AM IST

Horoscope Today November 22nd 2024 : నవంబర్ 22వ తేదీ (శుక్రవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

మేషం (Aries) :మేష రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారు తమ తమ రంగాలలో సమర్థవంతంగా పనిచేసి నూతన అవకాశాలను అందుకుంటారు. ఆర్ధిక సమస్యలు ఓ కొలిక్కి వస్తాయి. జీవిత భాగస్వామితో అనుబంధం ధృడపరచుకుంటారు. ప్రియమైన వారితో దూర ప్రయాణం చేసే అవకాశం ఉంది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

వృషభం (Taurus) :వృషభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. తీరికలేని పనులతో విశ్రాంతి లేకుండా ఉంటారు. వ్యాపార అవసరాల కోసం అవసరమైన ధనాన్ని సమకూర్చుకుంటారు. ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ బుద్ధి బలంతో పరిస్థితి చక్కదిద్దుతారు. వృత్తి పట్ల మీ అంకిత భావానికి ప్రశంసలు అందుకుంటారు. శివారాధన శ్రేయస్కరం.

మిథునం (Gemini) :మిథున రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రారంభించే పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. పనిప్రదేశంలో మీదైన ముద్ర వేసేందుకు అధికంగా శ్రమిస్తారు. మీ పనితీరుకు సహోద్యోగులు, ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఆర్థిక పరమైన ప్రయోజనాలు మెరుగ్గా ఉంటాయి. దుర్గాస్తుతి పఠించడం మేలు చేస్తుంది.

కర్కాటకం (Cancer) :కర్కాటక రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. పాత పరిచయాల ద్వారా వృత్తి పరంగా లాభం పొందుతారు. సామాజిక సంబంధాలు మెరుగవుతాయి. మీ నిజాయితీని ప్రజలు గౌరవిస్తారు. సమాజంలో గౌరవ ప్రతిష్ఠలు పెరుగుతాయి. ఇతరుల విషయంలో జోక్యం చేసుకోకపోవడమే మంచిది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ఇష్ట దేవతారాధన శుభకరం.

సింహం (Leo) :సింహ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి లక్ష్య సాధన కష్టంగా మారుతుంది. తోటివారి సహకారంతో సమస్యలు పరిష్కారం అవుతాయి. మీలోని అంతర్గత సమర్థత మిమ్మల్ని విజయపు నిచ్చెన ఎక్కిస్తుంది. అధికారుల నుంచి ప్రోత్సాహం ఉంటుంది. ఉద్యోగస్తులు నూతన బాధ్యతలను స్వీకరిస్తారు. ఆర్ధిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. ఆంజనేయస్వామి ఆరాధన శుభప్రదం.

కన్య (Virgo) :కన్యారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. నిస్వార్థ గుణంతో పరోపకార పనులు చేపడతారు. వ్యాపారస్తులు ఆర్ధికంగా మంచి లాభాలు అందుకుంటారు. స్నేహితులతో విందు వినోదాలతో సరదాగా గడుపుతారు. ముఖ్యమైన పనుల్లో జాప్యం తగదు. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

తుల (Libra) :తులారాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. భవిష్యత్తు ప్రయోజనాల కోసం పని చేస్తారు. ఆదాయం పెరుగుదల పట్ల దృష్టి పెడతారు. అనవసర ఖర్చులు తగ్గించుకుంటే మంచిది. కుటుంబ కలహాల పట్ల ఉదాసీనంగా ఉంటే అన్ని సర్దుకుంటాయి. బంధువుల ప్రవర్తన మనస్తాపం కలిగిస్తుంది. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. నరసింహ స్వామి దర్శనం శుభకరం.

వృశ్చికం (Scorpio) :వృశ్చికరాశి వారికి ఈ రోజు అదృష్టకరంగా ఉంటుంది. దైవ దర్శనాలు, ఆర్ధిక ప్రయోజనాలు ఆనందం కలిగిస్తాయి. మంచి ఆరోగ్యం, ప్రశాంతమైన మనస్సు కలిసి అద్భుతాలు చేస్తాయి. అన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. స్థిరాస్తి కొనుగోలు చేయడానికి అనువైన సమయం. ధర్మ మార్గంలో పయనిస్తే శుభ ఫలితాలు ఉంటాయి. శ్రీరామ రక్షా స్తోత్రం పఠించడం ఉత్తమం.

ధనుస్సు (Sagittarius) :ధనుస్సు రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అనారోగ్య సమస్యలు అధికం అవుతాయి. ఔషధ సేవనం తప్పదు. చికిత్స కోసం అధిక ధనవ్యయం ఉంటుంది. సహచరులతో అనవసర కలహాలు ఉండవచ్చు. ఆర్ధిక విషయాల్లో తెలివిగా వ్యవహరించకపోతే నష్టపోతారు. నవగ్రహ ధ్యానం మేలు చేస్తుంది.

మకరం (Capricorn) :మకర రాశి వారికి ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. వృత్తి ఉద్యోగాగలలో అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. అనుకోని ఆటంకాలు ఎదురవుతాయి. ఖర్చులు అధికం కాకుండా జాగ్రత్త తీసుకోండి. లేకుంటే ఆర్ధిక సమస్యలు ఉత్పన్నం అవుతాయి. పట్టుదలతో పనిచేస్తే ప్రయోజనం ఉంటుంది. ఆరోగ్య సమస్యలు నిర్లక్ష్యం చేయవద్దు. శని శ్లోకాలు పఠిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి.

కుంభం (Aquarius) :కుంభ రాశి వారికి ఈ రోజు సానుకూల ఫలితాలు ఉంటాయి. ఆర్థికంగా, వృత్తిపరంగా మంచి లాభాలను ఆర్జిస్తారు. సేవా రంగంలో పని చేసే వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. జీతాలు పెరుగుతాయి. పదోన్నతులు వస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది. స్నేహితులతో విందు వినోదాలలో పాల్గొంటారు. శ్రీలక్ష్మీ ధ్యానం శుభకరం.

మీనం (Pisces) :మీన రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మంచి సమయం నడుస్తోంది. ఈ మంచి సమయాన్ని మంచి పనుల కోసం ఉపయోదించండి. షేర్ మార్కెట్లో పెట్టుబడులు, స్పెకులేషన్లకు, స్థిరాస్తి రంగంలో పెట్టుబడులకు మంచి రోజు. అధిక లాభాలను అందుకుంటారు. ఉద్యోగస్తులకు స్థానచలనం సూచన ఉంది. కుటుంబంలో శుభకార్యాలు జరగవచ్చు. ఖర్చులు మితిమీరకుండా చూసుకోండి. ఆంజనేయ స్వామి ప్రార్ధన మేలు చేస్తుంది.

ABOUT THE AUTHOR

...view details